అమరావతి (చైతన్యరథం): మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ అనేక కుటిల పన్నాగాలు పన్నుతున్న వేళ భారతీయులందరం ఒకటే అని చాటి చెప్పేందుకు ‘వందే మాతరం’ అంటూ నినదించి, దానినే మన సోషల్ మీడియా ఖాతాల డీపీగా పెట్టుకోవాలని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. పాక్ ఉగ్రమూకలు, ఆ దేశ సైన్యం ఇంకా నరమేధం సృష్టిస్తూనే ఉన్న నేపథ్యంలో మనమంతా నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు.
దేశ ప్రజలందరికీ నా విజ్ఞప్తి! భారతదేశ సమగ్రతను దెబ్బతీయాలని శత్రుదేశం కుట్రలు పన్నుతున్న వేళ… మనందరం కలిసికట్టుగా భారత ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంకేతంగా మీ ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా అక్కౌంట్లలో ఈ డీపీని పెట్టుకోండి.. వందేమాతరమంటూ నినదించండి అంటూ వందేమాతరం పోస్టర్‌ను ఎక్స్‌లో మంత్రి లోకేష్ షేర్ చేశారు.