- పలు దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం
- పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత
- చైర్మన్ బి.ఆర్.నాయుడు వెల్లడి
తిరుమల(చైతన్యరథం): రథసప్తమిని పురస్కరించుకుని ఏర్పాట్లపై టీటీడీ పాలక మండలి శుక్రవారం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు ఏర్పాట్లపై నిర్ణ యాలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 4న జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై పాలకమండలి సమావేశం నిర్వహించాం. సప్త వాహనాలపై శ్రీవా రు తిరు మాడవీధుల్లో ఊరేగి దర్శనమిస్తారు. రథసప్తమి నాడు తెల్లవారుజామున 6.44 కు సూర్యోదయ గడియలు. ఈ గడియల్లో స్వామి వారిని సూర్యకిరణాలు తాకుతాయి. 2 లక్షల మంది వస్తారని అంచనా వేశాం. రథసప్తమి నాడు ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశాం. టైం స్లాట్ టికెట్స్ 3-5 వరకు రద్దు చేశాం. ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన భక్తులకు నిర్ణీత సమయంలో దర్శన భాగ్యం కల్పిస్తాం. 1250 మంది పోలీసులు, 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. పార్కిం గ్, అగ్నిప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. గ్యాలరీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. చక్రస్నాన సమయంలో పుష్కరిణిలో గజ ఈతగాళ్లను నియమించాం. గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్న పానీయాలు అందజేస్తాం. ఆలయ మాడ విధుల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశాం. 8 లక్షల లడ్డూలు భక్తుల సౌకర్యార్థం అందుబాటులో పెడుతాం. తిరుమలను విద్యుత్, పుష్పాలంకరణతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాం. మహాకుంభమేళాలో తప్పిపోయి న ఉద్యోగి కోసం టీటీడీ విజిలెన్స్, యూపీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీస ీకెమెరాల ఆధారంగా విచారణ సాగుతోంది. తొక్కిసలాటపై జుడీషియల్ ఎంక్వయిరీ జరుగుతున్న సమయంలో మరో ఎంక్వయిరీ చేయకూడదని తెలిపారు.