అమరావతి(చైతన్యరథం): నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఆకాశాన్ని అంటిన నిత్యావసర ధరలు, పెరిగిన పన్నులు, ప్రభు త్వం పెంచిన వివిధ రకాల ఛార్జీలపై చర్చ చేపట్టాలని కోరుతూ తెలుగుదేశంపార్టీ తరుపున ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. మహిళలు, పేదల పక్షాన టీడీపీ సభ్యులు మాట్లాడకూడదు అన్న దురుద్దే శంతోనే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఏం కొనేట్టు లేదు.. తినేట్టు లేదు అనే సినిమా పాట ప్రస్తుతం పేదల బతుకులకు సరిగ్గా సరిపోతుంది. ధరల మోత ` పన్నుల వాత ఇదే జగన్‌రెడ్డి మార్క్ పాలన. టీడీపీ ప్రభుత్వంలో లీటర్ పెట్రోల్ రూ.72లు ఉంటే, ఇప్పుడు రూ.112 అయింది. లీటర్ డీజిల్ అప్పుడు రూ.69లు ఉంటే, ఇప్పుడు రూ.99కి పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది కేంద్ర ప్రభుత్వమని జగన్ సర్కార్ తప్పిం చుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రప్రభుత్వ వాటాగా ఉన్న ట్యాక్స్‌లను 32శాతం నుంచి 35శాతానికి పెం చింది జగన్‌రెడ్డే. రాష్ట్రంలో పెంచిన పన్నుల వల్లే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే లీటర్‌పై రూ.8 నుంచి రూ.10లు అదనపు భారం ఇక్కడి ప్రజలపై పడుతోం ది. టీడీపీ ప్రభుత్వంలో కేజీ బియ్యం రూ.40లు ఉంటే, ఇప్పుడు రూ.55 ఉంది. కందిపప్పు గతంలో రూ.80లు ఉంటే, ఇప్పుడు రూ.120కి పెరిగింది. కేజీ చింతపండు టీడీపీ ప్రభుత్వంలో రూ.120లు అమ్మితే, ఇప్పుడు రూ.240లకు పెరిగింది. ఇలా పంచదార, వంటనూనె, ఇతర పప్పుల ధరలు పెరి గాయి. చంద్రబాబు హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.600లు ఉంటే, ఇప్పుడు రూ.1200లకు ఎగబా కింది. పెరిగిన గ్యాస్ ధరలతో మహిళలు మరలా కట్టెలపొయ్యిలను నమ్ముకుంటున్నారు.కరెంట్ బిల్లుల్ని జగన్‌రెడ్డి 9సార్లు పెంచాడు.గతంలో రూ.200లు వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు తక్కువలో తక్కువగా రూ.1000లు వస్తోంది. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి మహిళలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి, కల్తీ మద్యం అధికధరకు అమ్ముతూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. క్వార్టర్ నాసిరకం మద్యాన్ని రూ.200లకు అమ్మిస్తున్నాడు. ఇవన్నీ చాలవన్నట్టు ఆస్తిపన్ను, నీటిపన్ను, మరుగు దొడ్లపై పన్ను అంటూ ఆఖరికి చెత్తపై కూడా పన్నులు వేసిన ఈ ప్రభుత్వం చెత్త ప్రభుత్వంగా పేరు పొందిం ది. రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప మరేమీ పేదలకు ఇవ్వడం లేదు. కొన్ని చోట్ల ఆ బియ్యం కూడా సరిగా ఇవ్వడం లేదు.
గతంలో చంద్రబాబు హయాంలో రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు, కందిపప్పు, పంచదార, నూనె ప్యాకెట్, చింతపండు, బెల్లం వంటి 6 రకాల సరుకు ల్ని సగం ధరకు అందించారు. 5ఏళ్ల జగన్‌రెడ్డి పాల నలో నలుగురు సభ్యులున్న కుటుంబం కేవలం నిత్యా వసరాలకే నెలకు రూ.7నుంచి రూ.8 వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి దాపురించింది. అదే కుటుంబం టీడీపీ ప్రభుత్వంలో నిత్యావసరాలకు రూ.2వేలు మా త్రమే వెచ్చించింది. రూ.5వేలు నిత్యావసరాలకే అద నంగా ఖర్చుచేయడం అంటే సంవత్సరానికి రూ.60 వేల కష్టార్జితాన్ని ఒక్కోకుటుంబం కోల్పోతోంది. ఇంత ముఖ్యమైన అంశంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టు బడితే, వాస్తవాలు ప్రజలకు తెలియకూడదన్న దురుద్దే శంతో, కుట్రతోనే చర్చ చేపట్టకుండా మమ్మల్ని అన్యా యంగా సస్పెండ్‌చేశారు. ఈ దుర్మా ర్గపు ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ప్రజలు శాశ్వతంగా రాష్ట్రం నుంచి సస్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని రామానాయుడు హెచ్చరించారు.