చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వెల్త్‌, హెల్త్‌, హ్యాపీనెస్‌..ఇదే స్వర్ణాంధ్రప్రదేశ్‌-2047 విజన్‌ సారాంశం

స్వర్ణాంధ్ర`2047 డాక్యుమెంట్‌పై సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Nov 23, 2024 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
వెల్త్‌, హెల్త్‌, హ్యాపీనెస్‌..ఇదే స్వర్ణాంధ్రప్రదేశ్‌-2047 విజన్‌ సారాంశం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పది సూత్రాలతో విజన్‌ రూపకల్పన
  • 17 లక్షలమంది సమాచార భాగస్వామ్యం
  • మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ ధ్యేయం
  • పేదరిక నిర్మాలన, సమ్మిళిత వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యం
  • పెట్టుబడి తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచుతాం
  • అదానీ అంశంలో వాస్తవాలనుబట్టి ఏంచేయాలో నిర్ణయిస్తాం
  • గత పాలకులు ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీశారు
  • చరిత్రలో ఎవ్వరూ చేయనన్ని తప్పులు చేశారు
  • రౌడీ రాజకీయాలుంటే పెట్టుబడిదారులు రారు
  • టీమ్‌ లీడర్‌గా రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తా
  • 5వసారి ముఖ్యమంత్రిగా శాసన సభకు వస్తా
  • స్వర్ణాంధ్ర`2047 డాక్యుమెంట్‌పై సీఎం చంద్రబాబు

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేస్తూ పాలనను సాగిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడిరచారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పునిచ్చారని.. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. భద్రత లేకుంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారన్నారు. శాసనసభలో ‘స్వర్ణాంధ్ర-2047’ డాక్యుమెంట్‌పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడతూ.. ‘వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ నినాదంతో డాక్యుమెంట్‌ను రూపొందించామని ప్రకటించారు.
‘2047నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లవుతుంది. ప్రధాని మోదీ వికసిత్‌ భారత్‌ పిలుపునిచ్చారు. మనం స్వర్ణాంధ్ర-2047 నినాదంతో ముందుకెళ్లాలి. ఎమ్మెల్యేలపై గురుతర బాధ్యత ఉంది. నియోజకవర్గ పరిధిలోనూ విజన్‌ డాక్యుమెంట్‌ తయారు చేయాలి. 2047నాటికి మీ నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అందులో పొందుపర్చాలి.

ప్రజలకు సేవ చేస్తే ఏ నియోజకవర్గమైనా గెలిపిస్తారు’’ అని చంద్రబాబు ఉద్భోదించారు.
‘1999లోనే విజన్‌ 2020కి రూపకల్పన చేశాం. 1995లో సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఖజానా ఖాళీగా ఉంది. నాడు రూపొందించిన విజన్‌తోనే హైదరాబాద్‌ సంపద సృష్టి కేంద్రంగా మారింది. నేడు స్వర్ణాంధ్రప్రదేశ్‌ 2047 విజన్‌కు పునాది వేస్తున్నాం. ఈ విజన్‌ను దుర్మార్గులు వస్తే తప్ప ఎవరైనా కొనసాగిస్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు ఉండాలి. అభద్రతా భావాన్ని ప్రేరేపిస్తే పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలా? వద్దా? అని ఆలోచిస్తారు. గ్లోబల్‌ థింకర్స్‌గా తెలుగువారున్నారు. అతిపెద్ద 5వ ఆర్ధిక వ్యవస్థగా మన దేశం ఉంది. 2047కి అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉండేందుకు వికసిత్‌ భారత్‌ విజన్‌ను ప్రధాని రూపొందించారు. రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే.. దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాలను దూరదృష్టితో ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు 5సార్లు ఈ విజన్‌ డాక్యుమెంట్‌పై పారిశ్రామికవేత్తలు, ప్రజలతో మాట్లాడాం. త్వరలోనే దీన్ని ప్రారంభిస్తాం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-07-2025

