- ప్రసన్న వ్యాఖ్యలు ఆ పార్టీ వైఖరిని బయటపెట్టాయి
- ప్రశాంతిరెడ్డికి నారా భువనేశ్వరి సంఫీుభావం
అమరావతి (చైతన్యరథం): కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తప్పుబట్టారు. మహిళల పట్ల వైసీపీ ద్వేషాన్ని ఆ వ్యాఖ్యలు బహిర్గతం చేశాయన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో భువనేశ్వరి పోస్ట్ చేశారు. ఆ పార్టీ మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రసన్న వ్యాఖ్యలు బహిర్గతం చేశాయన్నారు. మహిళల పట్ల వైసీపీ తీరు సిగ్గుచేటు.. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి నా సంఫీుభావం ప్రకటిస్తున్నా. ప్రశాంతిరెడ్డిపై చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. మహిళల పట్ల అవమానకర పదాలు వారి విలువను తగ్గించలేవు. అనాది నుంచి మన సంస్కృతి, విలువలు మహిళల పట్ల గౌరవాన్ని నిలబెట్టాయి. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నయినా ఖండిరచాల్సిందే. ప్రతి స్త్రీ గౌరవానికి మద్దతు ఇచ్చేందుకు ఐక్యంగా నిలబడతామని భువనేశ్వరి స్పష్టం చేశారు.