- జిల్లా కలెక్టర్లు, అధికారులు తనిఖీలు చేపట్టాలి
- ఘటన జరిగాక కాదు..ముందే మేల్కొనాలి
- ప్రజల్లో ఉంటేనే కదా సమస్యలు తెలుస్తాయి
- ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు
- అతిసార, కల్తీ పాల ఘటనలపై సమీక్ష
అమరావతి(చైతన్యరథం): శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషి తం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు గురువారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో సమీక్షించారు. మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. రెండు ఘటనల్లో బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమె న ఘటనల్లో బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. రెండు ఘటనలకు దారి తీసిన పరిస్థితులపై కారణాలను విశ్లేషించాలని సూచించారు. ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాల న్నారు. ఘటన జరిగాక స్పందించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, ముందస్తు పర్యవేక్షణ, అప్రమత్తత ద్వారా ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, వివిధ విభాగాల్లోని జిల్లా స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడితే నివారించవచ్చని సూచించారు.
ప్రతి ప్రభుత్వ విభాగంలో కింది స్థాయి యంత్రాంగాన్ని యాక్టివేట్ చేసేందుకు, ఆయా విభా గాల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రతి అధికారి క్షేత్ర స్థాయి లో పర్యటించాలని ఆదేశించారు. ఒక్కో సందర్భంలో ఒక్కో శాఖపై ఆకస్మిక తనిఖీకి వెళ్లడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పా రు. కిందిస్థాయి అధికారులతో పాటు సంబంధిత శాఖల్లో జవాబు దారీ తనం పెరుగుతుందని.. అప్పుడు ఇలాంటి ఘటనలు నివారించవచ్చని స్పష్టం చేశారు. కలెక్టర్లు అంటే నిత్యం ప్రజల్లో ఉండాలని…అప్పుడే అనుకున్న మార్పు రాష్ట్ర స్థాయిలో చూపించ గలమని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో తాగునీరు కలుషితం అయిన ఘటనలో ముందస్తు పర్యవేక్షణ, తనిఖీలు జరిగి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.
జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు వివరించిన కలెక్టర్లు
సీఎంతో సమీక్ష సందర్భంగా శ్రీకాకుళం జిల్లా, తూర్పు గోదావ రి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వైద్య ఆరోగ్య శాఖ, మునిసిపల్ శాఖ అధికారులు రెండు ఘటనల్లోని ప్రస్తుత పరిస్థితులను వివరించా రు. డయేరియా ఘటనపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకూ 129 డయేరియా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 107 మందికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. ఆరోగ్యం మెరుగువ్వటంతో 20 మందిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. డయేరియా పరిస్థితిని ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. పైపుల ద్వారా జరుగుతున్న నీటి సరఫరాను నిలుపుదల చేసి ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నాం. నాలుగు ఇంజనీరింగ్ బృందాలు వివిధ ప్రాంతాల్లో 40 లీకులను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు.
150 మంది సిబ్బంది, 7 జేసీబీలు, 2 బాబ్ కాట్ యంత్రాలు, 10 టాక్టర్ల సాయంతో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాం. ఇవాళ రాత్రిలోగా విశాఖ నుంచి మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌ను శ్రీకాకుళానికి తరలిస్తున్నాం. ప్రభావిత ప్రాంతాల్లో 24 గంటలూ అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నాం. పారామెడిక్స్‌ను అందుబాటులో ఉంచాం. రిమ్స్, కిమ్స్, శ్రీకాకుళం జెమ్స్‌లో ప్రత్యే క వార్డుల ద్వారా డయేరియా రోగులకు చికిత్స అందిస్తున్నాం. నెఫ్రాలజీ నిపుణులు, ఇతర వైద్య నిపుణులను కూడా ఈ ఆస్పత్రు ల్లో అందుబాటులో ఉంచాం. డయేరియా వ్యాప్తికి కారణం ఏమిట న్న దానిపై విచారణ చేస్తున్నాం. డోర్ టూ డోర్ సర్వే చేసి శానిటేషన్ కిట్‌ను అందజేస్తున్నాం. స్థానికులు వాటర్ ట్యాంకులు క్లీన్ చేయకపోవడం, పైప్ లైన్ల డ్రైన్లు క్రాస్ అవ్వడంతో పాటు వాటర్ ప్రెజర్ లేదని మోటార్లు పెట్టి నీటిని తీసుకోవడం వల్ల కలుషిత నీరు ఇళ్లకు చేరిందని తెలిపారు.
మెరుగైన చికిత్సకు వైద్య నిపుణులు
కల్తీ పాల ఘటన, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై సీఎంకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వివరించారు. ఈ నెల 22 తేదీ జరిగిన కల్తీ పాల ఘటన వెలుగులోకి వచ్చింది. 20 మంది కల్తీ పాల కారణంగా అనారోగ్యం పాలయ్యారు. ఈ వ్యవహారంలో ఐదుగురు మృతిచెందారు. 15 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కల్తీ పాల సరఫరా జరిగిన చౌడేశ్వరీ నగర్, స్వరూప్ నగర్లో 9 వైద్య బృందాలను నియమించాం. 110 ఇళ్లను సందర్శించి 315 మంది నుంచి రక్త నమూనాలు కూడా సేకరించి విశ్లేషిస్తున్నాం. కల్తీ పాలను సేవించిన 957 మందిని ప్రతీ రోజూ పరీక్షిస్తున్నాం. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందించాం. ఈ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వైద్య బృందాలను కూడా అందుబాటలో ఉంచాం. ఈ ఘటనలో నింది తుడైన పాల సరఫరాదారు అడ్డాల గణేశ్వరరావుపై క్రిమినల్ కేసు నమోదు చేసి కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నాం.
అసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 8 మంది పరిస్థితి ఇప్పటికీ క్రిటికల్ గా ఉందని..ఇతర ప్రాంతల నుంచి వైద్య పరికరాలు తెప్పించి నిపుణులైన డాక్టర్లను తీసుకొచ్చి వైద్యం అందిస్తున్నామని తెలిపా రు. మిగిలిన వారి ప్రాణాలు కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయ త్నాలు చేస్తున్నామని వివరించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీ చేస్తున్నారని అధికారులు వివరించారు. సమీక్షలో మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, నిమ్మల రామనాయుడుతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొ న్నారు. జిల్లా నుంచి ఆన్ లైన్ విధానంలో రెండు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, శ్రీకాకుళం, రాజమండ్రి ఎమ్మెల్యేలతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు కూడా పాల్గొన్నారు.













