- ఐదేళ్లూ ఎందుకు మాట్లాడలేదు?
- ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోం
- పెన్షన్లపైనా తప్పుడు ప్రచారం చేస్తోంది
- అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్‌ను తొలగించం
- కూటమి పాలనపై నమ్మకానికి
- పులివెందుల, ఒంటిమిట్ట విజయాలు
- మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
అమరావతి(చైతన్యరథం): విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితు ల్లోనూ ప్రైవేటీకరించబోమని, స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విశాఖ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం అమరావ తిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లూ స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించ బోమని స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారో బొత్స సత్యనారాయణ చెప్పాలని మంత్రి నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్, నవశకం సర్వేల పేరుతో అర్హుల పెన్షన్లు తొలగించారని అన్నారు. ఆ విధం గా తాము చేయలేదన్నారు. పింఛన్ల వెరిఫికేషన్ మాత్రమే జరు గుతోంది..అర్హులైన ఏ ఒక్కరి పింఛన్‌ను తొలగించబోమని చెప్పా రు. కూటమి పాలనపై నమ్మకంతోనే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారని తెలిపారు. జగన్, వైసీపీ నేతల తప్పుడు ప్రచారాల్ని ప్రజలు ఛీత్కరించుకుం టున్నారని మండిపడ్డారు.