- అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధం
- పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పార్థసారథి
ఎన్టీఆర్ జిల్లా(చైతన్యరథం): పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆత్మార్పణ దినోత్సవం పేరిట ప్రత్యేక కార్యక్రమాలకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డు తూ ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజలు హాజరుకానున్నారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ నుందని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా కార్యక్రమం విజయవంతంగా నిర్వహిం చేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.