- అతడి అరెస్ట్‌పై వైసీపీ నేతల పెడబొబ్బలు సిగ్గుచేటు
- నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరు
- అంబోతు రాంబాబు రంకెలు ఆపాలి
- తప్పు చేసినవారు గుడివాడ, దెందులూరు, బందర్.. ఎక్కడ ఉన్నా కటకటల్లోకే
- ఎమ్మెల్యే చింతమనేని ధ్వజం
అమరావతి (చైతన్యరథం): ఆడబిడ్డలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వల్లభనేని వంశీ నాలుకను కోసినా తప్పులేదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. నాడు అధికార బలం ఉందని నాడు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయారు. మదం తలకెక్కిన వంశీ ఆడవాళ్లను తిడుతుంటే .. జగన్ పకపకా నవ్వుతూ కూచున్నాడు. వంశీ జైలుకు వెళ్లడానికి కారణం జగనే. మరి వంశీని పరామర్శించకుండా జగన్ బెంగళూరు ఎందుకు వెళ్లాడు? ఇలాంటి వ్యక్తి అరెస్ట్ అయితే ఆంబోతులా అంబటి రాంబాబు అరుస్తున్నాడు. అసలు ఆ అరగంట, గంట విషయం ఏంటో రాంబాబు ముందు ప్రజలకు చెప్పి తరువాత మాట్లాడాలని చింతమనేని దుయ్యబట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చింతమనేని మాట్లాడుతూ వంశీ అరెస్ట్ అక్రమం అని వైసీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. వంశీ ఏ తప్పు చేయకుండానే గన్నవరం టీడీపీ కార్యాలయం తగలబడుతుందా? మీరు అధికారంలో ఉండి నాడు మీ తప్పులను కప్పి పుచ్చుకున్నారు. అక్రమ అరెస్ట్‌లు, తప్పుడు హౌస్ అరెస్ట్‌లు వైసీపీ ప్రభుత్వంలోనే జరిగేవి. అవసరమైతే చింతపల్లి ఫారెస్ట్‌లోకి తీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించడంతో పాటు కొంతమందిని అసలు భూమి మీదనే లేకుండా చేసింది వైసీపీ నేతలే. ఇటువంటివి మీకే సాధ్యం. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని తీసుకు వచ్చింది వైసీపీ నేతలు కాదా? ఎటువంటి తప్పు చేయకపోయినా ఆయన భూమి మీద లేకవపోవడానికి కారణం వైసీపీ, జగన్ మోహన్ రెడ్డి కాదా? అధికారంలో ఉండగా చేసిన నేరాలకు వంశీని ఇప్పుడు అరెస్ట్ చేశారు. వంశీనే కాదు కొడాలి నానితో పాటు అరాచక వ్యక్తులు అందరూ అరెస్ట్ అవుతారు. నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు. చట్టం అమలు అయ్యేందుకు కాస్త సమయం పట్టొచ్చేమో కాని శిక్ష తప్పదు. ఇలాంటి వారందరూ కటకటాలపాలు కాక తప్పదని చింతమనేని స్పష్టం చేశారు.
గతం మరిచి అరుపులు
రాత్రిపూట కామబాబు.. పగలు రాంబాబుకు మంత్రి పదవి ఇచ్చి ప్రభుత్వ స్థాయిని జగన్ దారుణంగా దిగజార్చాడు. ఇలాంటి ఆంబోతు రాంబాబు కూడా వంశీ అరెస్ట్‌పై మాట్లాడుతున్నాడు. క్యూసెక్, టీఎంసీ అంటే ఏంటో తెలియని వ్యక్తి ఇరిగేషన్ శాఖకు మంత్రిగా ఉండి పోలవరాన్ని పడుకోబెట్టి సర్వనాశనం చేశాడు. రాంబాబు గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య వెనుక అంబటి వేధింపులు కూడా ఉన్నాయి. దీనిపై రాంబాబు మీద 306 సెక్షన్ కింద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. పరోక్షంగా కోడెల చావుకు కారణం రాంబాబు, జగన్‌లే. మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నాడు స్వయంగా డీజీపీని కలిసేందుకు వెళితే గేటు దాటి రానివ్వకుండా వెనక్కి పంపారు. డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి వైసీపీ మూకలు చొరబడి కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆఫీసు సిబ్బందిపై దాడి చేస్తే… నాడు డీజీపీ ఎక్కడికి పోయాడు. ఆ రోజు ముఖ్యమంత్రి ఎక్కడికిపోయాడు. నిన్ను తిడుతుంటే నీకు రోషం వస్తుంటే.. మా కార్యాలయాలు.. మాపై దాడులు చేస్తుంటే మాకు కోపం రాదా? నాడు ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు వెళుతుంటే రాళ్లు విసిరినా దానిపై నాటి డీజీపీ మాట్లాడుతూ బావప్రకటనా స్వేచ్ఛ అంటూ సమర్థించాడు. డీజీపీ రిప్రజెంటేషన్ తీసుకోకుంటే తగలబెట్టి వెళ్తానంటున్నారు. వైసీపీ సంస్కృతే అది. ఇప్పుడు మీకు, మీ నాయకులకు ఇబ్బంది వస్తే నొప్పి తెలుస్తోందా అని చింతమనేని నిలదీశారు.
