ప్రజల వల్లన, ప్రజల చేత, ప్రజల కొరకు అంటున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ ప్రజల్నే దోచి ధనరాసులు పోగేసుకొన్న జగన్, ఆయన ముఠానే అసలైన నిజాయితీపరులు అయినట్లు వారి అక్రమాలకు, అవినీతికి ముసుగులు వేయడానికి జగన్ రోత పత్రిక ప్రయత్నం చేస్తోంది. స్వతంత్ర భారతావనిలో ఇంత బాహాటంగా బరి తెగించిన రాజకీయ నాయకుడు లేడు. జగన్ జమానాలో జరిగిన కనీ, వినీ ఎరగని మద్యం కుంభకోణంలో ఎన్నెన్నో సంచలనమైన ఆధారాలు బయటపడుతున్నాయి. దోచి దాచిన డెన్‌లు, నోట్ల కట్టల గుట్టలు, లెక్కిస్తున్న వీడియోలు, అట్టపెట్టెలలో ఉంచి ఫామ్‌హౌస్‌లో దాచిన 11 కోట్ల రూపాయల నగదు ప్రత్యేక దర్యాప్తు బృందం..సిట్ విచారణలో బయట పడుతున్నప్పటికీ మద్యం కుంభకోణం నిందితులు చాలా బుద్ధిమంతులు, నిజాయితీ పరులు, ఏ పాపం తెలియని వారంటూ జగన్ రోత పత్రిక అడ్డగోలుగా రోత రాతలు రాస్తూ జగన్ రెడ్డిని, ఆయన ముఠాని కాపాడేందుకు సిట్ పైనే విషం కక్కుతోంది. కళ్లముందు కనిపించే నిజాలను కక్షసాధింపు చర్యలుగా చూపించడానికి దొంగ సాక్షి అవస్థలు పడుతోంది. సిట్, మరియు గిట్టని మీడియా వ్యవస్థల పై విషపు రాతలు రాస్తోంది. మద్యం కుంభకోణాన్ని రాజకీయ కుట్రగా చిత్రించి జనం కళ్లకూ గంతలు కట్టేందుకు అసత్యపు రాతలకు తెగబడుతోంది. సిట్ బయటపెట్టిన ఐదు కోట్ల ముడుపుల సొమ్ము వీడియోలో ఉన్నది జగన్ ముఠా అతనే కానీ, ఆ సొమ్ము మద్యం సొమ్ము కాదని జగన్ తప్పుడు పత్రిక తప్పుడు కథóనాలు రాసి వాస్తవాలను వక్రీకరిస్తోంది. దేశ చరిత్రలో కనీ, వినీ ఎరుగని రీతిలో మద్యం ద్వారా మాయా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఘనుడు జగన్ రెడ్డి.
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి తన విద్యుక్త ధర్మాన్ని విస్మరించి నకిలీ మద్యం ద్వారా వేలకోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టి, వేల మంది ప్రాణాలను బలిగొన్న ఉదంతాలు చూసి యావత్ భారతదేశమే నివ్వెరపోయింది. ఏ వ్యక్తికైనా ఆశలు, కోరికలు ఉండటంలో తప్పులేదు. కానీ దేశ చరిత్రలో ఈ విధ మైన ధనదాహం కలిగిన వ్యక్తిని ప్రజలు తొలిసారి చూస్తున్నారు. నకిలీ మద్యం ద్వారా వేలకోట్ల అక్రమ సంపాదన జగన్ సొంత ఖజానాకు చేరినట్లు సిట్ విచారణలో వెల్లడి అవుతున్నా ఆనాటి సత్యహరిశ్చంద్రుడికన్నా జగన్ రెడ్డి, ఆయన ముఠానే నిజాయితీ పరులుగా రోత పత్రిక అబద్దాలు వండి వారుస్తోంది. తాను ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని, తామే అసలైన నీతి, నిజాయితీలకు ప్రతీక అని జనం చెవిలో పూలు పెడుతున్నది రోత పత్రిక. చట్టబద్ద పాలనకు సమాధి కట్టి అవినీతే రాజనీతిగా చెలరేగిపోయిన జగన్ రెడ్డిని, ఆయన ముఠాని నిజాయితీకి నిలువుటద్దాలుగా చూపిస్తోంది దిక్కుమాలిన పత్రిక. స్వార్థ రాజకీయ శక్తులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రాభివృద్దికి, సమాజాభివృద్దికి ఆటంకంగా మారిన వైసిపిని, ఆ పార్టీ నాయకులను రాజకీయాల నుంచి దూరం చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న జగన్ రెడ్డి.. మళ్లీ అధికారం కోసం ఆదర్శాలు నూరిపోస్తూ జనాన్ని బురిడీ కొట్టించాలని చూస్తున్న దోపిడీ నాయకుడి చరిత్ర మరోసారి తెలుసుకోవాల్సి ఉంది.
ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడటం చూసి జనం ఛీ కొడుతున్నారు. గతంలో ఇంత గతి మాలిన రాజకీయాలు చేసిన వ్యక్తిని చూడలేదని జనం చెప్పుకొంటున్నారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఆయన చెప్పిన మాటలు విని ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడేనా అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిధున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చెయ్యడం పై కొత్త కథ అల్లాడు జగన్ రెడ్డి. ఆయన కథలు అల్లడంలో దిట్ట. ఎప్పుడో 53 ఏళ్ల కిందట కాలేజీ గొడవల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుతో కొట్టారని, ఆ కక్ష తీర్చుకోవడానికే ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని వింత కథ చెప్పారు జగన్ రెడ్డి. మద్యం కుంభకోణం కేసులో ఎంపీ అయిన మిథున్ రెడ్డి ప్రమేయం, పాత్రపై ఆధారాలు లేకుండా అరెస్టు చెయ్యడం సాధ్యమా జగన్ రెడ్డి? కనీస ఇంగితం లేకుండా ఇటువంటి అబద్ధాలు చెప్పడం అంటే అది నాలుకా? తాటి మట్టనా అంటున్నారు ప్రజలు. చంద్రబాబు, పెద్దిరెడ్డి 1972లో ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో వేర్వేరు గ్రూపులకు నాయకత్వం వహించే వారని, రెండు యూనియన్ల విద్యార్థుల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలుసు.
అయితే చంద్రబాబు విద్యార్థి నాయకుడిగా ఉండేవారే తప్ప ఎప్పుడూ ప్రత్యక్షంగా గొడవ పడలేదు. ఆయన ఎప్పుడూ ఎవరితోనూ గొడవలు పడే వ్యక్తి కాదు. మద్యం కుంభకోణం తన మెడకు చుట్టుకోబోతుందని, తనకు రోజులు దగ్గర పడుతున్నాయన్న అక్కసు, ఫ్రష్టేషన్ ను తట్టు లేక చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు జగన్ రెడ్డి. కానీ పెద్ది రెడ్డి కొట్టారంటూ జగన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలను ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య నాయుడు ఖండిరచారు. అసలు జగన్‌కి ఏమి తెలుసు అని ఆయన ప్రశ్నించారు. పెద్దిరెడ్ది నేను ఒకే బ్యాచ్ అని, మాకు చంద్రబాబు రెండేళ్ల సీనియర్ అని, అసలు చంద్రబాబుతో పెద్ది రెడ్డి కలిసే ఛాన్సే లేదని, చంద్రబాబు యూనివర్సిటీలో మంచి స్కాలర్-ఆయన మంచి ఎకనమిస్ట్ అని, ఎవరితోనూ గొడవలు పెట్టుకొనే వ్యక్తిత్వం కాదని, కాలేజీ రోజుల్లోనే చంద్రబాబు మంచి నాయకుడని, అటువంటి వ్యక్తి పై జగన్ రెడ్డి చిల్లర వ్యాఖ్యలు చేయడం దారుణమని, ఆనాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు వివరించారు సుబ్రహ్మణ్య నాయుడు. జగన్ రెడ్డి ఈ విధంగా చంద్రబాబుపై ఎన్ని అడ్డమైన అబద్ధాలు చెప్పినా వృథా ప్రయాసే. జగన్ రెడ్డి తల్ల కిందులు గా తపస్సు చేసినా మళ్ళీ అధికారం దక్కడం కల్ల. నీ చరిత్ర ముగిసింది. కాలం కలిసి వచ్చి నీ అబద్ధాలు నమ్మి ఒకసారి అధికారం ఇచ్చారు ప్రజలు. నీ అబద్ధాలు నమ్మి మళ్ళీ అధికారం ఇస్తారని ఆత్రుత పడుతున్నావు. అది జరిగేది కాదు. అబద్ధాల పంట పండిరచి ఒకసారి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రివి కాగలిగావు. ఆ గౌరవం కాపాడుకోవడం మంచిది.
