- ఐదు దేశాల నుంచి తెలుగువారు
- పెద్దఎత్తున పాల్గొన్న ఎన్‌ఆర్‌ఐలు
- చంద్రబాబు రాక ముందే ప్రాంగణం ఫుల్
సింగపూర్: తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, నారాయణ, భరత్, ఏపీఎన్‌ఆర్‌టీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు వేమూరి రవి, పెద్దఎత్తున తెలుగువారు, ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. సింగపూర్ సహా మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ సమీపంలోని ఐదు దేశాల నుంచి పెద్దసంఖ్యలో తెలుగు ప్రజలు, ఎన్‌ఆర్‌ఐలు వచ్చారు. సీఎం చంద్రబాబు రాకకు ముందే తెలుగువారితో ఆడిటోరియం నిండిపోయింది. మొత్తం 1500 సీటింగ్‌తో కూడిన ఒన్ వరల్డ్ ఇంటర్నే షనల్ స్కూల్ ప్రాంగణం నిండటంతో అనుబంధంగా ఉన్న ఆడి టోరియంలోకి సభికులను తరలించారు. ఐదు గంటల పాటు అత్యంత ఉత్సాహభరితంగా కార్య క్రమం సాగింది. భార్యాపిల్లలు, స్నేహితులతో ఎన్‌ఆర్ ఐలు కలిసి వచ్చారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 29 కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనను న్నారు. కార్యక్రమం అనంతరం దాదాపు 2,500 మందితో సీబీఎన్ ఫొటో సెషన్ జరిగింది. రెండున్నర గంటలపాటు ఓపిగ్గా నిలబడి ప్రతిఒక్కరినీ ఆప్యా యం గా పలకరించి ఫొటోలు దిగారు. సీఎంతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సమస్యలు పంచుకున్నారు. వేది కపైనే ఉండి ప్రతి కుటుంబం ఫొటోలు దిగేలా మంత్రి నారా లోకేష్ పర్యవేక్షించారు. పిల్లలతో తెలుగు డయా స్పోరాకు హాజరైన మహిళలను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
తొలిరోజు పర్యటన ఇలా …
ఉదయం 11:00 నుంచి 11:30 గంటల వరకు భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో షాంగ్రీ-లా హోటల్ వాలీ వింగ్‌లో సమావేశమయ్యారు. 11:30 నుంచి 12:00 గంటల వరకు సుర్భా జురాంగ్ సంస్థ ప్రతినిధులు చెర్ ఎక్‌లో, రిక్ యియో, జిగ్నేష్ పట్టానీ లతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 12:00 నుంచి 12: 30 గంటలకు ఎవర్‌సెండాయ్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తన్ శ్రీ డాటో ఏ.కె.నాథన్‌తో పెట్టు బడులపై చర్చించారు. మధ్యాహ్నం 2:00 నుంచి 6:30 గంటల వరకు ఒడబ్ల్యూఐఎస్ ఆడిటోరియంలో తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్ర మంలో పాల్గొన్నారు. సాయంత్రం 7:00 నుంచి 9:00 గంటల మధ్య భారత హైకమిషనర్ నివాసంలో సిం గపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, డయా స్పోరా నేతలతో విందులో పాల్గొన్నారు.
““