- గత ప్రభుత్వం ఆక్రమణలతోనే దానిని కోల్పోయాం
- సీఆర్‌జెడ్ విషయంలో సడలింపులు అవసరం
- అసెంబ్లీలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
అమరావతి(చైతన్యరథం): స్పీకర్ అయ్యనపాత్రుడు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు చెప్పినట్లుగా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) అనేది పర్యాటక అభివృద్ధికి ప్రతిబంధకంగా ఉందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సడలింపు తీసుకు రావాల్సిన అవసరం ఉందని అసెంబ్లీలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. రుషికొండ బీచ్ విషయంలో గత ప్రభుత్వ తాలూకు ఆక్రమణల కారణంగా బ్లూఫ్లాగ్‌ను తాత్కాలికంగా కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆక్రమణలు తొలగించడం, పరిశుభ్రత పాటించడం, ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్‌ను పెంపొందించడం వంటి అంశాలపై మేం దృష్టి సారించి నట్లు చెబీప్పారు. ఏపీలోని ప్రముఖమైన పర్యాటక ప్రాంతాలు వైజాగ్ సమీపంలో ఉన్నా యని వాటిని అభివృద్ధి చేస్తే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా వెలుగొందే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే బ్లూఫ్లాగ్ విషయంలో ఒకసారి ఆడిట్ జరిగింది. సంబంధిత బ్లూఫ్లాగ్ వారు సంతృప్తి చెందారు. 18వ తేదీన మరో ఆడిట్ ఉంది. ఆ ఆడిట్ జరిగిన తర్వాత కచ్చితంగా మళ్లీ బ్లూఫ్లాగ్ జెండాను ఎగరవేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
టూరిజం అభివృద్ధికి కేబినెట్ సబ్ కమిటీ
టూరిజం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్, అటవీ మంత్రి పవన్‌కళ్యాణ్, దేవాదాయ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి, పర్యాటక మంత్రిగా తాను అందులో సభ్యులుగా ఉన్నామని వివరించా రు. జలవనరుల మంత్రిని చేర్చమని అడిగాం. అన్ని శాఖలు చేయాల్సిన పనులు ఈ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ మంత్రి, రోడ్లు భవనాల మంత్రులు సమాధానమివ్వాల్సిన ప్రశ్నలను ఎమ్మెల్యేలు లేవనెత్తారు. పెట్టుబడుల కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌ను ప్రభుత్వం ప్రమోట్ చేస్తుందని తెలిపారు. నెల్లూరు జిల్లా కోడూరులో వేళాంగిణిమాత పరిసర ప్రాంతాల అభివృద్ధికి సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. కోడూరు బీచ్ ప్రాంతానికి ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. కోడూరు బీచ్‌ను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
సముద్ర ఆధారిత పర్యాటకంపై కందుల వివరణ
