అమరావతి (చైతన్య రథం): 15వేల బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడితో విశాఖ కేంద్రంగా గూగుల్ ఏఐ హబ్ నెలకొల్పుతోన్న కథనం అంతర్జాతీయ పత్రికలలో చోటుచేసుకోవడం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. ‘‘అంతర్జాతీయ ప్రచురణ వాల్ స్ట్రీట్ జర్నల్‌లో విశాఖపట్నం పేరు చూసినపుడు చెప్పలేనంత సంతోషం కలిగింది. ఏపీలోని విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ 15 బిలియన్ల పెట్టుబడితో డేటా హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ ప్రచురించిన కథనం సారాంశం. టెక్నాలజీ పెట్టుబడుల కోసం వైజాగ్ ప్రపంచ పటంలోకి ప్రవేశిస్తోందన్న కథనం నాకు చాలా సంతోషాన్నిచ్చింది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘యంగెస్ట్ స్టేట్.. హయ్యస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. గూగుల్ కమ్స్ టు ఏపీ’ అంటూ చంద్రబాబు ఆసక్తికరమైన టాగ్‌లైన్ ఇచ్చారు.