- అన్ని పార్టీలు ఆమోదించిన అమరావతిపై జగన్ ముఠా ఒక్కటే ఎందుకు దాడి?
- మితిమీరిన దుర్యోధనుని అసూయతోనే కదా కురువంశం కూలిపోయింది
- ప్రభుత్వానికి మిగిలే భూములపై వచ్చే రూ.2 లక్షల కోట్ల ఆదాయంలో కొంత భాగంతోనే అమరావతి నిర్మాణం
- పొరుగు రాష్ట్రాలకు దీటైన రాజధాని లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం?
- దేశమంతా గుర్తించేలా ఆంధ్రుల రాజధాని ఉండకూడదా?
- అమరావతిపై విద్వేష ప్రచార దాడి రాష్ట్ర ద్రోహమే
- మూడు ముక్కలాటతో తమ దోపిడీపై దృష్టి మళ్లించే కుట్ర చేస్తున్న జగన్ ముఠా
- రూ. 7 లక్షల కోట్ల పెట్టుబడుల్లో అధిక భాగం రాయలసీమ, ఉత్తరాంధ్రలకు కేటాయించిన కూటమి ప్రభుత్వం
- దారి మళ్లించకుండా కేంద్ర నిధులు స్థానిక సంస్థలకు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
- సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికే
- పీ4 ద్వారా ప్రతి కుటుంబ అభివృద్ధికి పాటుపడుతున్న చంద్రన్న ప్రభుత్వం
- పోలవరం` నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు సాగునీరు సరఫరా
- 175 నియోజకవర్గాలకు 175 పారిశ్రామిక పార్కులు మంజూరు
- ఒకే రాజధాని` అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ సంకల్పం
- అవినీతి విష పుత్రిక సాక్షి ఉద్యోగి కుతంత్రం – 20
‘‘వేదనలో రాజ్యం… వేడుకలో రాజధాని’’ అనే క్యాప్షన్‌తో వర్థెల్లి మురళి 04.05.2025వ తేదిన సాక్షి పత్రికలో వాస్తవాన్ని తలకిందులు చేసి మరో రివర్స్ వ్యాసం రాశారు. ప్రజా రాజధాని అమరావతి పున ప్రారంభ సభకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది మంది హాజరై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్న సభను జయప్రదం చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు అమరావతి పున నిర్మాణాన్ని స్వాగతించాయి. జగన్ కూడా అమరావతి నిర్మాణానికి 30 వేల ఎకరాలకు తగ్గకుండా రాజధానిని నిర్మించాలని శాసనసభలో మాట్లాడిరది రికార్డులో ఉంది. నేడు మాట తప్పి, మడమ తిప్పి జగన్ ముఠా అమరావతిపై అబద్ధాలతో విద్వేష ప్రచార దాడి చేస్తున్నారు. ‘‘వేదనలో రాజ్యం-వేడుకలో రాజధాని’’ అంటూ వాస్తవాన్ని తలకిందులు చేస్తూ అసూయ వెళ్ళగక్కుతున్నారు
చలం చెప్పిన చందంగా జగన్ :
‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ – ప్రపంచపు బాధంతా శ్రీశ్రీ బాధ’ అన్న చలం సూక్తి జగన్ ముఠాకు కూడా సరిపోతుంది. జగన్ దోపిడీ ముఠా ప్రస్తుత బాధల్ని రాష్ట్ర బాధగా రుద్దే కపట ప్రచారం చేస్తున్నారు. జగన్ పాలనలో తమ ధన, మాన, ప్రాణాలను, ఆస్తులకు రక్షణ కోల్పోయి వేదనకు గురైన రాష్ట్ర ప్రజలందరూ నేడు సంతోషంగా ఉన్నారు. స్వేచ్ఛ అనుభవిస్తున్నారు. మితిమీరి దోపిడీ చేసిన జగన్ ముఠా మాత్రమే వేదనలో ఉంది. రాష్ట్ర ప్రజల వేడుక కోసం, పొరుగు రాష్ట్రాల రాజధానుల కు దీటైన రాజధాని నిర్మాణం కోసం, దేశమంతా గుర్తించేలా ఆంధ్రుల రాజధాని నిర్మాణం కోసం.. చంద్రబాబు తన ప్రతిష్టను, కఠోర కష్టాన్ని ధారబోస్తున్నారు.
