- పథకాల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు
- మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి (చైతన్యరథం): సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కలిసికట్టుగా అమలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుక సాధ్యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాయచోటి పట్టణంలోని తమ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మంత్రి మండిపల్లి మాట్లాడుతూ…గతంలో ఎవరూ చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదన్నారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని దివాళా తీయించిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వైసీపీ నేతల అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. అవ్వ, తాతలకు ఇచ్చే పెన్షన్‌తో వారు సమాజంలో గౌరవంగా బతుకుతూ సంతోషంగా జీవిస్తున్నారన్నారు. మార్చిలో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. డీఎస్సీలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూస్తామని, మంచి మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. ఉచిత గ్యాస్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే ప్రజలు తీసుకున్నారన్నారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తామన్నారు.