చైతన్యరధం ఈ పేపర్ 04-07-2025

చైతన్యరధం ఈ పేపర్ 03-07-2025

‘464 మండలాలు, 106 మున్సిపాలిటీలు, 1.18 కోట్లమంది ప్రజలతో మాట్లాడి, 10,078 సమావేశాలు నిర్వహించి మంత్రులు, ఎమ్మెల్యేలు, విద్యార్థులను భాగస్వాములను చేశాం. మొత్తంగా 17 లక్షలమంది విజన్‌కు అభిప్రాయాలు తెలిపారు. అందులో 56 శాతం మంది మహిళలు, 28 శాతం విద్యార్థులు, యువత, 17 శాతం రైతులు, 5 శాతం సీనియర్‌ సిటిజన్స్‌ సూచనలు చేశారు. దేశంలో ఎన్నో విజన్లు తయారు చేశారుగానీ 17 లక్షలమంది భాగస్వాములు కావడం ఇదే ప్రథమం’ అని చంద్రబాబు వివరించారు.

పది సూత్రాలతో ముందుకెళ్తున్నాం
‘10 ప్రధాన సూత్రాలతో ముందుకెళ్తున్నాం. దీనిపైనే మన ఆర్ధికవ్యవస్థ, భవిష్యత్‌ ఆధారపడి ఉంది. పేదరిక నిర్మూలన, ఉద్యోగాలు, స్కిల్స్‌, మానవ వనరుల అభివృద్ధి, నీటి సంరక్షణ, వ్యవసాయంలో టెక్నాలజీ, గ్లోబల్‌ బెస్ట్‌ లాజిస్టిక్స్‌, విద్యుత్‌-ఇంధనాల ఖర్చు తగ్గింపు, ఉత్పత్తిని పెంచడం, స్వచ్ఛాంధ్ర, డీప్‌ టెక్నాలజీ సూత్రాలతో ముందుకెళ్తున్నాం. పేదరిక నిర్మూలనకు ఏంచేయాలో ఆలోచిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి కల్పించాలన్న విజన్‌ డాక్యుమెంట్‌ను బాధ్యతగా తీసుకుంటాం. మానవ వనరుల అభివృద్ధి జరగాలి. అందరికీ తిండిపెట్టే రైతులు కష్టాల్లో ఉన్నారు. రైతుల పెట్టుబడి వ్యయం తగ్గిస్తాం. అందరిలో గౌరవంగా ఉండేలా చేస్తాం. టెక్నాలజీ ప్రోత్సహించి రైతులను ఆదుకుంటాం. గ్లోబల్‌ బెస్ట్‌ లాజిస్టిక్స్‌లో మన దేశం చేసే వ్యయం 14 శాతంగా ఉంది. భవిష్యత్తులో పెట్రోల్‌, డీజల్‌ వాడకం తగ్గుతుంది. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ వినియోగం పెరుగుతుంది. మన ఉత్పత్తులకు బ్రాండ్‌ లేకపోవడం వల్ల అదనపు అదాయం రావడం లేదు. ఏపీలో తయారయ్యే ప్రతి వస్తువుకూ బ్రాండ్‌ తీసుకొస్తాం. ఇప్పటికీ దోమల వల్ల మలేరియా, డెంగ్యూతో ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో రోగాలు వస్తున్నాయి. అందుకే రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా మార్చేందుకు పని చేస్తున్నామని’ చంద్రబాబు వివరించారు.

