- మాస్టర్‌ప్లాన్ రోడ్లు, ప్రాజెక్టులు పట్టాలెక్కించాలి
- టిడ్కో ఇళ్లలో అవకతవకలపై విచారణ జరిపించాలి
- తాగునీటి ఎద్దడికి వేసవి కార్యాచరణ అమలుచేయాలి
- డీఆర్సీలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
విశాఖపట్టణం(చైతన్యరథం): దేశంలో ప్రముఖమైన నగరాల్లో ఒక్కటైన విశాఖపట్ట ణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని, ఆర్థిక రాజధాని ప్రమాణాలకు అనుగు ణంగా తీర్చిదిద్దేలా సరైన కార్యాచరణతో ముందుకెళ్లాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఆర్థికంగా రోజురోజుకూ ఎదుగుతున్న విశాఖ నగర గౌరవాన్ని, ప్రతిష్టతను కాపాడుకునేలా సమష్టి కృషి చేయాలని సూచించారు. విశాఖపట్టణం జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలో ఆయన వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో భాగంగా ముందుగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ జిల్లాలోని చేపట్టబోయే ప్రాజెక్టులు, జిల్లా స్థితిగతుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ మాస్టర్ ప్లాన్ రోడ్లపై, ఇతర ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మంత్రి డోలా మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా ఆదాయ వనరులు కలిగిన నగరం విశాఖపట్టణ అభివృద్ధికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని, దానికి అనుగుణంగా ముందుకు సాగు దామన్నారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపుదామని, ప్రజలకు మంచి సేవ లందిద్దామని పేర్కొన్నారు. పేదలందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ఆక్రమణల క్రమబద్ధీకరణ నిమిత్తం జీవో 30ని తీసుకొచ్చిందని, దీని ఆవశ్యకతను, ప్రయోజనాలను ప్రజలకు మరింత వివరించాల్సి ఉందని అన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వీఎం ఆర్డీఏ పరిధిలో చేపట్టే మాస్టర్ ప్లాన్ రోడ్లను, ఇతర ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని నిర్దేశించారు. సదరం స్లాట్ల విషయంలో వెసులుబాటు కల్పించాలని, ప్రజలకు సమీపంలోని ఆరోగ్య కేంద్రాల్లో స్లాట్ ఇవ్వాలని సూచించారు. మేఘాద్రి గెడ్డ, గంభీరం రిజర్వాయర్ల నిర్వహణపై సమీక్షించిన ఆయన ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తుది చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నగరంలో పలు చోట్ల వీధి దీపాలు సరిగ్గా వెలగటం లేదని ప్రజా ప్రతినిధులు ప్రస్తావించగా వెనువెంటనే ఆడిట్ చేయించి ఎక్క డెక్కడ అవసరమో అక్కడ వీధి దీపాలు యుద్ధప్రాతిపదికన వేయించాలని అధికారులను ఆదేశించారు.
టిడ్కో అవకతవకలపై కమిటీతో విచారణ
టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, మంజూరు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పలు అవకతవకలు జరి గాయని, జాబితాలు తారుమారు అయ్యాయని పలువురు ప్రజా ప్రతినిధులు ప్రస్తావిం చగా దీనిపై ప్రత్యేక కమిటీ ద్వారా విచారణ చేయించాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి సూచించారు. నిజనిర్ధారణ చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సాధార ణంగా సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టే వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు సహకారం అందించాలని సూచించారు. 100 గజాల లోపు స్థలంలో ఇళ్లు కట్టుకునే వారికి సెల్ఫ్ సర్టిఫికేషన్ విషయంలో అడ్డంకులు సృష్టించకుండా అవగాహన కల్పించాలని చెప్పారు. జీవీఎంసీ ప్రణాళిక విభాగంలో ప్రక్షాళన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో చేపట్టబోయే పనులకు సంబంధించి మాస్లర్ ప్లాన్ అనుసరిం చాలని, దీనికి తగ్గట్టు కార్యాచరణ రూపొందించి ముందుకెళ్లాలని నిర్దేశించారు. వైద్యా రోగ్య శాఖ పరిధిలో అందజేసే పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియ పక్కాగా జరగాలని, అర్హుల కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమా వేశం అనంతరం డీఆర్సీ సమావేశపు సారాంశాన్ని మంత్రి మీడియాకు వివరించారు.