తీరప్రాంతంలో సముద్ర ఆధారిత పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ప్రధానంగా సముద్ర ఆధారిత పర్యాటకం అభివృద్ధి కి ప్రభుత్వం సవివరమైన బృహత్తర ప్రణాళికను రూపొందిస్తుందని చెప్పారు. బీచ్‌లు, క్రూజింగ్ బోటింగ్, ఫిషింగ్, సర్ఫింగ్, పాడిల్ బోర్డింగ్, వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అభివృద్ధి ఇందులో ఉంటుంది. టూరిజం సెక్టార్‌కు పరిశ్రమ హోదా ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుంది. దాని ప్రకారం రాష్ట్రంలో 7 యాంకర్ హబ్స్, 25 థీమాటిక్ సర్క్యూట్‌లను గుర్తించాం. అందులో బీచ్ సర్క్యూట్‌లు 5. అవి విశాఖ పట్టణం, శ్రీకాకుళం, కాకినాడ, నెల్లూరు, మచిలీపట్నం. ఈ 5 ప్రాంతాలను తీర ప్రాంత పర్యాటక అభివృద్ధి కింద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. రివర్ క్రూయిజ్ సర్క్యూట్ కింద నాలుగు ప్రాంతాలను ఎంపిక చేశాం. గోదావరి, కృష్ణా, కోనసీమ, బ్యాక్ వాటర్. ఈ రకంగా సముద్ర తీర, నదీ తీర ప్రాంతం వీటన్నింటిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాం. జర్మనీ పర్యటనలో యూరోపియన్‌లు బీచ్ టూరి జం, వెల్‌నెస్ టూరిజంను ఇష్టపడుతున్నారని గుర్తించాను. సంబంధిత పర్యాటకంలో పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉంది. రాష్ట్రంలో 974 కి.మీల సుదీర్ఘ సముద్ర తీరం ఉందని, సంబంధిత ప్రాంతాన్ని తాము పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వెల్ల డిరచాను. వెల్ నెస్ టూరిజం డెవలప్ మెంట్‌ను కూడా తాము అభివృద్ధి చేస్తామని చెప్పాను. ఈ విషయంలో పెట్టుబడులకు ముందుకు వస్తే ప్రభుత్వం తరపున ముఖ్య మంత్రి చంద్రబాబు సంపూర్ణ సహకారం అందిస్తారని చెప్పాను. రాబోయే రోజుల్లో నాలుగు సీ సర్క్యూట్‌లు అభివృద్ధి చేస్తాం. ఆ పక్కనే యోగా, ఆయుర్వేద తదితర వెల్ నెస్ సెంటర్లు, టూరిజం అభివృద్ధి చేస్తాం. బీచ్ రిసార్ట్స్‌తో పాటు బీచ్ వాలీబాల్ తదితర బీచ్ స్పోర్ట్స్ ఏర్పాటు చేస్తాం. పరిశుభ్రతకు పెద్దపీట వేసేందుకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
బుద్ధిస్ట్ సర్క్యూట్‌ల అంశంపై వివరణ
బుద్ధిస్ట్ సర్క్యూట్‌ల అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో ఇటీవల కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసినప్పుడు ఒక సర్క్యూట్ ను రాష్ట్రానికి కేటాయించాలని కోరాం. ఈ క్రమంలో బుద్ధిస్ట్ సర్క్యూట్‌లను రెండు రకా లుగా వర్గీకరించామని చెప్పారు. బుద్ధుడు జన్మించి పరమపదించిన వరకు బుద్ధుడు తిరిగిన ప్రదేశాలను ఒక సర్క్యూట్‌గా చేస్తారు. బౌద్ధ మతం వ్యాప్తి చెందిన ప్రదేశాలను రెండో సర్క్యూట్‌గా చేస్తారు. ఏపీకి కేటాయించిన బుద్ధిస్ట్ సర్క్యూట్ రెండో కేటగిరికి చెందింది. బౌద్ధమతం వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. విశాఖపట్టణం సమీపంలోని తొట్లకొండ, బావికొండ, అమరావతిలోని బౌద్ధారామాలు వీటన్నింటిని కలిపి బుద్ధిస్ట్ సర్క్యూట్‌గా చేయాలని కోరాం. గుడివాడ దగ్గర బుద్ధిస్ట్ ఆనవాళ్లు కనిపిం చాయి. ఆయా ప్రాంతాలను కూడా కలిపి సర్క్యూట్‌గా చేసేందుకు రూపకల్పన చేస్తు న్నాం కేంద్ర ప్రభుత్వం వీటికి ఇతోధికంగా సాయం అందిస్తున్న నమ్మకం ఉంది. బుద్ధిస్ట్ సర్క్యూట్ కేటాయిస్తామని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపీలో బుద్ధిజంకు సంబంధించిన ప్రాముఖ్యతను నిలబెట్టే విధంగా కూటమి ప్రభుత్వం నిర్మాణాత్మకంగా పనిచేస్తుందని తెలిపారు.