రాజకీయాల్లో విలువలు కలిగిన నాయకుడు నారాయణస్వామి అని తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ దివంగత యర్రా నారాయణ స్వామి సంతాప సభ నిర్వహించారు. తొలుత నారాయణస్వామి చిత్రపటానికి టిడిపి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మన్గా, రాజ్యసభ సభ్యునిగా నారాయణస్వామి పనిచేసి ఆ పదవులకు వన్నెతెచ్చారన్నారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, నాయకులు సబ్నివీసు కృష్ణమోహన్, కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్ దాసరి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.