అమరావతి (చైతన్యరథం): ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. మత్స్యకారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందన్నారు. వేట నిషేధ సమయంలో భృతిని రూ.20వేలకు పెంచామన్నారు. మత్స్యకారుల జీవనోపాధికి ముప్పుగా మారిన వైసీపీ హయాంలో తెచ్చిన జీవో నంబరు 217 మా ప్రభుత్వం రద్దు చేసింది. లక్షలాది మంది ఉపాధికి భరోసా కల్పించాం. మత్స్య సంపద ఉత్పత్తిలోనూ రాష్ట్రాన్ని అగ్రపథాన నిలుపుతామని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.