పీ4 విధానంతో పేదరిక నిర్మూలన
‘పీ4 విధానంతో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది. ఉన్నతస్థానంలో ఉన్న 10 శాతం మంది అట్టడుగున ఉన్న 10 శాతం మందిని దత్తత తీసుకోవాలని కోరుతున్నాను. ప్రజల దయవల్ల మనం ఇక్కడిదాకా వచ్చాం. ప్రజల దయవల్ల పరిశ్రమదారులు పెద్దవాళ్లు అయ్యారు. ఈ నేపథ్యంలో పేదల గురించి ఆలోచించాల్సి ఉంది. ప్రజలే దేశానికి పెద్ద ఆస్తి. ఏ దేశంలో లేనివిధంగా మనకు మానవ వనరులు ఉన్నాయి. లక్షల కోట్లు సంపాదించేవారున్నారు. మూడు పూటలా తిండిలేక అల్లాడుతున్నవారున్నారు. అందుకే ఆర్థిక అసమానతలు తగ్గించాల్సి ఉంది. బాగా చదువుకున్న వాళ్లు చదువుకు తగ్గ ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి స్థలం, నీటి వసతి, 24 గంటలూ విద్యుత్‌, క్లీన్‌ ఎనర్జీ, సోలార్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి, డిజిటల్‌ కనెక్టివిటీ ఉండాలి. పేదలకు సూర్యఘర్‌ కింద సబ్సీడీలో సోలార్‌ ఏర్పాటు చేస్తాం. దీనివల్ల విద్యుత్‌ఛార్జీలు తగ్గే అవకాశం ఉంటుంది. ఒక కుటుంబానికి ఏం కావాలో కుటుంబాన్ని యూనిట్‌గా పెట్టుకుని పైకి తీసుకొస్తాం. ఒక కుటుంబం -ఒక ఎంట్రపెన్యూర్‌ మన లక్ష్యం. ప్రతి కుటుంబానికి సోషల్‌ సెక్యూరిటీ ఉండాలి. అందరికీ ఆదాయం పెరిగే మార్గం చూపిస్తాం. అందరికీ ఆరోగ్యం, ఎడ్యుకేషన్‌, స్కిల్స్‌ కూడా అందేలా ఏర్పాటు చేస్తాం’ అని చంద్రబాబు ప్రకటించారు.

ఉద్యోగితను బట్టి ప్రోత్సాహకాలు
‘ఏ దేశానికి లేని విధంగా మనకు వారసత్వం ఉంది. కుటుంబ విలువల గురించి అందరికీ తెలియాలి. ఆర్థిక, కుటుంబ భద్రత ఉండాలి. ఇంట్లో అందరికీ పనుంటే సంతోషంగా ఉంటాం. శక్తికి తగ్గ పని కల్పించడం మన బాధ్యత. ప్రపంచస్థాయి ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరిలో నైపుణ్యం తీసుకురావడం, ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరుస్తాం. దేశంలో చాలా రాష్ట్రాల్లో కులగణన చేపడితే మనం నైపుణ్య గణన చేపట్టాం. ఎవరికి నచ్చిన సమయంలో వారు పని చేసుకునే విధానం కూడా ఇప్పుడు వచ్చింది. ఇంట్లో కూర్చుని పని చేసుకునే విధానం కూడా వచ్చింది. నైబర్‌ హుడ్‌ వర్కింగ్‌ విధానం తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నాం. వర్క్‌స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తే వారికి నచ్చినన్ని రోజులు అక్కడే చేయవచ్చు. త్వరలోనే ఈ పాలసీ తెస్తాం. వైట్‌ కాలర్‌, బ్లూకాలర్‌ ఉద్యోగాలు కల్పిస్తాం. ఎంఎస్‌ఎంఈలలో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తాం. ఉమెన్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ను కూడా ప్రమోట్‌ చేస్తాం. 20 లక్షల మందకి ఉద్యోగాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నాం. ఏ ప్రోత్సాహకం ఇచ్చినా ఉద్యోగితను కల్పించడమే ప్రాధాన్యతగా పెట్టుకున్నాం. పాపులేషన్‌ మేనేజ్మెంట్‌ పైనా శ్రద్ధ పెట్టాల్సి ఉంది. దీనిపై ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడతాం. కరికులమ్‌ను భవిష్యత్‌కు అనుగుణంగా మార్చుతాం’ అని చంద్రబాబు అన్నారు.