అట్లాగే గట్టిగా మూడేళ్లు కళ్ళు మూసుకొంటే చంద్రబాబు ఎగిరిపోయే నాయకుడు అంటూ జగన్ నోరుపారేసుకొన్నాడు. కానీ ఏడాది కింద జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎవర్ని ఎగరగొట్టారో ఆయనే చెప్పాలి. చంద్రబాబు ఎగిరిపోయే నాయకుడు కాదు ప్రజలను ఎదిగించే నాయకుడు. చంద్రబాబును ఎగరగొట్టాలని చూసిన ఎందరో ఎగిరి పోయ్యారు అన్న విషయం జగన్‌రెడ్డి గుర్తు తెచ్చుకోవాలి. చంద్రబాబు యోదాన యోధులతో రాజకీయంగా తలపడిన వ్యక్తి. మీ వంటి మరుగుజ్జులకు ఆయన సమర్థత, విలువ, చరిత్ర ఎం తెలుసు? చెన్నారెడ్డి, అంజయ్య, జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ బాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి నుండి మీ వరకు చంద్రబాబు పోరాటం చేస్తునే ఉన్నారు. ఇన్నేళ్ళుగా అటు వైపు ఇంత మారితే, ఇటు వైపు చంద్రబాబు ఒక్కరే నిలబడి పోరాటం చేస్తున్నారు. జగన్ రెడ్డి ఇప్పుడు చెప్పాలి. ఎవరు ఎగిరి పోయే నాయకుడో. దురదృష్టం ఏమిటంటే మనది ప్రజాస్వామ్యం కాబట్టి అర్హత లేని వ్యక్తిని ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో సైకో మనస్తత్వం కలిగిన జగన్ రెడ్డితో కూడా చంద్రబాబు పోరాటం చెయ్యాల్సిన పరిస్థితి. ఆనాడు వాజపేయి, ఆద్వానీ, జ్యోతిబసు, బిజూ పట్నాయక్, వీపీ సింగ్, దేవీలాల్, దేవగౌడ, గుజ్రాల్ వంటి ఎందరో ఉద్దండులతో కలిసి పని చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబు. చివరకు సైకో మనస్తత్వం కలిగిన జగన్‌రెడ్డి వంటి అరాచక వ్యక్తితో రాజకీయం చేయాల్సి వస్తోంది. చంద్రబాబు ఎదిగే నాయకుడని చరిత్ర చెబుతున్న సత్యం. గతంలో చంద్రబాబును ఫినిష్ చేస్తామని ప్రగల్భాలు పలికిన వారు కూడా ఏమైయ్యారో జగన్ రెడ్డి తెలుసుకోవాలి.
అట్లాగే పరామర్శల పేరుతో జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలకు హద్దు లేకుండా పోయింది. క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందనేది పరామర్శల్లో జగన్ రెడ్డి ప్రవర్తనే ఉదాహరణ.
