- జగన్ పాలనలో భూ కబ్జాలు, అరాచకాలపై ఫిర్యాదులు
- ఐదేళ్లలో ప్రజలను ఎంతగా హింసించారో అర్థమవుతోంది
- బాధితులకు అండగా ఉంటాం..ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
- వినతుల స్వీకరణలో మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ భరోసా
మంగళగిరి(చైతన్యరథం): ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం రాష్ట్ర మంత్రులు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతుల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రెండోరోజు గురువారం మైనార్టీ, న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పు నేందు కు తరలివచ్చారు. గ్రీవెన్స్‌కు మొత్తం 130 వరకు వినతులు రాగా అందులో ముఖ్యంగా వైసీపీ నాయకుల భూకబ్జాలు, భూ వివాదాలు, అక్రమ కేసులే అధికంగా ఉన్నాయి.
కాటసాని, ఇతర నేతల భూకబ్జాలపై ఫిర్యాదు
పాణ్యం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జా చేశారని, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బెంగళూరుకు చెందిన శైలజ ల్యాండ్‌ను ఆక్రమించుకున్నారని, కనిగిరి నియోజకవర్గం చెర్లోపల్లికి చెందిన రైతు భూమి, మదనపల్లి లో మరో రైతు భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యలు విన్న మంత్రి వాటిని పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. తిరుపతికి చెందిన బయ్యన్న భూ వివాదం గురించి ఎస్పీతో మాట్లా డి పరిష్కరించాలని ఆదేశించారు.
హోంమంత్రి దృష్టికి హత్య కేసు
నరసరావుపేటకు చెందిన టీడీపీ మైనారిటీ నాయకుడి హత్య కేసులో కావాలని పలువురిని కేసు నుంచి తప్పించడంపై స్థానిక సీఐతో మాట్లాడటంతో పాటు హోంమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. పులివెందుల నియోజకవర్గంలో శివప్రసాద్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్తను వైసీపీ నాయకులు హింసిస్తున్న విషయాన్ని స్థానిక ఇన్‌చార్జి బీటెక్ రవి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించమని చెప్పారు. షరీఫ్ అనే సీనియర్ కార్యకర్తకు గుండె సమస్యకు సంబంధించి ప్రతి నెలా 5000 ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి అందించేలా మాట్లాడారు. అంతేకాకుండా పలు సమస్యలపై నేరుగా సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి పరిష్కరించాలని ఆదేశించారు.
ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ వైసీపీ నాయకుల అరాచకాలు, దోపీడీ లపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం పరిష్కరించగల ఫిర్యాదు లను ఆయా శాఖలకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుం టున్నట్టు చెప్పారు. మరికొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించినట్టు వివరించారు. పార్టీ పరంగా పదవులు కోరుతూ కొన్ని దరఖాస్తులొచ్చాయని, వాటిని కూడా పరిశీలించి కష్టపడ్డ వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.