‘నీటి సంరక్షణ ముఖ్యం. ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీళ్లు అందించాలి. పరిశ్రమలకు కూడా నీరు అందించాల్సి ఉంటుంది. సుస్థిరంగా నీటి సరఫరా జరగాలి. గోదావరినుంచి బనకచర్లకు నీటిని తీసుకెళ్తే గేమ్‌ఛేంజర్‌ అవుతుంది. నదుల అనుసంధానం, పోలవరం పూర్తైతే రాష్ట్రానికి తిరుగుండదు. రైతుల ఆదాయం పెంచాలి. రుణాలు సులభతరం చేయాలి. టెక్నాలజీ అందించి పెట్టుబడి తగ్గించాలి. హార్టికల్చర్‌లో 20శాతం మేర ఉత్పత్తులు పాడవుతున్నాయి. దీన్ని నివారించాల్సి ఉంది. ప్రకృతి సాగు చేపట్టిన దగ్గర నష్టం కూడా తక్కువ వాటిల్లింది. ఆక్వా, హార్టికల్చర్‌ను పెద్దఎత్తున ప్రోత్సహించాల్సి ఉంది. డీప్‌ టెక్నాలజీ ద్వారా ఏఐ, డ్రోన్స్‌, రోబోటిక్స్‌ టెక్నాలజీ అందించాల్సి ఉంది. ఎక్కడ దోమ, తెగులు ఉందో అక్కడే పిచికారీ చేయాల్సి ఉంది. దీనివల్ల మందుల వృధాను తగ్గించవచ్చు. గ్లోబల్‌ మార్కెట్‌ హబ్‌గా రాష్ట్రం తయారవుతుంది. మన ఆక్వా ఉత్పత్తులు ప్రపంచమంతా ఎగుమతి అవుతున్నాయి. హార్టీకల్చర్‌ రంగంలోనూ రాష్ట్రం హబ్‌గా మారుతుంది. మామిడి, అరటి, మిర్చి, కాఫీ, నూనె గింజలకు ప్రత్యేక హబ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రైతుల సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూడాల్సి ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

‘రోడ్లు సరిగా లేవు. భయంకరంగా గుంతలున్నాయి. అవి సరిదిద్దాల్సి ఉంది. మెగా పోర్టులు, పోర్టులతో రహదారులను అనుసంధానించాల్సి ఉంది. ఇప్పటికే 3 అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. అవసరమైనన్ని ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేసుకుంటే రవాణా సౌకర్యం పెరుగుతుంది. 2 కోస్టల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ కూడా ఏర్పాటు చేస్తాం. సోలార్‌, విండ్‌, పంప్డ్‌ ఎనర్జీలతో గ్రీన్‌ఎనర్జీ ద్వారా ముందుకెళ్లొచ్చు. ఎన్టీపీసీ- ఏజీజెన్కో కలిసి రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి. విశాఖలో మోదీ శంకుస్థాపన చేస్తారు. ఏపీని గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా తయారు చేయాల్సి ఉంది. వాతావరణ మార్పులతో వర్షాలు సరిగా పడటం లేదు. వేడి పెరిగిపోతుంది. ఇవన్నీ బ్యాలెన్స్‌ చేయాలంటే గ్రీన్‌ ఎనర్జీ అవసరం’ అని వివరించారు.