జగన్ నేర మనస్తత్వంతో అధికారం కోసం ఎంతకైనా, ఎటువంటి చర్యలకైనా తెగిస్తారనడానికి ఆయన పర్యటనల్లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. గుంటూరు జిల్లా పర్యటనలో జగన్ కారు కిందే పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. జగన్ కారు కింద పడి తన భర్త చనిపోయాడని సింగయ్య భార్య ఫిర్యాదు చేస్తే, ఆ కేసులో నిందితుడిగా ఉన్న జగన్.. సింగయ్య కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకుని. లోకేష్ కోటి రూపాయలు ఇస్తానని ఆశ చూపారంటూ ఆమెతో లోకేష్‌పై తప్పుడు ఆరోపణలు చేయించారు. జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ జగన్ క్రిమినల్ ఆలోచనతో సొంత బాబాయ్‌ను గొడ్డలితో నరికేసి, దాన్ని గుండెపోటుగా చిత్రీకరించారు. తర్వాత వాస్తవాలు బయటకు రావడంతో ఆ నేరాన్ని అప్పటి ముఖమంత్రిగా వున్న చంద్రబాబుపై నెట్టి రాజకీయ లబ్ధి పొందిన విషయం అందరికి తెలిసిందే. అట్లాగే మామిడి, పొగాకు రైతుల పరామర్శ పేరుతో జగన్ ప్రజలను ఎంత పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారో చూసాం. ఒక సామాన్య రైతుని బెదిరించి రెండు ట్రాక్టర్లను గుంజుకొని వాటిలోని కాయలన్నిటినీ ఆయన కళ్ళముందే రోడ్డు పై పోసి మామిడి కాయలను ట్రాక్టర్‌తో తొక్కించి రైతులకు న్యాయం చెయ్యరా అంటూ దీర్గాలు తీసిన కర్కోటకుడు జగన్ రెడ్డి. అయిదు నెలల క్రితం గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి కార్యకర్తలతో ఇష్టారీతిన మిరప బస్తాలను తొక్కించి రైతుల కష్టాన్ని కాళ్ళతో తొక్కించారు.
నల్ల బర్లీ పొగాకు కొనేందుకు ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చి కొనేందుకు మార్క్ ఫెడ్‌ను రంగంలోకి దించింది. అయినా పొగాకు రైతుల పరామర్శ పేరుతో ప్రకాశం జిల్లా పోయి పొగాకు బేళ్లను వైసీపీి కార్యకర్తలతో తొక్కించారు. పొగాకు కొనే దిక్కు లేదని రోత పత్రికలో రోత రాతలు రాయించారు. అట్లాగే ఇటువంటి క్రిమినల్ నేరగాడు ప్రజాధనాన్ని కూడా ఎంత పకడ్బందీగా స్వాహా చేసాడనేదానికి మద్యం స్కాంలో వెల్లడవుతున్న వాస్తవాలే ఉదాహరణ. మద్యం అమ్మకాలను ప్రభుత్వం నిర్వహించినప్పుడు ఇక కుంభకోణం ఎలా జరుగుతుంది అంటూ జగన్ రెడ్డి బుకాయిస్తున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడు ఎక్కడా కనీ,వినీ ఎరుగని స్థాయిలో మద్యం ద్వారా సాగిన స్వాహా పర్వానికి సంభందించి సిట్ దర్యాప్తులో ఎన్నో ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాధనాన్ని కొల్లగొట్టి దోచుకొన్న సొమ్మును దాచుకోవడానికి ఎన్నెన్ని పన్నాగాలకు పాల్పడ్డారో సిట్ వెలుగులోకి తెచ్చింది, ఏది ఏమైనా ఆవుల మందకు పెద్దపులిని కాపలాగా పెడితే ఏమవుతుందో, నమ్మి బందిపోట్లకు అధికారం ఇస్తే ఏమి జరుగుతుందో అత్యంత అవినీతి పరుడుకి అధికారం ఇస్తే ఆంద్రప్రదేశ్‌కి కూడా అదే గతి పట్టింది. అందుకే వైసీపీ అంటే యముడు-సైంధవుడు-పిశాచి అని వర్ణించాల్సి వస్తోంది.
నీరుకొండ ప్రసాద్
9849625610