టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనగానే ఐటీ అభివృద్ధి, ఈ-గవర్నెన్స్, సంస్కరణలే కాదు. సమాజంలో.. మహిళలు శక్తివంతులుగా ఎదగడానికి.. ఆయన చేసి కృషిని ప్రముఖంగా చెప్పుకోవాలి. మరో రకంగా చెప్పాలంటే.. మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం తెలుగుదేశం పార్టీనే.. మహనీయుడు ఎన్టీఆర్ పాలనలో మగవారితో సమానంగా ఆస్తిహక్కు, తిరుపతిలో తొలి మహిళా యూనివర్శిటీ ఏర్పాటు, రాజకీయాల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు,సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసి.. మహిళలకు ఆత్మగౌరవం కల్పించారు. ఎన్టీఆర్ తర్వాత.. చంద్రన్నపాలనలోనే.. మహిళలు.. ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు. పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం.. డ్వాక్రా సంఘాల ఏర్పాటు.. మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. దేశంలోనే తొలి మహిళా స్పీకర్ ప్రతిభాభారతి నియామకం, తొలి మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహణ చంద్రబాబుకే సాధ్యమైంది.
మహిళలను శక్తివంతులుగా చేయడాని.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. మహిళ పేరు మీదనే ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, భూమి కొనుగోలును టీడీపీ హయాంలోనే చేపట్టారు. మగవారితో సమానంగా సమాజంలో మహిళలు ఎదగడానికి.. మహిళా కండకర్ల నియామకం, రైతు బజార్ల నిర్వహణ, జనరిక్ షాపులు, ఇసుక ర్యాంపుల నిర్వహణ బాధ్యతలు మహిళలకే అప్పగించారు. దీపం పథకం ప్రవేశపెట్టి 61 లక్షల మంది పేదింటి మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు..రూ.8500 కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు. పసుపు – కుంకుమ కింద రూ.10,000 కోట్లు ఇచ్చారు. వడ్డీ రాయితీ కింద రూ.2,514 కోట్ల సాయం చేశారు. అభయహస్తం పథకం కింద డ్వాక్రా మహిళలకు పెన్షన్లు అందించారు. ఎస్సీ,ఎస్టీల మహిళల ఆర్థిక పురోగతికి ఉన్నతి పథకం ప్రవేశ పెట్టారు.
మహిళలు అన్ని రంగాలలో రాణించి.. ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ధ్యేయంగా .. టీడీపీ అధినేత చంద్రబాబు పనిచేశారు. చంద్రన్న పాలనలోనే మహిళా విప్లవం సాధ్యమైంది. పుట్టిన బిడ్డకు బ్యాంకులో రూ.5 వేల డిపాజిట్ చేసి 12 ఏళ్ల వరకు వడ్డీ ఇచ్చేలా బాలిక శిశు సంరక్షణ పథకం ప్రారంభించారు. ఆడపిల్లలు.. సమాజంలో ఉన్నతస్థితికి రావాలంటే.. బాగా చదవుకుని ఉండాలి. అందుకు పాఠశాలలకు వెళ్లే 8,9,10 తరగతి విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీని ప్రారంభించారు. రక్ష పథకం కింద స్కూల్ విద్యార్థినులకు శానిటరీ న్యాప్కిన్లు ఇచ్చారు. 35 ఏళ్లు దాటిన మహిళలకు మాస్టర్ హెల్త్ చెకప్ పేరుతో 11 రకాల పరీక్షలు, అన్న అమృత హస్తం కింద 27 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పథకం ఇచ్చారు. నవజాత శిశువులకు ఎన్టీఆర్ బేబీకిట్లు, తల్లి బిడ్డా ఎక్స్ ప్రెస్ పథకం కింద చిన్నారులకు బాలామృతం, గర్భిణీలకు ఆర్థిక సాయం అందించారు. వితంతువులకు పెన్షన్లు ఏర్పాటు చేశారు. సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసనలు,పెళ్లి కానుక కింద ఆర్థిక సాయం అందించారు. మహిళ భద్రతకు ఫోర్త్ లయన్ యాప్, షీ టీమ్ ల ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదే.
మహిళా శక్తిని మహాశక్తిగా చేయాలని, పేదవారిని ధనికులుగా చేయాలనే ధృఢ సంకల్పంతో .. రాజమండ్రి టీడీపీ మహానాడులో తొలి మేనిఫెస్టో ప్రకటించారు. మహాశక్తి పథకాలు .. రాష్ట్రవ్యాప్తంగా.. మహిళల్లో జోష్ నింపింది. టిడిపి ప్రకటించిన తొలి మేనిఫెస్టోలో మహిళలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించేలా.. 18 నుండి 59 సంవత్సరాల మహిళల ఖాతాలో నెలకు 1,500 రూపాయలు.. తల్లికి వందనం పేరుతో 15,000 వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. మహిళలకు దీపం పథకం కింద .. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. వంటి ప్రత్యేకమైన సంక్షేమ పథకాలు ఉన్నాయి. మహానాడులో ప్రకటించిన మహిళా సంక్షేమ పథకాలను .. ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు.. ఎన్టీఆర్ భవన్ లో .. మహాశక్తి చైతన్య పాదయాత్ర వాహనాలను.. చంద్రబాబు ప్రారంభించారు. మహిళా సంక్షేమ పథకం ప్రయోజనాలు వివరించేలా.. మహాశక్తి చైతన్య వాహనాలపై పోస్టర్లు కూడా ఉన్నాయి. వచ్చే 50 రోజుల పాటు.. 175 నియోజకవర్గాల్లో .. 7 వేల గ్రామాల్లో 20 లక్షల మంది మహిళలను కలిసే విధంగా కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు .. సంక్షేమ పథకాలు వివరించేందుకు.. టీడీపీ నియోజకవర్గ .. టీడీపీ మహిళా ఇంఛార్జ్ లు, మహిళా కార్పొరేటర్లు, కౌన్సిలర్స్.. గ్రామస్థాయిలో మండల స్థాయి మహిళా నేతలు పాల్గొంటారు.