దుర్యోధనుని మితిమీరిన అసూయతోనే కురువంశం నాశనం
ఫ్యాక్షనిస్టు కాకుండా ప్రజా నాయకుడైతే అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాల్ని అభిమానించాలి. విద్వేషం, అసూయ లాంటి వినాశకర లక్షణాలకు దూరంగా ఉండాలి. అన్ని పార్టీలు ఆమోదించిన అమరావతిపై జగన్ ముఠా ఎందుకు దాడి చేస్తోందో తెలియడంలేదు. అసెంబ్లీ సాక్షిగా, ఏకైక రాజధానిగా అమరావతిని సమర్థించిన జగన్ ఎందుకు మాట తప్పి, మడమ తిప్పారు? అమరావతిపై అబద్ధాల దాడి, విద్వేష దాడి ఎందుకు చేస్తున్నారు? ఇది ప్రజానాయకత్వ లక్షణానికి విరుద్ధం కాదా? అందరిదీ ఒకదారి అయితే ఉలిపి కట్టెది మరోదారి అన్న విధంగా లేదా? జగన్ ఐదేళ్ల పాలనలో మితిమీరి దోపిడీ చేశారు. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు నాశనం చేశారు. మద్యం ధరలు పెంచి లక్ష కోట్ల కుంభకోణం చేశారు. ఇలా నేరాలు చేసిన వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నది కూటమి ప్రభుత్వం. ఈ దోపిడీ పైనుండి ప్రజల దృష్టి మళ్లించడానికి కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నది జగన్ ముఠా. తమ కంట్లో ఉన్న దూలాలని కప్పేట్టుకునేందుకు ఎదుటివారి కంట్లో లేని నలుసులు వెతికే కుతంత్రం చేస్తున్నది. ఇందులో భాగమే అమరావతిపై విద్వేష ప్రచారం. నేటి ధరలకు అనుగుణంగా అంచనాలు సవరించడం ప్రతి ప్రభుత్వం చేస్తున్నదే. జగన్ కూడా అంచనాలు రెట్టింపు చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. రుషికొండ నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా జగన్ ప్రభుత్వం ఖర్చు ఎందుకు చేసింది? అమరావతిలో దానిలో సగం కన్నా తక్కువ ఖర్చుతో చేసే నిర్మాణాలపై చేసే ప్రచారం పచ్చి అబద్ధం మాత్రమే.
ఒకే రాజధాని` అభివృద్ధి వికేంద్రీకరణ
పెట్టుబడుల ఆకర్షణకు, ఉద్యోగాల కల్పనకు పొరుగు రాష్ట్రాల రాజధానులకు దీటైన అమరావతి నిర్మాణం అవసరమని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అమరావతి నిర్మాణంతోపాటు ఆకర్షించిన ఏడు లక్షల కోట్ల పెట్టుబడులతో అధిక భాగం రాయలసీమ, ఉత్తరాంధ్రలలో పరిశ్రమలు నిర్మించబోతున్నారు. 175 నియోజకవర్గాలకు 175 పారిశ్రామిక పార్కులను మంజూరు చేస్తున్నారు. పోలవరం` నదుల అనుసంధానంతో రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే కృషి జరుగుతోంది. జగన్ పాలనలో స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసిన వేల కోట్లు దారి మళ్లించి వికేంద్రీకరణ పై గొడ్డలి వేటు వేశారు. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించి సామాజిక న్యాయం గొంతు కోశారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన నిధులు.. పంచాయితీలు, మున్సిపాలిటీలకు ఇచ్చి నిజమైన వికేంద్రీకరణ స్ఫూర్తి చాటింది. అలాగే సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల స్వయం ఉపాధి పథకాలకు ఇచ్చి సామాజిక న్యాయం నిలబెట్టింది. అలాగే 88 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళలకు రుణ సౌకర్యం పెంపునకు బ్యాంకర్లతో ప్రభుత్వం మాట్లాడిరది. వీటితోపాటు ప్రతి కుటుంబ అభివృద్ధికి పీ 4 పథకం ప్రవేశపెట్టింది. ఇలా దేశం గుర్తించే రాజధాని నిర్మాణంతో పాటు మూడు ప్రాంతాల అభివృద్ధి, 175 నియోజకవర్గాల అభివృద్ధి, ప్రతి పంచాయతీ, ప్రతి మునిసిపాలిటీ అభివృద్ధితో పాటు, ప్రతి కుటుంబ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ వాస్తవానికి విరుద్ధంగా జగన్ ముఠా రాజధాని ఒక్కటే అభివృద్ధి చేస్తున్నదని ప్రచారం చేస్తూ విద్వేషం రెచ్చగొట్టే కుట్రలు చేస్తోంది. విద్వేష ప్రచారాన్ని తిప్పి కొడితేనే ప్రతి పౌరుని ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు వైకాపా మాఫియా నుండి రక్షణ కలుగుతుంది.
జగన్ పాలనలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ
2019-24 మధ్య జగన్ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 1300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే జగన్ పాలనలో ఏడాదికి సరాసరి 260 మంది రౖెెతుల ఆత్మహత్యలు జరిగాయి. 2024 జూన్ నుండి 2025 మార్చి 25 మధ్య తొమ్మిది నెలల చంద్రబాబు పాలనలో రైతు ఆత్మహత్యలు 39 మాత్రమే. దీన్ని బట్టి జగన్ రైతును దగా చేయగా.. చంద్రబాబుది రైతు అనుకూల పాలన అని స్పష్టమవుతోంది. 2023-24లో జగన్ పాలనలో రబీ, ఖరీఫ్ లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ చేసి రూ.1674 కోట్లు బకాయి పెట్టారు. ధాన్యం కొన్న మూడు నెలలకు గానీ నగదు చెల్లించలేదు. ఈ ఏడాది చంద్రబాబు పాలనలో ఖరీఫ్, రబీలో ఇప్పటికే 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ చేసి 24 గంటల్లోనే నగదు రైతుల ఖాతాలలో జమ చేశారు. జగన్ రైతులకు పెట్టిన బకాయిలు రూ.1674 కోట్లు కూడా కూటమి ప్రభుత్వం చెల్లించింది. ఈ వాస్తవాలను బట్టి చూస్తే రైతులపై జగన్ ముఠావి మొసలి కన్నీరు అని స్పష్టం అవుతోంది.
గురజాల మాల్యాద్రి
చైర్మన్ : టీడీపీ నాలెడ్జ్ సెంటర్