న్యూఢిల్లీ (చైతన్యరథం): ఢిల్లీ పర్యటనలో
ఉన్న రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలుసు కున్నారు. ఈ సందర్భంగా పోటీచేసిన తొలి ఎన్నిక నుంచి గత 4 విడతలుగా అంతకంతకు మెజారిటీ పెంచు కుంటూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయడంపై మంత్రి లోకేష్ అభినందించారు. ఇంతలా ప్రజల అభిమానాన్ని చూరగొనడం వెనుక విజయ రహస్యం ఏమిటని వాకబు చేశారు. ఆంధ్రప్రదేశ్లో గత 15నెలలుగా కూటమి పాలన లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమా కార్యక్రమాలను కేంద్రమంత్రికి లోకేష్ వివరించారు
గుజరాత్లోని నవసారి లోక్సభ నియోజకవర్గం ఎంపీగా 2009 నుంచి వరుసగా 4సార్లు సీఆర్ పాటిల్ ఎన్నికయ్యారు. 2009 లోక్సభ ఎన్నికల్లో నవసారి నుంచి పోటీ చేసిన సీఆర్ పాటిల్ 1,32,643 2 3. 201465 5,58,116 ఓట్ల మెజారిటీతో దేశంలో 3వ స్థానం, 2019లో 6,88,668 ఓట్ల మెజారిటీతో దేశంలో అగ్రస్థానం, 2024ఎన్నికల్లో 7,73,551 ఓట్ల భారీ మెజారిటీతో దేశంలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ.. అనునిత్యం ప్రజలతో మమేకం అవుతూ.. వారితోనే ఉండటమే తన విజయ రహస్యమని చెప్పారు. పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాల అమలుతో పాటు నవసారీని దేశంలోనే మొదటి “స్మోక్లెస్ జిల్లా”గా తీర్చిదిద్దారు. సూరత్ నగర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. వస్త్ర-వజ్ర పరి శ్రమలకు అనుకూల విధానాలు అమలు చేశారు. మౌలిక వసతులు కల్పించారు. సూరత్ విమానా శ్రయాన్ని అంతర్జాతీయ సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. నవసారీ పరిధిలోని చిల్లీ గ్రామ పంచాయతీని సన్న్ ఆదర్శ్ గ్రామ యోజన కింద అభివృద్ధి చేయగా, అది దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. రెండో దశ కోవిడ్ సమయంలో, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల ద్వారా కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించి సేవలందించారు.