- అభివృద్ధిని ఓర్వలేక దుష్ప్రచారం
- అందుకే పులివెందులలో ఓడిరచారు
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి
మంగళగిరి(చైతన్యరథం): వైసీపీ అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమైనా ఇంకా బుద్ధిరాలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ కూటమి ప్రభుత్వంపై నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. అభివృద్ధి సాధించామని చెప్పి ఐదేళ్లూ కాలయాపన చేశారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లా రు. కూటమి ప్రభుత్వం ఈ 14 నెలల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్చుకోలేకపోతోంది. ఫేక్ ప్రచారాలతో మనుగడ సాధిస్తూ తమ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రకాశం బ్యారేజి గేట్లు దిబ్బతిన్నాయని, నీరు వెళ్లడంలేదని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఒకసారి జగన్‌ని, తన బృందాన్ని ప్రకాశం బ్యారేజ్‌పైకి వెళ్లి చూడాల్సిందిగా సూచి స్తున్నాను. ప్రకాశం బ్యారేజికి 70 గేట్లు ఉంటే 69 గేట్లు ఎత్తడంతో బ్రహ్మాండంగా నీరు పోతున్నాయి. పోతున్న నీరంతా సముద్రంలో కలిసి వృధా అవుతున్నాయి. అలా వృధా కాకుండా ఆ నీటిని వినియోగించుకు నేందుకు రాష్ట్రంలో బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని చంద్రబాబు ఉద్దేశం. అయితే వైసీపీ బనకచర్ల ప్రాజెక్టుపై ఇప్పటికి వారి ఉద్దేశం తెలపలేదు. పక్క రాష్ట్రాలతో చేతులు కలిపి తిట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
వైసీపీ ఫేక్ ప్రచారాలు చేయడంలో దిట్ట. తీవ్ర వర్షాలతో అమరావతి మునిగిపోతోందని ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ సహకా రంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా జరుగుతు న్నాయి. వర్షాలు రావడం సహజం. వరదలు వస్తుంటాయి, వంకలు, వాగుల్లో నీరు రావడం జరుగుతుంటుంది. చిన్నపాటి వరద వచ్చినా అమరావతి మునిగిపోయిందని మాట్లాడుతారు. బుడమేరుకు వరదొచ్చింది, బుడమేరు ద్వారా ఊరంతా మునిగి పోతోందని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. పదేళ్లకో, 20 ఏళ్లకో వరదలొస్తుంటాయి. దానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుత ప్రభు త్వం ఏర్పాట్లు చేస్తోంది. బుడమేరు ద్వారా విజయవాడ, అమరా వతి మునిగిపోయాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాల ద్వారా తన ఉనికిని కాపాడుకోవాలని చూస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక మామిడి, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించింది. అమరావతిని భ్రమరావతి అని, కమ్మ రాజధాని అని, మునిగిపోతుందని ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వదని రక రకాల కట్టుకథలన్నీ చెప్పారు. రాజధాని నిర్మాణం గ్రాఫిక్స్ అన్నారు. ఇవన్నీ ఉనికిని కాపాడుకునేందుకే. వరదలు సహాయక చర్యల కోసం కొవ్వొత్తులు, అగ్గిపెట్టల కోసం 23 లక్షలు ఖర్చుపెడితే 23 కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ ఒక ఫేక్ ప్రచారం చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రం ఆకర్షించని విధంగా చంద్రబాబు పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. చంద్రబాబు బ్రాండ్ తో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబ డులు వస్తున్నాయి.
టీసీఎస్ వంటి సంస్థలకు భూములు కేటా యిస్తే వాటిపై కూడా ఆరోపణలు చేసి కోర్టుల్లో కేసులు వేశారు. తల్లికి వందనం, గ్యాస్ సిలెండర్లు, అన్నదాత సుఖీభవ, సూపర్ సిక్స్‌పై కూడా వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోంది. అబద్ధపు మాటల తో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. తల్లికి వందనం కింద జగన్ ఇంటిలో ఒకరికే ఇచ్చేవారు. మా ప్రభుత్వం వచ్చాక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం. పోలవరం ప్రాజెక్టు పనులు అద్భుతంగా జరుగుతు న్నాయి. అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో వరదలు వచ్చినప్పటికీ చురుగ్గా పనులు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. రాయల సీమలో హంద్రీ-నీవా లైనింగ్ పనులు పూర్తయి చివరి ఆయక ట్టు వరకు కృష్ణా జలాలను తీసుకుపోతున్న ఘనత చంద్రబాబు ది. జీఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టుకు కూడా నేడు అడ్మినిస్ట్రేటివ్ మంజూరు చేసి వెయ్యి కోట్లు కేటాయించి కడప వరకు దాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. జగన్ హయాంలో మూడు సార్లు స్టీల్ ఫ్యాక్టరీకి టెంకాయలు కొట్టిపోయారు. ఒక్క అంగుళం పనులు కూడా ముందుకు పడలేదు. నేడు స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాం. జిందాల్ వారితో అద్భుతంగా ఈ ప్రాజెక్టు ముందుకెళుతోంది. దానిపై కూడా ఫేక్ ప్రచారం. చంద్రబాబు పారదర్శక ఎన్నికల విధానాన్ని స్వాగతిస్తారు. పులి వెందుల ప్రజలు రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు చూసి టీడీపీకి పట్టం కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఖాళీ అవుతోంది. అనేకమంది టీడీపీలో చేరుతున్నారు. 20 ఏళ్ల పాటు చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రం ఎంతో ముందు కుపోతుంది. వైసీపీకి అధికారమిచ్చిన పని మళ్లీ చేయకూడదని ప్రజలు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారని తెలిపారు.