స్వచ్ఛ ఆంధ్రను ప్రమోట్‌ చేస్తున్నాం
‘స్వచ్ఛ భారత్‌లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రాను ప్రమోట్‌ చేస్తాం. ఒకప్పుడు ఆడబిడ్డలు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడేవారు. అవమానపడేవారు. ఆత్మగౌరవం పేరుతో ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించాం. స్వచ్ఛభారత్‌- స్వచ్ఛాంధ్ర మనందరి కల. స్వచ్ఛాంధ్ర విధానాన్ని ఉద్యమంలా తీసుకెళ్తాం. మోసాలు, బెదిరింపులు చేస్తే పర్యాటకులు, పారిశ్రామికవేత్తలు రారు. నమ్మకం కలిగించేలా అంతా వ్యవహరించాలి. ఒకప్పుడు అక్ష్యరాస్యత గురించి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం. సమాచారం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎంత డబ్బులున్నాయో కాదు. ఎంత డేటా ఉందనేది చూసుకోవాలి. ఐఐటీ చెన్నై కూడా ఏపీలో డీప్‌ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పింది. రాబోయే రోజుల్లో అగ్రిటెక్‌, మెడిటెక్‌, పవర్‌టెక్‌ రావాలి. 20 మంది చేసే పనిని ఒక డ్రోన్‌ చేస్తుంది. షాపు యజమాని ఏది చెప్తే రైతులు ఆ మందు కొట్టి అప్పుల పాలవుతున్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు, నీరు, విద్యుత్‌ వంటి సదుపాయాలు కల్పించాలి. సీనియర్‌ సెటిజన్స్‌కు కూడా ఎస్‌హెచ్‌జీ గ్రూపులు పెట్టి ఆర్థికంగా అభివృద్ధి చేయాల్సి ఉంది’ అన్నారు.

‘విజన్‌ ఫ్రేమ్‌ వర్క్‌ కోసం 12 స్ట్రాటజిక్‌ థీమ్స్‌ తీసుకొస్తాం. టూరిజంపై 4 శాతం జీఎస్డీపీ ఉంది. 2047నాటికి 20 శాతానికి పెరుగుతుంది. భూ ఆక్రమణలు నిరోధించేందుకు ల్యాండ్‌ గ్రాంబింగ్‌ యాక్ట్‌ తెస్తున్నాం. దీనిపై త్వరలోనే సదస్సులు నిర్వహిస్తాం. 2047 నాటికి జనాభా 5.8 కోట్లు, అక్షరాస్యతను 100 శాతం, జీఎస్డీపీ 2.4 ట్రిలియన్‌ డాలర్లకు పెంపు, సగటు జీవన ప్రమాణం 85 ఏళ్లకు పెంచడం, తలసరి జీఎస్డీపీని 42 వేల డాలర్లకు పెంచడం, పట్టణీకరణ 60 శాతం, నిరుద్యోగిత రేటును 2 శాతానికి తగ్గించడం, ఎగుమతులు 450 బిలియన్‌ డాలర్లకు పెంచడం స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌లో లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చంద్రబాబు వివరించారు.

పబ్లిక్‌ పాలసీలే ప్రగతి చక్రాలు
‘పబ్లిక్‌ పాలసీలు ప్రజల జీవితాలను మార్చుతాయి. ఇప్పటికే ఇసుక, లిక్కర్‌, ఏపీ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ, ఎపీ ఎంఎస్‌ఎంఈ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలెప్మెంట్‌ పాలసీ, ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ, ఏపీ ఎలక్ట్రానిక్స్‌ పాలసీ, ఏపీ ఇండస్ట్రియల్‌ పార్క్‌ పాలసీ, ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ, టూరిజం పాలసీ, స్పోర్ట్స్‌ పాలసీ, డ్రోన్‌ పాలసీ, న్యూ వాటర్‌ పాలసీ, స్కిల్‌ డెవలెప్మెంట్‌ పాలసీ, స్క్రాపింగ్‌ ఆఫ్‌ టు చైల్డ్‌ నార్స్మ్‌ పాలసీలను తెచ్చాం. ఈ పాలసీల ప్రభావం అప్పుడే కనబడుతోంది. ఏపీఐఐసీ ద్వారా భూమి కేటాయిస్తే రూ.3,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 9,573 మందికి ఉద్యోగాలు వస్తాయి. మల్లవల్లి ఇండస్ట్రియల్‌ పార్క్‌ను స్ట్రీమ్‌ లైన్‌ చేయడం ద్వారా రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు వచ్చి 30 వేలమందికి, ఎస్‌ఐపీబీ ద్వారా రూ.73 వేల కోట్ల పెట్టుబడులతో 27,891 మందికి, ఎస్‌ఐపీబీ ఎనర్జీ రంగంలో రూ.11,900 కోట్లతో 6,075 మంది, ఎన్టీపీసీ రూ.1,81,000 కోట్ల పెట్టుబడి ద్వారా 1,22,500 మందికి, ఎన్‌హెచ్‌పీసీ ద్వారా రూ.లక్ష కోట్లతో 7 వేల మందికి, రిలయన్స్‌ కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ రూ.65 వేల కోట్ల ద్వారా 2.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. మొత్తంగా ఇప్పటికి రూ. 4,38,400 కోట్ల పెట్టబడులకు ఒప్పందాలు జరిగాయి. తద్వారా 4,53,039 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి’ అని చంద్రబాబు వివరించారు.

