విశాఖపట్నం (చైతన్యరథం): ఆస్ట్రేలియా కాన్సలేట్ జనరల్ సిలాయ్ జాకి, జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రస్తుతం జేమ్స్ కుక్ యూనివర్సిటీ సింగపూర్ క్యాంపస్ ఆగ్నేసియా, భారతీయ విద్యార్థులకు సేవలందిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ యువత కోసం పర్యావరణ, ఆరోగ్య సంరక్షణ, సస్టయినబుల్ టూరిజం రంగాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో 1057 కి.మీ.ల సువిశాల సముద్రతీరం ఉంది. ఫిషింగ్, ఆక్వాకల్చర్, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థ నిర్వహణపై మారిటైమ్, తీర ప్రాంత పరిశోధనలకు ఏపీ వర్సిటీలతో కలసి పనిచేయండి. గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో ట్రోపికల్ వ్యాధులు, ఆరోగ్య సంరక్షణ, పాండమిక్ ప్రిపేర్డ్ నెస్ పై ఏపీ వర్సిటీలతో కలసి ఉమ్మడి పరిశోధనలు చేపట్టండి. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా టెక్నాలజీ, పాలసీ రీసెర్చికి సహకారం అందించండి. వ్యవసాయ, పట్టణ నీటి అవసరాలకు జలవనరుల నిర్వహణలో నైపుణ్యం కోసం ఏపీతో కలసి ట్రోఫికల్ వాటర్ రీసర్చ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.













