అమరావతి (చైతన్య రథం): ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు విస్తరించడానికి సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రశంసించారు. 150 రోజుల కూటమి పాలనపై శాసనసభ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘గత పాలకులు అక్రమ కేసులతో జైలులో పెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్లింది. వాళ్ల వరుస దోపిడీలు, అరాచకాలను చూసే ప్రజలు కూటమికి మద్దతు పలికారు. రాష్ట్ర భవిష్యత్తుపట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు. 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనతో సంతృప్తి చెందాం. ఏపీ సంపూర్ణ అభివృద్ధి దిశగా వెళ్తోందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా’ అని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు.