- మునిగి పోయిందంటూ తప్పుడు ప్రచారం
- జగన్‌రెడ్డికి దైర్యముంటే వచ్చి చూడాలి
- మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
మంగళగిరి(చైతన్యరథం): రాజధాని అమరావతి మునిగి పోయిందంటూ వైసీపీ నాయకులు, వారి అనుకూల మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వ రరావు తీవ్రంగా ఖండిరచారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాల యంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో 52 వేల కోట్లతో జరుగు తున్న నిర్మాణాలను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు బ్లూ మీడియా సహకారంతో విషప్రచారం చేస్తున్నారు. ఎక్కడో వాగులు పొంగిన దృశ్యాలను తీసుకువచ్చి అమరావతి మునిగిపోయిందంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లు పనిచేయడం లేదని, కొండవీటి వాగు నీటితో పంటలు మునిగిపోయాయని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు.. ఇరిగేషన్ శాఖ అధికారులు వాటిని ఖండిస్తూ ఫిర్యాదులు కూడా నమోదు చేసిన విషయాన్ని దేవినేని గుర్తుచేశారు. కంభంపాడు ప్రాంతంలో వాగులు పొంగిన దృశ్యాలను అమరావతితో కలిపి చూపించడం వైసీపీ బ్లూ మీడియా దుష్ప్రచారానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
జగన్‌రెడ్డికి నిజంగా ధైర్యం ఉంటే అమరా వతి వచ్చి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఎస్‌ఆర్‌ఎం యూని వర్సిటీ చూసి వెళ్లాలి. అక్కడ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయో స్వయంగా పర్యవేక్షించి తెలుసుకోవాలి. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని లేదా బెంగళూరు ప్యాలెస్‌లో సత్కారాలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టడం తప్ప వేరే పనిచేయడం లేదని ధ్వజమెత్తా రు. జగన్ పాలనలో అమరావతి రైతులపై దమనకాండ నడిపా రని, వేలాది కేసులు పెట్టి జైలుకు పంపారని, పనులు ఆపేసి మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసగించారని విమర్శిం చారు. అదే కారణంగా ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమి తం చేశారు. తాజాగా పులివెందుల, ఒంటిమిట్టలో కూడా వైసీపీ ఓటమిపాలైంది. డిపాజిట్లు కోల్పోయే స్థితికి పడిపోయింది. ఇంత పరాభవం ఎదురైనా జగన్ అసలు సత్యాన్ని అంగీకరించకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
సూపర్‌సిక్స్ పథకాలే వైసీపీ అసహనానికి కారణం
చంద్రబాబు సర్కారు ప్రారంభించిన సూపర్‌సిక్స్ పథకాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమవుతున్నాయి. రైతులు, మహిళలు, పింఛన్‌దారులు అందరూ లబ్ధి పొందుతున్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీ శక్తి, మూడు గ్యాస్ సిలిండర్లు, విద్యా పథకాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. మహిళలు సోషల్ మీడియాలో తమ ఖాతాల్లో డబ్బులు పడుతున్న వీడియోలు పంచుకుంటుంటే జగన్ తట్టుకోలేక అసహనంతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
స్వాతంత్య్ర వేడుకల్లోనూ పాల్గొనలేదు
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కూడా జగన్ హాజ రుకాలేదని విమర్శించారు. దేశమంతటా అమరవీరులను స్మరిం చుకుంటూ జాతీయ పతాకాలు ఎగురవేస్తున్న వేళ, జగన్ మాత్రం ప్రజల ముందుకు రాకుండా తాడేపల్లి ప్యాలెస్‌లో తలదాచుకున్నా రు. ఓటమి భయం, మానసిక అసహనం ఆయనను ఇంతలా దిగ జార్చిందని ఎద్దేవా చేశారు. అమరావతి మునిగిపోయిందంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేసే బ్లూ మీడియా, సోషల్ మీడియా పేజీలపై ప్రభుత్వం ఇప్పటికే కేసులు నమోదు చేసిందని గుర్తుచే శారు. ఇకపై కూడా ఎవరైతే ఇటువంటి ఫేక్ న్యూస్ వ్యాపింపజేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.