అమరావతి (చైతన్యరథం): కుల గణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ హృదయపూర్వకంగా స్వాగతించారు. దశాబ్దాలుగా నెలకొన్న అడ్డంకులను అధిమించి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం చరిత్రను తిరగరాసిందన్నారు. సామాజికన్యాయ సాధనలో భాగంగా సాధికారత అనే తన దార్శనికతకు కట్టుబడి ప్రధాని మోదీ ఈ విప్లవాత్మక చర్య తీసుకున్నారన్నారు.