రాజధాని పనులు ప్రారంభిస్తాం
‘పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలుస్తాం. డిసెంబర్‌ 15నుంచి రాజధాని పనులు ప్రారంభిస్తాం. ఎమ్మెల్యేలు, గ్రూప్‌ డి, గ్రూప్‌ బి, ఆల్‌ ఇండియా సర్వీస్‌, జడ్జీల బంగ్లాలు, హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్‌ టవర్లు కూడా మూడేళ్లలోపే పూర్తి చేస్తాం. రూ.50 వేల కోట్ల ప్రాథమిక అంచనాతో పనులు ప్రారంభిస్తాం. కేంద్రం కూడా పోలవరం ప్రాజెక్టుకు రూ.12,157 కోట్లు మంజూరు చేసింది. ఐదేళ్లలో మేము 72 శాతం పనులు పూర్తిచేస్తే గత ప్రభుత్వం కేవలం 3.8 శాతం పనులు మాత్రమే పూర్తి చేసింది. డయాఫ్రం వాల్‌ పనులు కూడా 2026 మార్చి నాటికి పూర్తిచేస్తాం. పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో 2027 డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం’ అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

రాష్ట్రస్థాయిలో విజన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌
‘రాష్ట్రస్థాయిలో విజన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తాం. దీంతోపాటు జిల్లా, మండలస్థాయిలోనూ విజన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తాం. ప్రాథమిక, పారిశ్రామిక, సేవా రంగాల్లో జీఎస్డీపీని పర్యవేక్షిస్తాం. పాలనలో జవాబుదారీతనం తీసుకొస్తాం. కార్యాలయాల చుట్టూ తిరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాటికి పరిష్కారమార్గం చూపిస్తాం. అధికారులకు కూడా పిలుపు ఇస్తున్నా. రాష్ట్రం ఐదేళ్ల విధ్వంసంతో తీవ్రంగా నష్టపోయింది. దక్షిణ భారతదేశంలో తక్కువ ఆదాయం, తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఏపీ. మానవతా దృక్పధంతో ఆలోచించి ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరుతున్నా. డిసెంబర్‌ 1నుంచి నేను కూడా గేర్‌ మార్చుతా. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకని చరిత్ర సృష్టించాలి. టీమ్‌ లీడర్‌గా ముందుండి నడిపిస్తా. నేను ఐదోసారి కూడా ముఖ్యమంత్రిగా వస్తా. ప్రజలకు మంచి చేస్తే వాళ్లే మళ్లీ గెలిపిస్తారు. నియోజకవర్గాలపై ఎమ్మెల్యేలకు కూడా బాధ్యత ఉంది. నియోజకవర్గాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. మీకు పూర్తిగా సహకరిస్తా. మనం తెచ్చిన 2047 విజన్‌ను కూడా సాధ్యం చేస్తాం’ అని చంద్రబాబు ప్రకటించారు.

