- డీఎస్సీ ర్యాంకర్లలో విజయోత్సాహాలు
- పేదల జీవితాల్లో వెలుగులు
- వేలాది ఇళ్లలో సంతోషాల పండుగ
- ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయని జగన్
- మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో 16,347 నియామకాలు
అమరావతి (చైతన్యరథం): డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదలతో ఏళ్ల కలలు నిజమైన వేళ… కన్నీళ్లు ఆనందభాష్పాలైన వేళ ఎన్నో ఇళ్లల్లో సంతోషాల పండుగ వచ్చింది. వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన సందర్భం. తరతరాల తలరాతలను మార్చిన అద్భుతమైన విజయోత్సవం. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు, నలుగురు… భార్యాభర్తలు, అన్నాచెల్లెళ్లు… కలిసి చదువుకొని, ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని, చివరికి విజయతీరాన్ని చేరారు. ఇది కేవలం ఉద్యోగం కాదు, ఒక తరం కష్టానికి దొరికిన గౌరవం. పేదరికం నుండి వెలుగుల వైపు వేసిన ఓ పెద్ద అడుగు. వేల కుటుంబాల సంవత్సరాల ఎదురుచూపులకు తెరపడిరది. డీఎస్సీలో ఉత్తీర్ణులయిన అభ్యర్థులు సగర్వంగా ఉపాధ్యాయ పోస్టుల్లో చేరే సుమూహర్తం ఆసన్నమయింది. ఐదేళ్ల జగన్ పాలనలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను నిండా ముంచేస్తే.. కూటమి ప్రభుత్వం రాగానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. పరీక్షలు అత్యంత పకడ్బందీగా ఎలాంటి వివాదాలకు తావు లేకుంగా నిర్వహించి, మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేశారు. మరికొద్ది రోజుల్లోనే కలలు పండిరచకుంటూ కొత్త టీచర్లు పాఠశాలల్లోకి అడుగుపెట్టనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల్లో దివంగత ఎన్టీఆర్ డీఎస్సీ నోటిఫికేషన్ విధానం తీసుకొచ్చిన తరువాత .. ఇటీవల నిర్వహించిన డీఎస్సీ 16 వది. ఈ పదహారు డీఎస్సీల్లో 13 టీడీపీ ప్రభుత్వాల హయాంలో జారీ చేసినవే కావటం విశేషం.
రేపటి తరాన్ని ఉత్తమ పౌరులుగా ప్రతిభా పాటవాలతో తీర్చి దిద్దే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో రాజకీయ జోక్యం కన్నా కేవలం వారి ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరగాలి అనే సదుద్దేశ్యంతో దివంగత నందమూరి తారక రామారావు పాలనా హయంలో డీఎస్సీ వ్యవస్థ అమలులోకి తీసుకువచ్చారు. నాటి నుంచి ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసి, రాత పరీక్షలు నిర్వహించి, ఆయా అభ్యర్థులు కనబరిచిన ప్రతిభ ఆధారంగానే వారికి నియామక ఉత్తర్వులు ఇవ్వడం అనే పారదర్శక వ్యవస్థ అమలులోకి వచ్చింది.
ఇప్పటి వరకు విడుదల చేసిన 16 డీఎస్సీ నోటిఫికేషన్లులో ఎన్టీఆర్ హయాంలో 3 నోటిఫికేషన్లు విడుదల చేసి టీచర్ల నియామకాలు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రం, విభజిత ఏపీలో కలిపి చంద్రబాబు మొత్తం 9 సార్లు డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేశారు. వైఎస్ హయాంలో 2 సార్లు, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 1 సారి డీఎస్సీ నిర్వహించారు. తాజాగా నిర్వహించిన డీఎస్సీ 16వది. ఇది కూడా సీఎం చంద్రబాబు హయాంలోనే కావటం విశేషం.
జగన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు తనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి అధికారం కట్టబెడితే తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహణ ద్వారా పెండిరగ్‌లో వున్న ఉపాధ్యాయ ఖాళీలు మొత్తం భర్తీ చేస్తానని నిరుద్యోగ యువతను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచాడు. అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగు మీడియం రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం అమలులోకి తేవడం.. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ‘‘నాడు – నేడు’’ పేరిట స్కూళ్లకు రంగులు వేయడం మీద పెట్టిన శ్రద్ధ పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయ నియామకాల పట్ల చూపలేదు. నిరుద్యోగులు ఆశగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసినా జగన్ రెడ్డి డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. ఎన్నికలు ముంచుకు వచ్చిన సమయంలో నిరుద్యోగ యువతను మభ్యపెట్టడం కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు నెల ముందు కేవలం 6,000 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేసారు. తీరా చూస్తే ఎన్నికల కోడ్ కారణంగా ఆ నోటిఫికేషన్ అమలుకు నోచుకోలేదు. డీఎస్సీ విధానం అమలులోకి వచ్చిన తరువాత 5 సంవత్సరాలు పూర్తి కాలం పాలన చేసి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వని ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చెత్త రికార్డు సృష్టించాడు.
తన ఐదేళ్ల పాలనా కాలంలో మైక్ దొరికిన ప్రతి సారి తన పాలనలో ‘‘పేద వాడికి పెత్తందార్లకి యుద్ధం’’ జరుగుతోందని, తాను పేదల పక్షపాతిని అని ఊదర గొట్టిన జగన్ రెడ్డి పేదల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలకు మాత్రం ఉపాధ్యాయులను నియమించలేకపోయాడు. ఇక్కడే తెలుస్తోంది పేదల పట్ల జగన్ చిత్తశుద్ధి. అదే సమయంలో ఇప్పటిది కాక.. ఇంతకు ముందు 12 సార్లు డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసి అన్న ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి సుమారు 2 లక్షల మంది ఉపాధ్యాయుల నియామకాలు జరిపారు. అయినప్పటికీ ఎలాంటి వివాదాలు లేకుండా నిర్వహించిన తాజా డీఎస్సీ మీద కూడా జగన్, వైసీపీ పేటీఎం బ్యాచ్ సిగ్గు ఎగ్గు లేకుండా తప్పుడు విమర్శలు చేయటం వారి దిగజారుడు తనానికి నిదర్శనం.