- సమగ్ర అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు
- అన్నింటా ముందుండాలన్నదే చంద్రబాబు లక్ష్యం
- పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే ఉద్దేశం
- జగన్ అండ్ కో రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు
- బీసీలకు వారి వల్ల ఒరిగిందేమీ లేదు
- గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి
మంగళగిరి(చైతన్యరథం): పేద బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కూట మి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖ రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విడుదల చేసిన విజన్ 2047 డాక్యుమెంట్‌లో బీసీల సమగ్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. బీసీలు అభివృద్ధి దిశగా బాటలు వేసేందుకు ఒక వినూత్న రీతిలో డాక్యుమెంట్‌ను తయా రు చేయడం జరిగిందని తెలిపారు. జగన్ దీనిని స్వాగతించకపోగా అవమానక రంగా మాట్లాడటం సరికాదన్నారు. విజన్ 2047 డాక్యుమెంట్‌ను బీసీలు ఆర్థికంగా, రాజకీ యంగా, విద్యాపరంగా, సామాజికపరంగా అన్ని రంగాల్లో ముందుండే విధంగా రూపొందించారు. ఇది జగన్‌కు ఇష్టంలేదు..ఆయనలో ఇంకా పెత్తందారీ పోకడలు పోలేదు. చంద్రబాబు ప్రవేశపెట్టే పూర్ టు రిచ్ విధానానికి జగన్ అనుకూలురో, వ్యతి రేకులో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బీసీల రక్షణ చట్టం గురించి కూడా విజన్ 2047 డాక్యుమెంట్‌లో పొందుపరచబడిరది. భవిష్యత్తులో బీసీలకు ఇదొక వజ్రాయుధం గా ఉపయోగపడుతుంది.
న్యాయపరంగా, సాంకేతిక పరంగా అన్ని అంశాలను కూలం కుశంగా చర్చించి ఈ రక్షణా చట్టాన్ని తయారు చేస్తున్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్లా లని చంద్రబాబు పరితపిస్తున్నారు. బీసీ ఫెడరేషన్, బీసీ సమాజం, సంఘాల బలోపేతం కోసం రోడ్ మ్యాప్ కూడా తయారు చేయడం జరిగింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇంటి ఎదురుగా ఉన్న బీసీల గృహాలను కూలదోయించి రోడ్డు వేసుకున్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ నాయకత్వంలో రూ.4,500 కోట్లు ఖర్చు చేసి 3000 కిలోమీ టర్లు సిమెంటు రోడ్లు నిర్మించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎంతో మేలు కల్పించారు. 2047 డాక్యుమెంట్ ద్వారా బడుగు, బలహీన వర్గాలకు ఆహార, ఆరోగ్య భద్రత, ఉపాధి, విద్యా భద్రత కల్పించనున్నారు. ఈ విధానంపై జగన్ అభిప్రాయం తెల పాలని ప్రశ్నించారు. జగన్ కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
జగన్ అండ్ కో దోచుకుతిన్నారు
ప్రతి ఒక ఇంటిలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని వివరించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కుటుంబాలను మాత్రమే జగన్ పారిశ్రామిక వేత్తలుగా తయారు చేశారని.. వారంతో రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ధ్వజమెత్తారు. మద్యాన్ని వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలకు అప్పగించారు. సొమ్ము మీకు, కష్టాలు పేద ప్రజలకు దక్కాయి. జగన్ హయాంలో కల్తీ మద్యం తాగి అనేక మంది చనిపోయా రు. 25 లక్షల మంది కిడ్నీ, లివర్ వ్యాధి, పక్షవాతంతో ఇబ్బంది పడ్డారు. జగన్ వైసీపీ నాయకుల కుటుంబాలలోని వ్యక్తులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తే చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలలోని ప్రజలను గుర్తించి 2047 విజన్ ద్వారా ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనుకుంటున్నారు. చంద్రబాబు మద్యం పాలసీ నచ్చి అనేకమంది స్వచ్ఛందంగా వచ్చి మద్యం షాపులు పాడుకున్నారు. రాష్ట్రంలో గౌడ కులస్థులకు మద్యం షాపుల్లో భాగస్వామ్యం కల్పించారు. వారికి కూడా కోటా కేటాయించి వారిని కూడా ముందుకు తీసుకెళుతున్నారు. జగన్ పాలనలో విదేశీ విద్య లేదు..ఉన్నత విద్యా శిక్షణ లేదు..
బీసీ భవనాలు లేవు.. మొత్తం రద్దు చేసేశారు. చంద్రబాబు వచ్చిన ఆరు నెలల్లోనే బీసీలకు రూ.39,700 కోట్లు బడ్జెట్ నిధులు మం జూరు చేశారు. రూ.1973 కోట్లు రుణాలకు కేటాయించి అందులో రూ.1850 కోట్లు సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. బీసీ స్టడీ సర్కిళ్లు పునరుద్ధరిస్తున్నాం. మెగా డీఎస్సీకి తొలి సంతకం చేయడం జరిగింది. 6 వేల మంది పిల్లలకు కోచింగ్ ఇస్తున్నాం. 100 మందిని ఐఏఎస్ కోచింగ్‌కు ఎంపిక చేసి ఉచిత శిక్షణ కోసం కోచింగ్ సెంటర్లు పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి జిల్లాకొక బీసీ భవన్ పెడితే వాటిని జగన్ వచ్చి ఆపేశా రు..నేడు వాటిని పునరుద్ధరిస్తున్నాం. ఉపాధి హామీ చట్టానికి బీసీ నిధులు అనుసం ధానం చేసి రాబోయే రోజుల్లో పెద్దఎత్తున బీసీ కమ్యునిటీ హాళ్ల నిర్మాణం చేయనున్నట్లు చంద్రబాబు నిర్ణయించారు. బీసీలకు కూటమి పాలన స్వర్ణయుగం కాబోతుందని స్పష్టం చేశారు.