- పేదల్ని నిరుపేదలుగా చేసిన జగన్ పాలన
- పేదల్ని సొంతకాళ్లపై నిలబెట్టిన చంద్రన్న పాలన
అమరావతి (చైతన్య రథం): ఉగాది రోజున చంద్రబాబు ప్రభుత్వం పీ`4 జీరో పావర్టీ విధానం ప్రకటించింది. మార్గదర్శి` బంగారు కుటుంబం పేరు వినగానే జగన్ ముఠాకు వణుకుపుడుతుంది. పీ`4కు దురుద్దేశాలు అంటగడుతున్నారు. పేదరికం లేని సమాజం అసంభవమని తీర్పులిస్తున్నారు, హేళనలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం డ్వాక్రా మహిళల్ని వ్యాపారవేత్తలు చేస్తామని ప్రకటించినప్పుడు కూడా ఆడవాళ్లను చెడగొడుతున్నారని నిందలు వేశారు. డ్వాక్రా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా రాష్ట్రంలో నేడు దాదాపు కోటి కుటుంబాలు సొంత కాళ్లపై నిలబడ్డాయి. నేడు పురుషులు కూడా తమకు సెల్ఫ్ హెల్ప్ గూపులు పెట్టమని కోరుతున్నారంటే.. డ్వాక్రా ఎంత విజయం సాధించిందో అర్థమవుతున్నది. ఏడాదికి రూ.60వేల కోట్లు బ్యాంకు లావాదేవీలు జరిపే స్థాయికి మహిళా గ్రూపులు వచ్చాయి. డ్వాక్రాపై ఆనాడు జగన్ తండ్రి ముఠా హేళన చేసింది. నిజాయితీపరులైతే ఇప్పుడు చెంపలు వేసుకోవాలి.
అలాగే హైటెక్ సిటీ నిర్మిస్తుంటే ‘కంప్యూటర్లు కూడు పెడతాయా?’ అని హేళన చేశారు. తమ భూములకు విలువ పెంచుకోవడానికే చంద్రబాబు హైటెక్ సిటీ నిర్మిస్తున్నారని నిందలు వేశారు. జగన్‌రెడ్డికే హైదరాబాద్‌లో పక్కువ ఆస్తులు ఉన్నాయన్నది వాస్తవం. హైటెక్ సిటీ సైబరాబాద్‌ను సృష్టించి.. సైబరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల యువతకు, రైతు, రైతుకూలీల బిడ్డలు 30 లక్షలమందికి ఉపాధి కల్పించింది. పేదల్ని సొంతకాళ్లపై నిలబెట్టింది.
పబ్లిక్ ప్రయివేట్ పార్టనర్‌షిప్‌లో నెల్లూరు`చెన్నై జాతీయ రహదారి నిర్మాణం చేస్తుంటే.. ప్రభుత్వ రోడ్లు ప్రయివేట్‌కు ధారాదత్తం చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. జాతీయ రహదారుల వల్ల నేడు ప్రయాణకాలం, డీజిల్ పెట్రోలు ఎలా ఆదా అవుతున్నదో ప్రజలు అనుభవిస్తున్నారు. ప్రజా రాజధాని అమరావతి, పోలవరం, నదుల అనుసంధానాన్ని గండికొట్టారు. నాడు నికర జలాలా? వరద జలాలా? అంటూ కుతంత్రం లేదదీసి తెలుగుగంగపై రాద్ధాంతం చేశారు. పట్టిసీమను ఒట్టిసీమ అని హేళన చేశారు. ఆ పట్టిసీమవల్లే రాయలసీమకు అదనంగా నీళ్లివ్వగలుగుతున్నాము. ఇలా చంద్రబాబు ఏ మంచి పని తలపెట్టినా.. దానిపై నిందలు వేయడం, అడ్డుకోవడం పనిగా పెట్టుకున్నారు.
సబ్ ప్లాన్ నిధుల ద్వారా ఎస్సీ, ఎస్టీ డ్రైవర్లకు ఇన్నోవా కార్లిచ్చి వారిని ఓనర్లుగా చేయడమైంది. ఆదరణ ద్వారా బీసీ వృత్తిదారుల్ని తమ కాళ్లపై నిలబెట్టడమైంది. మద్యం షాపుల్లో 10శాతం గౌడవర్గానికి కేటాయించారు. విదేశీ విద్య ద్వారా వేలాదిమందిని అభివృద్ధి చేయడమైంది. నేడు సిడాప్ ద్వారా ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్‌ను తయారు చేయాలన్న కృషి జరుగుతుంది. ప్రభుత్వ కృషితోపాటు సంపన్నుల తోడ్పాటుతో పీ`4 అమలుకు కృషి జరుగుతున్నది. ఇప్పటికే ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి 4 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి జరుగుతుంది. పీ`4 విధానం ద్వారా మార్గదర్శి`బంగారు కుటుంబం సాధించి స్వర్ణాంధ్ర`2047 సంకల్పం విజయవంతం చేయబడుతుంది. చంద్రబాబు ప్రభుత్వం పదికాలాలు కొనసాగితే ఇది సాధ్యమే.
జగన్ పేదల్ని నిరు పేదలుగా చేశారు. అమ్మఒడికి రూ.13వేలు ఇచ్చి.. నాన్న బుడ్డిలో లక్ష కొట్టేశారు. వాహనమిత్ర అంటూ రూ.10వేలిచ్చి.. రెండోవైపు డీజిల్, పెట్రోల్, పోలీస్ జరిమానాలు పెంచి లక్ష కొట్టేశారు. నాసిరకం మద్యంపోసి 35 లక్షలమంది పేదల ఆరోగ్యాల్ని పాడుచేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్‌ప్లాన్ నిధులు ఒక లక్ష కోట్లు దారిమళ్లించారు. పేదల అసైన్‌మెంట్ భూములు 10 లక్షల ఎకరాలు కబ్జాలు చేశారు. పేదలు సొంతకాళ్లపై నిలబడే విదేశీ విద్యలాంటి పథకాలు రద్దు చేశారు. పేదల్ని బిచ్చగాళ్లుగా చేసి ఓటు బ్యాంకుగానే భావించాడు జగన్. పీ`4 విజయవంతమైతే పునాది బద్దలవుతుందని జగన్ ముఠా మార్గదర్శి`బంగారు కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారు.
గురజాల మాల్యాద్రి,
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్