- దోచుకున్న డబ్బు మొత్తం కక్కిస్తాం
- అవినీతి చేసి నీతి సూత్రాలు వళ్లిస్తారా
- రాజధానిపై దుష్ప్రచారం సిగ్గుచేటు
- గుంటూరు ఛానల్‌కు ఒక్కపైసా పనిచేశారా?
- ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల, తెనాలి శ్రావణ్‌కుమార్
గుంటూరు(చైతన్యరథం): రాజధాని మునిగిపోయిందంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు, వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచా రంపై టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్‌కు మార్ ధ్వజమెత్తారు. వైసీపీ పార్టీ రాజధాని నేతలు అమరావతి రాజధాని వరదతో మునిగిపోయాయి అని గగ్గోలు పెడుతున్నారు.. నీటిని ఎలా కొలుస్తారో తెలియని అంబటి రాంబాబుకు రాజధాని వరదలతో మునిగిపోయిందని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వైసీపీ పీకల లోతు అవినీతిలో మునిగిపోయారు..అందువల్లే అమరావతి పై బురద చల్లడమే ధ్యేయంగా పని చేస్తున్నారు..జగన్‌రెడ్డి, అంబ టి సోదరులకు 2024లో ప్రజలు బుద్ది చెప్పినా వారి తీరు మారలేదని ధ్వజమెత్తారు. అంబటి సోదరులు గుంటూరు ఛానల్ పై ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. వారు అధికారం లో ఉన్నప్పుడు గుంటూరు ఛానల్‌కి ఒక్క పైసా పనిచేశారా అని ప్రశ్నించారు. అమరావతి కొండవీటి వాగు నీళ్లు పొన్నూరు నియో జకవర్గంలోకి వాడారని అంటున్న అంబటి సోదరులకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కొండవీటి వాగు నుంచి లిఫ్ట్ ఇరిగేష న్ ద్వారా కృష్ణా నదికి పంపిన సంగతి చూడలేదేమో అని ఎద్దేవా చేశారు. అంబటి సోదరులు ఈ మధ్యన ఎమ్ అనే అక్షరం తెగ మాట్లాడుతున్నారు. ఎం అంటే వారి పేటెంట్ దేనికంటే మర్దర్లు, మనిలు, మోసాలు చేయడం అంబటి సోదరులకు అల వాటు.
నంబూరు గ్రామం వరదలతో మునిగిపోయిందని గగ్గోలు పెడుతు న్నారు..అందుకు కారణం గ్రామంలో మీ మాజీ వైసీపీ ఎమ్మెల్యే రోశయ్య వేసిన వెంచర్ మూలంగా మునిగిపోయింది. వందలాది మంది వినియోగదారుల మోసం చేసి అపార్ట్‌మెంట్స్ కట్టి అమ్ము కుంటున్న సంగతి తెలియదా అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం మేము బతకడం లేదు.. ప్రజా సేవకు మాత్రమే రాజకీయా లు చేస్తున్నామని తెలిపారు. తెనాలి శ్రావణ్‌కుమార్ ఎస్సీ ఎమ్మెల్యే పైనే అట్రాసిటీ కేసు పెట్టిన ఘనత వైసీపీ అధినేతకే దక్కింది. రాబోయే రోజుల్లో అంబటి సోదరులు, వైకాపా నాయకులు దోచు కున్న డబ్బులు మొత్తం బయటకు లాగుతామని హెచ్చరించారు. టీడీపీ పార్టీపై బురదజల్లడమే ద్యేయంగా పనిచేస్తున్న మీరు కూడా నీతి మాటలు చెబుతున్నారా? అని మండిపడ్డారు. అంబటి సోదరులపై రాబోయేరోజుల్లో సాక్షాధారాలతో వారి బాగో తాలు సీరియల్‌గా బయటపెడతానని హెచ్చరించారు.