- పలు సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరణ
- మంత్రి లోకేష్‌ను కలిసిన వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు
- ఆందోళన వద్దని మంత్రి భరోసా
పుట్టపర్తి (చైతన్యరథం): శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం-2.0 కార్యక్రమంలో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముందుగా.. గురువారం ఉదయం కప్పలబండలోని పారిశ్రామికవాడలో ప్రజలు, కార్యకర్తలను కలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి.. వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ప్రతి ఒక్కరితో కలిసి ఫోటోలు దిగారు.
ఆర్కిటెక్చర్ వర్సిటీ విద్యార్థులకు భరోసా
కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కడపలోని వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను కలిసి యూనివర్సిటీ గుర్తింపు విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. విద్యార్థుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేష్.. కలిసికట్టుగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనా చెందవద్దని భరోసా ఇచ్చారు. విద్యార్థులు విద్యపై దృష్టిపెట్టాలని, మీ భవిష్యత్‌ను తాను చూసుకుంటాని ధైర్యం చెప్పారు. విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు దూరంగా ఉండాలని, ఈ దిశగా యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు.