• కొండపి నియోజకవర్గం చెరువుకొమ్ముపాలెంలో ఓ పొగాకు గోడౌన్ వెళ్లిన యువనేత లోకేష్, అక్కడ పనిచేస్తున్న పొగాకు గ్రేడింగ్ కూలీలను కలిసి, వారి సమస్యలు తెలుసుకున్నారు.
• గ్రేడింగ్ మహిళా కూలీలు మాట్లాడుతూ…సీజనల్ గా ఏడాదిలో మూడునెలలు మాత్రమే తమకు పనిదొరుకుతుందని, మిగిలిన రోజుల్లో ఖాళీగా ఉండాల్సి వస్తోంది.
• పొగాకు పనివల్ల అనారోగ్యానికి గురయ్యే వారికి ప్రభుత్వం తరపున బీమా సౌకర్యం కల్పించాలి.
• పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ బిల్లులతో కుటుంబాలను పోషించడం భారంగా మారింది.
• మీరు అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గించి, ఏడాదంతా తమకు పని కల్పించేలా పరిశ్రమలు తీసుకురావాలని పొగాకు గ్రేడింగ్ మహిళా కూలీలు యువనేత లోకేష్ ను కోరారు.
నారా లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన బాదుడే బాదుడు అన్నచందంగా కొనసాగుతోంది.
• గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వస్తువుల ధరలతోపాటు అడ్డగోలు పన్నులను తగ్గిస్తాం.
• కొండపి ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుచేసి ఈ ప్రాంతంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
• పొగాకు గ్రేడింగ్ పనిచేసే మహిళా కూలీలకు చంద్రన్న బీమా పథకాన్ని వర్తింపజేస్తాం.