అంబటి సిగ్గులేని మాటలు
నాపై ఏ తప్పు లేకుండా ఎస్సీ, ఎస్టీ కేసులు, హాత్యాయత్నం కేసులు నమోదు చేశారు. 67 రోజులు జైల్లో పెట్టారు. అన్యాయంగా చంద్రబాబుని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 53 రోజులు జైల్లో పెట్టారు. దాని ఫలితమే నేడు వైసీపీకి 11 సీట్లు. సిగ్గులేకుండా అబ్బయ్య చౌదరిని ఇబ్బంది పెడుతున్నారంటూ.. అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. అసలు అబ్బయ్య గురించి రాంబాబుకు ఏమి తెలుసు. పేరుకే సాఫ్ట్‌వేర్.. లోపలంతా నేర స్వభావమే. అలాంటి క్రిమినల్ ఉండనే ఉండడు. కొల్లేరు ప్రజలకు చెందిన ఆరు కోట్లు కొల్లగొడితే.. అబ్బయ్య చౌదరి ఇంటి ముందు పేదలు వంద రోజులుగా వంటావార్పుతో కంచాలు కొడుతూ నిరసన చేస్తున్నారు. అయినా సిగ్గులేకుండా మాట్లాడుతారా? అదే టీడీపీలో అయితే నా ఇంటి ముందు ఇలాంటి ఉద్యమం జరిగితే మా నాయకుడు నన్ను పిలిచి అడిగేవారు. నా తప్పు ఉంటే మందలించేవారు. వెంటనే సమస్యను పరిష్కరించమని చెప్పేవారు. జగన్ రెడ్డికి ఇవేం పట్టవు. దెందులూరులో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు.. శుభకార్యానికి వెళితే తనపై కేసుపెట్టారని అబ్బయ్య నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడు. మేము శుభకార్యాలకు వెళ్లడంలేదా? ప్రజల్లో తిరగడంలేదా? ఎవరు తప్పు చేెశారో పెళ్ళికి పిలిచిన వ్యక్తినే చెప్పమనండి. చెలమలశెట్టి రమేష్ గురించి చెబుతున్నారు? ఆయన్నే చెప్పమనండి.. ఎవరిది తప్పో. నాది తప్పు అని తేలితే నేను అసెంబ్లీకి రాజీనామా చేస్తా? గంట అరగంట అంటూ మాట్లాడే వ్యక్తి అంబటికి.. నా క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత లేదు. అంబటి నాకు సర్టిఫికెట్ ఇవ్వడమేంటి. గంట, అరగంట గురించి ఎందుకు వివరణ ఇచ్చుకోలేదు. ఏ సుకన్య దొరకకపోవటంతో నా గురించి మాట్లాడుతున్నావా అని అంబటిపై చింతమనేని నిప్పులు చెరిగారు.
ప్రజలే మీ కోరలు పీకారు
తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరు. దెందులూరు, గుడివాడ, బందర్ ఎక్కడ ఉన్నా ఎవరైనా శిక్ష తప్పదు. వైసీపీ హయాంలో దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేస్తే అడిగినవారు లేరు. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా. వైసీపీ వారి తప్పు లేకుండా నా నియోజకవర్గంలో ఒక్క అక్రమ కేసు కూడా పెట్టలేదు. ఇదే కూటమి క్రమశిక్షణ. నన్ను ఇరికించాలని ప్రయత్నించి అబ్బయ్యే ఇరుక్కున్నాడు. కొల్లేరు డబ్బులు ఎగ్గొట్టాలన్న ప్లాన్‌లో భాగంగా స్కెచ్ వేశాడు. కావాలని పెళ్లిలో కారును అడ్డంపెట్టి రచ్చచేశారు. అక్కడి సెక్యూరిటీ వారు మూడు సార్లు చెప్పినా కార్లను అడ్డం తియ్యలేదు. ఏమి తెలియకుండా నోరు ఉంది కదా అని రాంబాబు అంబోతులా అరిస్తే సరిపోదు. ప్రజా క్షేత్రంలో ప్రజలే నీ కోరలు పీకారు. నీ కొమ్ములు విరిచారు. ఇంకెదుకు రంకెలు. వైనాట్ 175 అన్నారు. ప్రజలే మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టాలో అక్కడ పెట్టారు. ఇంకా మాట్లాడటానికి సిగ్గనిపించడంలేదా అని చింతమనేని దుయ్యబట్టారు.
తప్పులు బయటపడుతుంటే గావు కేకలు
అభివృద్ధి, సంక్షేమం లేదని మాట్లాడటానికి మీకు అర్హత ఉందా? రూ.4000 వేలు పింఛన్ ఇవ్వడం సంక్షేమం కాదా? మీ ప్రభుత్వంలో ఒక్క రోడ్డయినా వేశారా? టీడీపీ ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గంలో ఎక్కడా రోడ్లపై కూడా గుంతలు లేకుండా చేశారు. నా నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా ఉన్న అబ్బయ్య పట్టించుకోని రోడ్లన్నీ ఇప్పుడు వేస్తున్నాం. ఉగాది నాటికి రోడ్లన్నీ పూర్తి చేసి ప్రారంభిస్తాం.. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అబ్బయ్య గర్వపడాలి. నాడు కార్యకర్తలతో చందాలు వేసుకుని గుంతలు పూడుస్తుంటే రోడ్లు తవ్వారని నాపై పక్క నియోజకవర్గంలో కూడా అక్రమ కేసులు పెట్టారు. నేడు చేసిన తప్పులకు కేసులు పడుతుంటే గొంతు చించుకుంటున్నారు. దెందులూరులో అబ్బయ్య చరిత్ర అంతా బయటకు తీస్తా వదిలిపెట్టను. చేసిన తప్పులు బయటకు వస్తుంటే.. ఈ అరాచక వ్యక్తులకు నేడు రెడ్ బుక్ గుర్తుకు వస్తోంది. టీవీల ముందు గావు కేకలు పెడుతున్నారు. దుర్మార్గం ఎల్లకాలం నిలవదని ఇప్పటికైనా అరాచక మూకలు తెలుసుకోవాలని చింతమనేని అన్నారు.