అవినీతి పుత్రిక సాక్షి మీడియా ఎడిటర్ వర్దెల్లి మురళి ప్రతి ఆదివారం ఆ పత్రికలో అబద్దాల కాలుష్యం వెదజల్లుతున్నాడు. మురళి కాలమ్ జనతంత్రం కాదు.. అది అబద్దాల కుతంత్రం.
1. మురళి అబద్ధపు ఆరోపణ
‘చంద్రబాబు ఎప్పుడూ అబద్ధాలే చెబుతారు’.
నిప్పులాంటి నిజం: వివేకా హత్య ‘నారాసుర రక్త చరిత్ర’ అని అబద్ధాలు చెప్పింది జగన్ కాదా? అది రాసింది, ప్రసారం చేసిందీ నీ సాక్షి కాదా? పింక్ డైమెండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని అబద్ధాలు మాట్లాడిరది జగన్ ముఠా కాదా? వివేకా గుండెపోటులాంటి అబద్ధాలు ప్రసారం చేసింది, రాసింది సాక్షి మీడియానే.
-జగన్ దుష్ట లక్షణాల్ని చంద్రబాబుకు అంటగట్టి రాసిన అబద్ధమే వందసార్లు రాయడం సాక్షి మీడియా ట్రేడ్ మార్క్.
– చంద్రబాబుపై అబద్ధపు ఆరోపణలతో 38 కోర్టు కేసులు, సభా సంఘాలు వేసి ఒకదానికి కూడా కోర్టులో రుజువులు చూపలేక చేతులెత్తేసి, కోర్టులో మొట్టికాయలు వేయించుకున్నది నీ యజమాని జగన్ ముఠా కాదా మురళీ? జగన్‌పై వచ్చిన ఆరోపణలకు సిబీఐ చార్జిషీటు వేసింది, ఆస్తులు జప్తు చేయడం కూడా జరిగింది. చివరకు సాక్షి మీడియా కూడా అవినీతి కేసుల్లో ఉంది.
2. వర్దెల్లి మురళి అబద్ధపు ఆరోపణ
ప్రభుత్వ వైఫల్యాల డైవర్షన్ కోసం షర్మిల ఆస్తుల వివాదం, కృష్ణా నదిలో బోట్ల వివాదం, విజయమ్మ వాహనానికి ప్రమాదం తెరపైకి తెచ్చారు.
నిప్పులాంటి నిజం: ప్రతిపక్ష నేతగా జగన్ వైఫల్యం చెందాడుగాని చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందలేదు. పాలనా పగ్గాలు చేపట్టి ఇంకా ఐదు నెలలు కూడ నిండలేదు. జగన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించినా తన అనుభవం, ప్రతిష్ట, కఠోర కష్టంతో చంద్రబాబు 150కి పైగా మంచి పనులు చేశారు.
1. రూ.4 వేలు పింఛన్ 1వ తేదీనే ఇంటివద్ద ఇస్తున్నారు. 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తున్నారు. ప్రకృతి విపత్తు సహాయం హెక్టారుకు రూ.25 వేలిచ్చారు.
2. 175 అన్న క్యాంటీిన్లతో పేదల ఆకలి తీరుస్తున్నారు.
3. కోటిమందికి పైగా ఉచిత సిలిండర్‌లు ఇస్తున్నారు.
4. ఉచిత ఇసుక ఇచ్చి 125 వృత్తుల వ్యాపారాల్ని నిలబెట్టారు.
5. విషపూరిత మద్యం రద్దుచేసి, రూ.99లకే నాణ్యమైన మద్యం ఇస్తున్నారు.
6. గుంతలు లేని రోడ్లు వేస్తున్నారు.
7. ధాన్యం బకాయిలు రూ.1,640 కోట్లు చెల్లించారు.
8. కేంద్రం నుండి పోలవరం నదుల అనుసంధానానికి రూ.15 వేల కోట్లు, అమరావతికి రూ.12 వేల కోట్లు సాధించారు.
9. లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగాల కల్పనకు బాటలు వేస్తున్నారు.
10. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు కేంద్రం నుండి ప్రత్యేక ప్యాకేజీ సాధించారు.
ఇలా 150కి పైగా మంచి పనులు చేసిన ప్రభుత్వం మరేదైనా ఉందా? ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది పచ్చి అబద్దం. జగనే ప్రతిపక్ష నేతగా వైఫల్యంచెంది డైవర్షన్ రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్నాడు. అబద్దాలు, విద్వేషాలపై ఆధారపడ్డాడు.
2019లో మొదటి 5 నెలల్లో జగన్ ప్రభుత్వం పింఛన్లు రూ.250, ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇవ్వడం తప్ప మరే నవరత్న హామీని అమలు చేయలేదు.
– వైఫల్యం చెందింది జగనేగానీ కూటమి ప్రభుత్వం కాదు.
– డైవర్షన్ పాలిటిక్స్, శవ రాజకీయాలు చేస్తున్నది జగనే.
– తల్లికి, చెల్లికి ద్రోహం చేసింది కూడా జగనే. తల్లి కొత్త కారుకు ఎందుకు ప్రమాదం జరిగింది?
