- మొదటి దశలో పౌరులకు 161 సేవలు
- సైబర్ సెక్యూరిటీపై కీలక సూచనలు
అమరావతి(చైతన్యరథం): వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవా రం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం గురువారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. రెండో విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందు బాటులోకి తీసుకువస్తుంది. మొదటివిడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని, ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్ర త్తలు తీసుకోవాల్సి ఉందని, ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచించారు. వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత అక్టోబర్ 22న మెటాతో ఒప్పందం చేసు కుంది. ఏపీని డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో పాలన, ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతంగా అందజేయడానికి ఈ విధానం సులభతరం కానుంది. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం అధికారికంగా ప్రారంభిం చనున్నారు. ఈ సమీక్షలో సీఎస్ కె.విజయానంద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.