‘రూ.9.74 లక్షల కోట్లు అప్పులు చేశారు. వాటికి వడ్డీలు కట్టాలి. ఆదాయం పెంచి ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉంది. అభివృద్ధికి డబ్బులు ఖర్చు చేస్తేనే సంపద వస్తుంది. గత ఐదేళ్లూ మూడు ముక్కలాటలాడి రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఐదేళ్ల సమయాన్ని వృధా చేశారు. పోలవరం పూర్తి చేసి ఉంటే వ్యవసాయం బాగా అభివృద్ధి జరిగేది, రైతులు బాగుపడేవారు. రైతులకు కొనుగోలు శక్తి పెరిగితే ఆదాయం పెరిగేది. 2047 విజన్‌ను త్వరలోనే ప్రారంభిస్తాం. మారిన పరిస్థితులకు అనుగుణంగా వెర్షన్‌లు మారుతుంటాయి. విజన్‌ 5.0 తీసుకొస్తాం. అదానీ అంశంలో వాస్తవాలు బయటికొస్తే ఏంచేయాలో నిర్ణయిస్తాం. ఈ అంశాన్ని ప్రస్తావించిడానికి కూడా ఇబ్బంది కరమైన పరిస్ధితి కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది. మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తాం. అమెరికా కోర్టులో వేసిన చార్జిషీట్‌ మా దగ్గర ఉంది. చార్జిషీట్‌ అధ్యయనం చేసి ఏంచేయాలో నిర్ణయం తీసుకుంటాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

 

Previous Post

సీఎంఆర్‌ఎఫ్‌కు ఏపీ నరెడ్కో విరాళం

Next Post

మంత్రి లోకేష్‌ ఫ్లోర్‌ మేనేజ్‌మెంట్‌తో..అవాక్కయిన వైసీపీ!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-07-2025

కార్యకర్త
@ July 5, 2025
చైతన్యరధం ఈ పేపర్ 04-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-07-2025

కార్యకర్త
@ July 4, 2025
చైతన్యరధం ఈ పేపర్ 03-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-07-2025

కార్యకర్త
@ July 3, 2025
ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

చైతన్యరధం
@ July 3, 2025
చదువుల పండుగకు సర్వం సిద్ధం..!
ఆంధ్రప్రదేశ్

చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చైతన్యరధం
@ July 3, 2025
త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌
ఆంధ్రప్రదేశ్

త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

చైతన్యరధం
@ July 3, 2025
పెద్దకొడుకులా సేవ చేస్తున్నా
ఆంధ్రప్రదేశ్

పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

చైతన్యరధం
@ July 3, 2025
కుప్పం అభివృద్ధికి రూ.1617 కోట్ల ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

కుప్పం అభివృద్ధికి రూ.1617 కోట్ల ఒప్పందాలు

చైతన్యరధం
@ July 3, 2025
Load More

ముఖ్య వార్తలు

సీఎం కాన్వాయ్‌లో కామన్‌మ్యాన్‌ జర్నీ

సీఎం కాన్వాయ్‌లో కామన్‌మ్యాన్‌ జర్నీ

చైతన్యరధం
@ July 2, 2025
మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

చైతన్యరధం
@ June 25, 2025
వరద జలాలే వాడతాం

వరద జలాలే వాడతాం

చైతన్యరధం
@ June 25, 2025
ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

చైతన్యరధం
@ June 25, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం!

చైతన్యరధం
@ July 1, 2025 6:30 AM
బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

చైతన్యరధం
@ July 1, 2025 6:25 AM
ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2025 6:55 AM

సంపాదకుల ఆక్రోశం ఎవరి మెప్పుకోసం?

చైతన్యరధం
@ June 18, 2025 6:05 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

చైతన్యరధం
@ July 3, 2025
చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చైతన్యరధం
@ July 3, 2025
త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

చైతన్యరధం
@ July 3, 2025
పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

చైతన్యరధం
@ July 3, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist