అమరావతి (చైతన్యరథం): తోడబుట్టిన అక్కాచెల్లెళ్లు లేని తనకు దేవుడిచ్చిన కోట్లాది మంది తోబుట్టువులకు విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లికి వందనం చేసి, స్త్రీశక్తిని మహాశక్తిగా మార్చే మా సంకల్పానికి ఆడపడుచుల అనురాగబంధమే బలం అన్నారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా మీరు కడుతున్న రాఖీ సాక్షిగా ఇదే నా హామీ.. అన్నగా, తమ్ముడిగా మీ రక్షణ మా బాధ్యత అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.