- అధికారం పోయాక వారిపై ప్రేమ పుట్టిందా?
- టీడీపీ, వైసీపీ పాలనలో మిర్చి ధరలపై చర్చకు సిద్ధమా?
- రైతుల వేషంలో మిర్చి యార్డుకు పేటీఎం వైసీపీ మూకలు
- భువనమ్మను అవమానించిన అరాచకవాదికి పరామర్శలా?
- వంశీపై చర్యలు తీసుకుంటే శాశ్వతంగా జైలు జీవితమే
- అవినీతిపై విచారణ సాగుతోంది.. 90 శాతం మంది జైలుకే
- నిజంగా ప్రజాపక్షపాతి అయితే అసెంబ్లీకి రావాలి
- జగన్‌రెడ్డికి బీసీ సంక్షేమ మంత్రి సవిత కౌంటర్
మంగళగిరి(చైతన్యరథం): ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి జగన్‌రెడ్డి మిర్చి యార్డుకు వెళ్లడం, అక్కడ ప్రభుత్వంపై విషం చిమ్మడాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఖండిరచారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావే శంలో ఆమె మాట్లాడారు. ‘‘పులివెందుల ఎమ్మెల్యే జగన్‌రెడ్డికి అధికారం కోల్పోయాక మహిళలు, రైతుల మీద ప్రేమ పుట్టింది. రైతన్నల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా రైతులంటూ దగా చేశాడు. ఎన్నిక ల్లో ఇచ్చిన హామీలను మేము ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోవడం చూసి జీర్ణిం చుకోలేక ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్ముతున్నాడు. ఎన్నికల కోడ్ ఉన్నా బేఖాతర్ చేశా డు. వైసీపీ చీటీని జగన్‌రెడ్డే చింపేశాడని ప్రజలకు అర్థమై 11 సీట్లకు పరిమితం చేసినా బుద్ధి రాలేదు’’ అని హితవుపలికారు.
రైతులపై జగన్ రెడ్డి కపట ప్రేమ
మిర్చి రైతులకు అండగా ఉంటానని పెద్ద డ్రామాకు తెరలేపారు. మహానుభావా నువ్వు మిర్చి యార్డుకు వస్తే ఇంకా నష్టం చేకూరుతుందని రైతులు గగ్గోలు పెట్టారు. వైసీపీ మూకలను రైతన్నల వేషాలు వేయించి యార్డులోకి పంపించారు. 2014-19, 2019-24, నేడు ఉన్న మిర్చి ధరలపై చర్చకు జగన్‌రెడ్డి సిద్ధమా? అని ప్రశ్నించారు. 2017లో క్వింటా మిర్చి ధర రూ.7 వేలు పలికినప్పుడు రైతులు నష్టపోకూడదని రూ. 1,500 బోనస్ ఇచ్చి వారిని చంద్రన్న ఆదుకుని రైతుల పక్షపాతిగా నిలిచారు. నాటి నుంచి నేటి వరకు రైతన్నల సంతోషం కోసం చంద్రబాబు, లోకేష్ అహర్నిశలు శ్రమి స్తున్నారు. అందులో భాగంగానే జగన్‌రెడ్డి పెట్టిన రూ.1,680 కోట్ల ధాన్యం బకాయిలను ఈ మంచి ప్రభుత్వం విడుదల చేసింది. నాణ్యమైన ఎరువులు, మందులు, డ్రిప్ ఇరిగేష న్, పనిముట్లను ప్రభుత్వం అందిస్తుంది. గత ఐదేళ్లలో రైతన్నలకు జగన్‌రెడ్డి ఏం చేశా డు? అని ప్రశ్నించారు.