– ప్రకాశం బ్యారేజీని పెద్ద ఇనుప బోట్లతో ఢీకొట్టించే కుట్ర చేసింది మీ పార్టీవారే.
– తునిలో రత్నాచల్ రైలును నిలువునా తగులబెట్టింది వైకాపా మూకలే.
3. వర్దెల్లి మురళి అబద్ధపు ఆరోపణ
‘అమరావతి తాత్కాలిక సచివాలయానికే సుమారు వెయ్యి కోట్లు ఖర్చు అయింది’’
నిప్పులాంటి నిజం: సచివాలయానికి వెయ్యి కోట్లు ఖర్చు అనేది పచ్చి అబద్ధం. సచివాలయం ఐదు బ్లాకులు, అసెంబ్లీ, కౌన్సిల్, పార్కింగ్, గ్రీనరీ, ఫర్నీచర్, రోడ్లు చట్టబద్ధ శాశ్వత నిర్మాణాలకైన ఖర్చును, జగన్ నిర్మించిన రిషికొండ విలాస ప్యాలెస్‌కు ముడి పెట్టడం కుతంత్రం కాదా మురళీ? రుషికొండ విలాస భవనాలు, పర్యావరణ చట్టాలు, సీఆర్‌జెడ్‌కు విరుద్ధంగా నిర్మించారు. చట్టబద్ధమైన అసెంబ్లీ భవన నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.5,332, హైకోర్టు భవన నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ.3,666 మాత్రమే ఖర్చు అయింది. ఇంతకన్నా రుషికొండ ప్యాలెస్‌కు ఎంతో పెద్దమొత్తం ఖర్చవ్వడం నిజం.
4. వర్దెల్లి మురళి అబద్ధపు ఆరోపణ
‘‘రుషి పుంగవులు తపస్సు చేసిన ఋషికొండను ధ్వంసం చేసి జగన్ సర్కార్ ప్యాలెస్‌ను కట్టిందట…. హరిత రిసార్ట్ నిర్మించిందే టీడీపీ సర్కార్.
నిప్పులాంటి నిజం: రుషులపై వెటకారం చేస్తే మీ చైర్మెన్ భారతి దగ్గర మార్కులు వస్తాయేమోగాని.. ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. హరిత రిసార్ట్స్‌పై గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు లేవు. పైగా దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. రిషికొండ ప్యాలెస్‌పై గ్రీన్ ట్రిబ్యునల్‌లో పర్యావరణవేత్తలు కేసులు ఎందుకు వేశారు? ఈ ప్యాలెస్‌వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోగా వైట్ ఎలిఫెంట్ ఎందుకు అయింది? మీ యజమాని విలాసం కోసం రూ.430 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడమేకాక హరిత రిసార్ట్స్ నుంచి వచ్చే ఆదాయం పోయింది. వందల కోట్ల పర్యావరణ విధ్వంసం జరిగింది. ఇలాంటి ప్యాలెస్‌ను హరిత రిసోర్ట్స్‌తో, అమరావతి ఐకానిక్ భవనాలతో పోల్చడం కుతంత్రం కాదా మురళీ?
-చంద్రబాబు నిర్మించిన ఒక్క హైటెక్ టవర్ ఒక సైబరాబాద్ సృష్టికి కారణమై ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతి పల్లె నుండి 30 లక్షల మంది ఉపాధి, ఉద్యోగాలు పొందుతున్నది నిజం కాదా మురళీ? రిషికొండ ప్యాలెస్‌వల్ల ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి?
5. వర్దెల్లి మురళి అబద్ధపు ఆరోపణ:
‘కొత్తగా ఏయే భవనాలు నిర్మిస్తున్నారో, ఎందుకోసం నిర్మిస్తున్నారో తెలియజేస్తూ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు వివరాలు అందజేసింది. తెలుగుదేశం, మిత్రపక్షాలు జగన్మోహన్‌రెడ్డి నివసించడం కోసమే ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తున్నారని ప్రచారం మొదలుపెట్టాయి.’
నిప్పులాంటి నిజం: జగన్ విలాస నివాసానికి కాకపోతే రూ.430 కోట్ల ప్రజాధనం ఎందుకు తగలేస్తారు? పర్యావరణ చట్టాలు, మున్సిపల్ చట్టాలు ఎందుకు ఉల్లంఘిస్తారు? అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు నిజాలు ఎందుకు దాచారు? ప్రభుత్వ అవసరాలకే అయితే ప్రతిపక్ష నేతల్ని, మీడియాను రిషికొండ చూడకుండా ఎందుకు అడ్డుకున్నారు? సిఆర్‌జెడ్ నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు? జగన్‌రెడ్డి విలాస పురుషుడని ఎలహంక, లోటస్‌పాండ్, తాడేపల్లి ప్యాలెస్‌లు స్పష్టం చేయడం లేదా? ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాచరికపు పోకడల్ని ప్రజలు సహించరు.
గురజాల మాల్యాద్రి,
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్.