అమరావతి (చైతన్యరథం): ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్పై అద్భుతంగా ఆడి భారత్ను విజయతీరాలకు చేర్చిన తెలుగు యువ కెరటం తిలక్ వర్మను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎంతటి స్టార్! మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ పిచ్ ని పూర్తిగా సొంతం చేసుకున్నాడు, భారత్ని విజయపథంలో నడిపించాడు! ఒత్తిడిలో ప్రశాంతత కూడిన అతడి ప్రతిభావంతమైన ఆటతీరు స్ఫూర్తిదాయకం. తెలుగు కుర్రాళ్లలో కనిపించే ఉత్సాహం ఇదే. చాలా బాగా ఆడావు. తిలక్, నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నామని సీఎం చంద్రబాబు అభినందించారు.
దేశ క్రికెట్లో అద్భుత ఘట్టం
ఆసియాకపన్ను గెలుచుకున్న టీమిండియాకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ పై భారత్ సాధించిన విజయం అద్భుతమైనది. టీం వర్క్, అంకితభావంతో, స్ఫూర్తినిచ్చేలా ఆడిన టీమిండియా ఆసియా కప్ చేజిక్కించుకుంది. దేశం గర్వించదగ్గ క్షణాలివి. ఇండియన్ క్రికెట్లో ఈ గెలుపు ఓ అద్భుతమైన ఘట్టమని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.