ఇక్కడ అల్లర్లు సృష్టించి బెంగళూరులో పబ్జీ
కడపకు వెళితే ఎంతోమంది కాంట్రాక్టర్లు అర్జీలు ఇస్తున్నారు. తాగునీరు సమస్య పెరిగిపోయింది. బీసీ బిడ్డలు చదువుకునే హాస్టళ్లను కూడా జగన్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడు. ముఖ్యంగా సాగు, తాగునీరు లేక రాయలసీమ ప్రజలు ఇబ్బందులుపడ్డారు. 2019 ఎన్నికలకు ముందు కొత్త ప్రాజెక్టులు కడతాను, రిజర్వాయర్లు పూర్తి చేస్తాను, కాలువలు వెడల్పు చేసి ప్రతీ ఎకరాకు నీరు ఇస్తానని హామీ ఇచ్చి గాలికి వదిలేశాడు. అన్నమయ్య డ్యాం మెయింటెనెన్స్ చేయలేని వ్యక్తి జగన్‌రెడ్డి. నిజంగా రైతులకు మంచి చేసి ఉంటే ఎందుకు పరదాలు కట్టుకుని తిరగాల్సిన అవసరం ఉంది. నేడు ప్రజలంటే ప్రాణం అన్నట్లు రోడ్డుపై తిరుగుతున్నావు. రెండురోజులు విజయవాడలో ఉండి అల్లర్లు రేపి 4 రోజులు బెంగళూరుకు వెళ్లి పబ్జీ ఆడుకుంటావు. నిన్ను చూసి వైసీపీ నాయకులు ఆందోళనలో పడిపోయారు. పార్టీ ఉనికిని కాపాడేందుకు ఈ అబద్ధాలు. నేడు రాజారెడ్డి రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతోంది. అందుకే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ వంశీని అరెస్ట్ చేసింది. పోలీసులు ఎక్కడున్నా వదిలిపెట్టను, బట్టలూడదీస్తానని జగన్‌రెడ్డి వాడిన భాష సరైనది కాదు. పిచ్చి బాగా ముదిరితే లండన్ వెళ్లి మందుల డోస్ పెంచుకోవాలని సూచించారు.
నీచుడికి మరో నీచుడి పరామర్శ
ఎంతోమందికి విద్య, వైద్య దానం చేస్తూ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలందిస్తున్న భువన మ్మపై అసెంబ్లీ సాక్షిగా వంశీ అసభ్యకరంగా మాట్లాడాడు. జగన్‌రెడ్డి పైశాచికానందం పొందాడు. ఆయనను పరామర్శించేందుకు వెళ్లడం సిగ్గు చేటు. మహిళల పట్ల జగన్‌రె డ్డికి గౌరవమే లేదు. సొంత చెల్లిని, తల్లిని గెంటేసిన నీచుడు. సెక్షన్‌లు కూడా ఆయనే చెప్పి తనపై, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి, రఘురామకృష్ణంరా జు, కొల్లు రవింద్రపై ఇలా అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రతిఒక్కరిపై అక్రమ కేసులు బనా యించి వేధించారు.చివరకు భవిష్యత్ తరాలకు దార్శనికతను పరిచయం చేసిన చంద్రబాబుపైనా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం మేము పోరాటం చేశాం. అసెంబ్లీ సాక్షిగా ప్రజల తరఫున గలం విప్పాం. మీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చకు రావాలి. మీకు మైకు ఇచ్చే బాధ్యత మాది. తప్పకుండా మాట్లాడేందుకు సమయం కేటా యిస్తాం. గత ప్రభుత్వంలో జరిగిన అన్ని అక్రమాలు, దౌర్జన్యాలు, కుంభకోణాలపై చర్చించుకుందామని సవాల్ చేశారు.
పోలీసులను బెదిరించడం సరికాదు
మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ జైల్లో ఉన్న అరాచక వాది వల్లభనేని వంశీని పరామర్శించి పోలీసులను బెదిరించే విధంగా జగన్‌రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. ఐదేళ్లు గన్నవరం నియోజకవర్గంలో ఎన్నెన్ని అరాచకాలు, అక్రమాలు, దౌర్జ న్యాలు వల్లభనేని వంశీ చేశాడు. మహిళలు, దళితులు, బీసీలను ఊచకోత కోసిన వంశీ గురించి జగన్‌రెడ్డి బాధపడుతున్నాడు. చరిత్రలో ఎన్నడూ దేశంలో ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై మరో రాజకీయ పార్టీ దాడులు చేయలేదు. జగన్‌రెడ్డి ఆదేశాలతో దేవా లయం వంటి టీడీపీ కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడి చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసినందుకు పూర్తి ఆధారాలతో వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాంటి వ్యక్తికి వత్తాసు పలుకుతూ పోలీసును బెదిరించడం కరెక్ట్ కాదని హితవు పలికా రు. జగన్‌రెడ్డి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నా. వంశీపై ఉన్న అన్ని అవినీతి, అక్రమ, దౌర్జన్యాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటే శాశ్వతంగా జైల్లోనే ఉంటాడు. వైసీపీ హయాంలో జరిగిన అన్ని అక్రమాలు, అవినీతిపై విచారణ జరుగుతోంది.. వైసీపీలో ఉన్న 90 శాతం మంది నాయకులు జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు.