- ఐదేళ్లలో వారి అరాచకాలకు అంతే లేదు
- రైతుల పొలాలను అన్యాయంగా లాక్కున్నారు
- రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల ఎకరాల పైనే కబ్జా
- వైవీ, విజయసాయి, సజ్జల దందాలు నిజం
- 45 రోజుల్లో స్వాధీనం చేయకుంటే చర్యలు
- టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం
మంగళగిరి(చైతన్యరథం): గత జగన్‌రెడ్డి పాలనలో రైతుల భూములను లాక్కుని వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 22ఏ నిషేధ జాబితా నుంచి 1.88 కోట్ల ఎకరాల భూములకు విముక్తి కలిగించడం కూటమి ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. 22ఏ జాబితా నుంచి విముక్తి కల్పించడంతో పేదల్లో హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయన్నారు. పేదలకు భూమి మీద హక్కు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమైతే…వారి భూములను కబ్జా చేయ డమే వైసీపీ నేతల లక్ష్యమని మండిపడ్డారు. వైసీపీ పాలనలో నచ్చిన భూమిని 13 లక్షల ఎకరాలు కబ్జా చేశారు. విశాఖలో విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి అడ్డగోలు గా భూములను దోచేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కడపలో 52 ఎకరాలు దోచుకున్నా డు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు స్మశానాలను కూడా వదల్లేదు. వైసీపీ నేతల భూ దోపిడీలను కూటమి ప్రభుత్వం వెలికితీస్తోంది. రెవెన్యూ సదస్సులలో వైసీపీ నేతల దోపిడీలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. రానున్న 45 రోజుల్లో వైసీపీ నేతలు దోచుకున్న భూములను స్వాధీనం చేయకుంటే కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
భూ కబ్జాలు అక్షర సత్యం
వైసీపీ హయాంలో నాయకులకు నచ్చిన భూమి వారి సొంతం చేయకుంటే ఖతం చేయడానికి కూడా వెనకాడేవారు కాదు. కడప జిల్లాలో సజ్జల 52 ఎకరాల భూమి కబ్జా చేసిన మాట అక్షరాల సత్యం. విశాఖలో విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిలు భూ బకాసురుల అవతారమెత్తి ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా అక్కడ వాలిపోయే వారు. వైసీపీ హయాంలో భూ కబ్జాదారులు జనాన్ని ఊపిరాడనివ్వకుండా చేసే వారు. కొడుకును కోల్పోయిన తండ్రిలా భూములు కోల్పోయిన రైతులు, బాధితులు విలవిలలాడారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎవరి భూములు వారికి వచ్చేలా ల్యాండ్ టైట్లింగ్ యాక్టును రద్దు చేసి అందరి మన్ననలు పొందారు. భూ బకాసురుల కబంద హస్తాల నుంచి పేదల భూములకు విముక్తి కలిగించాలని కూటమి ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది. వైసీపీ నాయకుల అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఈ ప్రభుత్వంలో సాగటం లేదు. రెవెన్యూ సదస్సులు నిర్వహించి వాటిని విజయవంతం చేయడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయన్నారు. డిసెంబర్ 5 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించగా 2 లక్షలకు పైగా భూ సమస్యలపై అర్జీలొచ్చాయం టే వైసీపీ భూ దందాలు ఏ విధంగా సాగాయో అర్థమవుతోందని తెలిపారు.
ఐదేళ్ల అరాచకాలకు ముగింపు
వైసీపీ గత ఐదేళ్ల పాలనలో రైతుల భూములు లాక్కోవడమే కాకుండా వారిపై పోలీసుస్టేషన్లలో కేసులు పెట్టి వేధించారు. భూములు కోల్పోయిన రైతులు విలవిల లాడారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తొలి అడుగు నుంచి చివరి అడుగు వేసే వరకు ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో వైసీపీ నాయకుల భూ కబ్జాల గురించి వినతులు వచ్చేవి. తమ భూములు కబ్జా చేశారని, తమపై కేసులు పెట్టి జైళ్లకు పంపించారని అనేక ఫిర్యాదులు వచ్చేవి. చంద్రబాబు ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా ఇలాగే మొరపెట్టుకునే వారు. వైసీపీ నాయకులు దేవాదాయ భూములను కూడా వదలలేదు. దళిత బడుగు, బలహీనవర్గాల భూములను వదలలేదు. సామాన్యు ల ఇళ్లపై కూడా కన్నేశారు. విచారించి న్యాయబద్ధంగా ఎవరి భూములు వారికి వచ్చేలా చేస్తామని నారా లోకేష్, చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పారు. చెప్పిన విధంగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్టును రద్దు చేసి రైతులకు ఉపశమనం కలిగించారు. కూటమి ప్రభుత్వాన్ని, ఇందుకు చంద్రబాబును అభినందిస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 5 నుంచి జరిగిన రెవెన్యూ సదస్సుల్లో 2 లక్షలకు పైగా భూ కబ్జాలపై అర్జీలొచ్చాయంటే వారి నిర్వాకం అర్థమవుతోంది. వైసీపీ హయాంలో గ్రామానికొక భూ కబ్జాదారుడు ఉండే వాడు. మండలానికొక భూ బకాసురుడు ఉద్భవించాడు. నియోజకవర్గానికొక దగా కోరు తయారయ్యాడు. ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం హర్షదాయకం. రానున్న 45 రోజుల్లో కబ్జా చేసిన భూములను స్వాధీనం చేయకుంటే వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు.