- పట్టించినా పోలీసులు విడిచిపెడుతున్నారు
- ప్రజావినతుల్లో బాధితుడి ఫిర్యాదు
- అర్జీలు స్వీకరించిన పట్టాభి, కె.కె.చౌదరి
మంగళగిరి(చైతన్యరథం): తమ గొర్రెలను వైసీపీ పార్టీ వారు దొంగతనం చేస్తుండ గా తాము స్వయంగా పట్టించినా కేసు పెట్టకుండా పోలీసులు వారిని విడిచిపెడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం కొలకల్లు గ్రామానికి చెందిన పి.జమ్మన్న ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ప్రజా వినతుల్లో దొంగలను అరెస్టు చేసి తనకు న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం ఇచ్చారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఖాదీ గ్రామీణ పరి శ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి అర్జీలు స్వీకరించారు.
` తమ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం వీరారె డ్డిపల్లె గ్రామానికి చెందిన తుమ్మూరు కోటిరెడ్డి ఫిర్యాదు చేశాడు. తమ వద్ద ఉన్న డాక్యు మెంట్లను పరిశీలించి భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
` యానాదులమైన తమకు భూమి అమ్ముతానని తమ వద్ద డబ్బులు తీసుకుని మోహన్‌రావు అనే వ్యక్తి మోసగించాడని చిత్తూరు జిల్లా వి.కోట మండలం రామనాథపు రం గ్రామానికి చెందిన పి.కె.సరస్వతి ఫిర్యాదు చేశారు.
` తమ భూమిని సర్వే చేసి రాళ్లు పాతాలని ఎన్నిసార్లు అధికారులకు అర్జీ పెట్టుకు న్నా సర్వేయర్లు అసలు పట్టించుకోవడం లేదని అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి గ్రామానికి చెందిన రంగయ్య ఫిర్యాదు చేశాడు. తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
` గత వందేళ్లకు పైగా తాము వారసత్వంగా అనుభవిస్తున్న భూమికి పాస్ పుస్తకా లు ఇచ్చి తమ పేరుపై ఆన్‌లైన్ చేయాలని అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఇమ్మ పాలెం గ్రామానికి చెందిన దుల్ల శంకరరావు వినతిపత్రం ఇచ్చాడు.
` తనకు గుంటూరు జిల్లా పెదనందిపాడులో 2.16 ఎకరాల భూమి ఉండగా రెవెన్యూ రికార్డుల్లో తగ్గించి చూపుతున్నారని ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన విద్యా ధరరావు తెలిపాడు. సరిచేయాలని ఎన్నిసార్లు అధికారులకు అర్జీ ఇచ్చినా పట్టించు కోవడం లేదని ఫిర్యాదు చేశాడు.
` మంగళగిరి పరిధిలో తమకు 1.76 ఎకరాల భూమి ఉండగా 1.40 ఎకరాలుగా తగ్గించి చూపుతున్నారని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రాయపాటి రాఘవమ్మ తెలిపింది. తప్పును సరిచేసి తమ భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించాలని విజ్ఞప్తి చేశారు.