- ఇళ్లస్థలాలకు అనువైన భూములను గుర్తించాలి
- మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
ఒంగోలు(చైతన్యరథం): గృహ రుణాలకు అవసరమైన పొజిషన్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రాలు ఇబ్బందులు లేకుండా ప్రజలకు సకాలంలో అందించాలని సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సూచించారు. గురువారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాల తహసీల్దార్లు, ఒంగోలు, కనిగిరి ఆర్డీవో లు, హౌసింగ్ పీడీతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్లస్థలాల కోసం అనువైన ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు. భూ రీసర్వే పక డ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పరిశ్రమలకు భూములు కేటాయించే అంశంలో రైతులు, కలెక్టర్‌తో సంప్రదించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించా రు. గృహ రుణాలకు అవసరమైన పొజిషన్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రాలు పత్రా లు సకాలంలో అందజేయాలని తెలిపారు. అనంతరం గ్రామ సచివాలయ యానిమల్ హస్బెండ్రీ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు అటెండెన్స్ ఆప్షన్‌లో అదర్ ఆప్షన్‌ను పునరుద్ధరించరాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.