- ప్రధాని ప్రసంగం పాక్ ఉగ్రమూకకు హెచ్చరిక
- భారత్‌కు కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మోదీజీ
- ప్రధాని ప్రసంగాన్ని సమర్థిస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్
అమరావతి (చైతన్య రథం): భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో భారతదేశ కొత్త సిద్ధాంతాన్ని రూపొందించారు. మోదీజీ ప్రసంగం పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదులకు కఠినమైన హెచ్చరిక. ప్రపంచానికి భారత బలాన్ని తెలియజేసే స్పష్టమైన సందేశం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. నేడు బుద్ధ పూర్ణిమ. మనం శాంతి మార్గాన్ని అనుసరిస్తాము. కానీ, చరిత్ర మనకు బోధించినట్టుగా శాశ్వత శాంతి బలం ద్వారానే లభిస్తుంది. మనం శాంతిమార్గంలో నడుస్తాము. అలాగని ఉగ్రవాదాన్ని ఉపేక్షించం.
నేడు, భారతదేశం దాని పురాతన ఆధ్యాత్మిక వారసత్వం మరియు అత్యాధునిక సామర్థ్యాలు.. రెడిరటిలోనూ ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని కలిగివుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో.. ప్రాయోజిత ఉగ్రవాదానికి ఆజ్యం పోసిన పాక్ మౌలిక సదుపాయాలను నాశనం చేయడానికి భారత్ అభివృద్ధి చేసిన స్వదేశీ డ్రోన్‌లు, ఆయుధాలను విజయవంతంగా మోహరించాం. మన మేడ్-ఇన్-ఇండియా రక్షణ, సాంకేతికత, మన దేశాన్ని రక్షించడానికి ఆధునిక యుద్ధానికి మన సంసిద్ధతను చూపించింది, ఇది ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది. ప్రధాని మోదీ నాయకత్వంలో, మన దేశం ఉన్నతంగా నిలుస్తోంది. ఉద్దేశ్యంలో శాంతియుతంగా ఉంటుంది. శక్తిలో బలీయమైనది. భారతీయులుగా మనం ఐక్యంగా ఉంటాము. ఎల్లప్పుడూ దేశాన్ని ముందుంచుతాము’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.