- ప్రధానిగా ఆయన సేవలు చిరస్మరణీయం
- మంత్రి లోకేష్ నివాళులు
అమరావతి (చైతన్యరథం): భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఘనంగా నివాళులు అర్పించారు. నమ్మిన సిద్ధాంతాలకు చివరి వరకూ కట్టుబడిన వ్యక్తి వాజ్‌పేయి అని కొనియాడారు. దురైన అన్ని కష్టాలను ఓర్పుతో భరిస్తూ అద్భుతమైన దార్శనికత ప్రదర్శించారన్నారు. ఆర్థిక, మౌలిక సంస్కరణలతో దేశ రూపురేఖలు మార్చారు. వాజ్‌పేయి దూరదృష్టి కారణంగా దేశం వికసిత్ భారత్ దిశగా అడుగులు వేసేందుకు పటిష్టమైన పునాది ఏర్పడిరది. పార్లమెంట్ లోపలా వెలుపలా తనదైన ప్రసంగాలతో అందరినీ మంత్రముగ్దులను చేసేవారు. ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందామని మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు.