వైసీపీ పాలనలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కోల్పోయింది నిజం కాదా? ఏం చూసి జగన్‌కు అధికారం ఇస్తారు? పథకాల ద్వారా పేదలకు ఇచ్చిన దానికన్నా వారి వద్ద పిండుకొన్నదే ఎక్కువ కాదా? పదిచ్చి వంద కొట్టేయడం మోసకారి సంక్షేమం కాదా? ఈ మోసకారి తనం పేదలు తమ అనుభవం ద్వారా గుర్తించే కదా 11 సీట్లకు కుందించారు. డీబీటీ గురించి, మీ గురించి.. మీరు ఎంత గొప్పగా టముకు వేసుకొన్నా పేదలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. అలా సూపర్ సిక్స్‌పై చేసే అబద్ధపు ప్రచారం ఎంతోకాలం నిలవదు. జూన్, జూలై నాటికి తల్లికి వందనం కింద ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబానికి రూ.30 వేలు అందుతాయి. ఈ స్కీమ్‌లో జగన్ ఇచ్చింది కేవలం రూ.13 వేలు మాత్రమే. అన్నదాత సుఖీభవ ద్వారా రైతుకు రాష్ట్ర నిధుల నుంచి చంద్రబాబు ప్రభుత్వం రూ.14 వేలు ఇస్తుంది. ఈ స్కీమ్‌లో జగన్ రైతుకు రాష్ట్ర నిధుల నుంచి ఇచ్చింది కేవలం రూ.7500 మాత్రమే. ఇప్పటికే కోటి మందికిపైగా మహిళలు ఉచిత గ్యాస్ పొందుతున్నారు.
రాబోయే మూడు నెలల్లోపే డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ నియమకాలు పూర్తి అవుతాయి. జగన్ ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ కూడా జరపని సంగతి యువత ఎలా మర్చిపోతుంది? పింఛన్ మొదటి ఏడాది జగన్ కేవలం రూ.250 మాత్రమే పెంచగా.. చంద్రబాబు ప్రభుత్వం ఒకేసారి రూ.1000 పెంచింది పేదలకు తెలియదనుకొంటున్నారా? జగన్ మాయమాటలకు, కపట ప్రేమకు పేదలు తిరిగి మోసపోయేంత అమాయకులు కాదు. దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ మొదటి ఏడాదే మేనిఫెస్టో హామీలన్నీ అమలు చేసిన ప్రభుత్వం ఏదీ లేదు. జగన్ ఐదేళ్లలో 85 శాతం మేనిఫెస్టో హామీలకు ఎగనామం పెట్టారు. అభివృద్ధి, సామాజిక న్యాయానికి గండికొట్టారు.
చంద్రబాబు పాలనలో ఇప్పటికే 50 శాతంపైగా హామీలు అమలు చేశారు. సూపర్‌సిక్స్ నూటికి నూరుశాతం అమలు చేస్తారు. అదనంగా అభివృద్ధి, సామాజిక న్యాయం జరుగుతుంది. ఈసారి కోడి కత్తి, గులకరాయి, రత్నాచల్ ఎక్ర్‌ప్రెస్ తగలబెట్టడం, సానుభూతి కోసం చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య లాంటి నేరా లకు పాల్పడే వారికి కఠిన దండన తప్పదు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొట్టే కుట్రపూరిత, అబద్ధపు ప్రచారాలకు తగిన ట్రీట్‌మెంట్ తప్పదు. జగన్ తిరిగి అధికారా నికి వచ్చే సమస్యే ఉత్పన్నం కాదు. తిరిగి అధికారానికి వస్తామని జగన్ చెప్పే మాటలు నమ్మి అగత్యాలకు పాల్పడితే తీవ్రంగా నష్టపోతారు. తిరిగి చంద్రన్న అధికారానికి వచ్చి స్వర్ణాంధ్రను సాధిస్తారు.
గురజాల మాల్యాద్రి,
చైర్మన్, టీడీపీ నాలెజ్జ్ సెంటర్