అమరావతి: తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, యువగళం పాదయాత్ర సమన్వయకర్త కిలారు రాజేష్‌ని హైదరాబాద్‌లో దుండగులు వెంబడిరచడం వెనుక ఉన్న కుట్ర కోణం బయటపడాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ డిమాండ్ చేశారు. దుండగులు చెప్పిన వాళ్ళ నాయకుడు ఎవరు .. రాజేష్ ని బెదిరించాలని ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నానని శుక్రవారం ఒక ప్రకటనలో విజయ్ పేర్కొన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, చింతమనేని ప్రభాకర్, ప్రభాకర్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ కుమార్ రెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డి, కిలారు రాజేష్, ఇతర ముఖ్య నాయకులందరిపై తప్పుడు కేసులు మోపుతున్నారు. తెలుగుదేశంలో కీలకంగా ఉన్న నేతలని నేరుగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక తాడేపల్లి ప్యాలెస్ చేసే కుట్రల ఫలితమే ఈ వరుస కేసులు..
4,5 ఏళ్లుగా కిలారు రాజేష్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి రాజేష్ అజ్ఞాతంలో ఉన్నారని నీలి మీడియాలో ఫేక్ ప్రచారాలు చేశారు. కానీ నేటికీ రాజేష్ పాత్రపై ఒక్క ఆధారం కూడా చూపించలేక పోయారు.
నేడు ఇంకొక మెట్టు ముందుకు వెళ్లి రాజేష్, ఆయన కుటుంబసభ్యుల ప్రాణాలకు హాని తలపెట్టే పిరికి పంద చర్యలకు తెగబడుతున్నారు. ఇలాంటి పిరికి పంద చర్యలకి తెలుగుదేశం పార్టీ భయపడుతుందని అనుకోవడం హాస్యాస్పదం. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, కుటుంబసభ్యులని ఇబ్బందులు పెట్టినా కిలారు రాజేష్ ఈ నియంత ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాడుతూనే ఉంటారు కూడా. పసుపు జెండా, పసుపు సైన్యం ఇందిరమ్మకే తొణకలేదు.. మీ తప్పుడు కేసులెంత. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి పిరికి చర్యలకు, కక్ష సాధింపుకి స్వస్తి పలకకపోతే ఎన్నికలకి 5 నెలలు కూడా సమయం లేదని గుర్తుచేస్తూ .. వీటికి తగ్గ ప్రతి చర్యలకి రానున్న రోజుల్లో సిద్ధంగా ఉండాలని వైసీపీ నాయకులను విజయ్ హెచ్చరించారు.