విశాఖపట్నం (చైతన్య రథం): బీహార్‌లో ఎన్డీఏ సాధించిన భారీ విజయం చారిత్రకమని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఈమేరకు ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. ‘‘ప్రగతిశీల పాలనను అందించగల మోదీ సామర్థ్యంపై ప్రజలకున్న విశ్వాశానికి బీహార్ విజయం నిదర్శనం. అలాగే, నరేంద్ర మోడీ విక్షిత్ భారత్ దార్శనికతపై ప్రజల నిరంతర విశ్వాసాన్నీ ఇది ప్రతిబింబిస్తుంది. ఈ అద్భుతమైన విజయంపై నా ప్రియమైన స్నేహితుడు నితీష్‌కుమార్, బీజేపీ, జేడీయూ కూటమిలోని విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు’’ అని పేర్కొన్నారు..














