- సీట్ల కేటాయింపులో పనితీరే ప్రామాణికం
- ప్రతి మూడునెలలకోసారి నేతల తీరుపై సమీక్ష
- 14 నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో చంద్రబాబు బేటీ
అమరావతి: వచ్చే ఎన్నికల్లో అన్నీ అంశాలను పరి శీలించాక గెలుపుగుర్రాలకే టికెట్లు కేటాయిస్తామని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్ లతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమీక్షలు కొన సాగుతున్నాయి. ఇంచార్జ్‌లను యాక్టివేట్ చేసేందుకు అధినేత ఈ ముఖాముఖి సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజుల్లో 14మంది ఇంచార్జ్‌లతో చంద్రబాబు బేటీ అయ్యా రు. రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ముఖ్యనేతలతో ఈ సమీక్షలు ఉంటాయి. పార్టీ సభ్యత్వ నమో దు, ఓటరు లిస్ట్ పరిశీలన, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కమిటీల నియామకం, బాదుడే బాదుడు నిర్వహణ, గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం, సొంత సోషల్ మీడియా వేదికల ఏర్పాటు, ప్రజా సమస్యలపై స్థానికంగా పోరాటాలు వంటి మొత్తం 9 అంశాలపై అధినేత సమీక్షల్లో చర్చించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణతో పాటు సభ్యత్వ నమోదు వంటి అంశాల్లో వెనుకబడి ఉన్న వారికి గట్టి హెచ్చరికలు చేశారు. ఆయా విభాగాల్లో వెనుకబడిన, పార్టీ కార్యక్రమాలపై నిర్లక్ష్యం వహిస్తున్న ఇంచార్జ్‌లు రానున్న మూడు నెలల్లో తమ పనితీరులో స్పష్టమైన మార్పు చూపించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పని తీరు ఆధారంగానే ఎన్నికల్లో సీట్లు దక్కు తాయనే విషయాన్ని ఏ నేతకూడా మరువరాదని అన్నారు. తాము సీనియర్లు అనో, ఇతర సమీ కరణలతోనో తమకే సీటు వస్తుందనే అతి విశ్వాసం మంచిది కాదని నేతలకు స్పష్టం చేశారు. సీట్ల కేటాయింపునకు ఇంచార్జ్ పనితీరు మాత్రమే ప్రాతిపదికగా ఉంటుందని.. అన్నీ పరిశీలించిన తరువాత మాత్రమే సీట్ల ప్రకటన ఉంటుందని తెలిపారు. పైస్థాయి కమిటీ నుంచి సెక్షన్ ఇంఛార్జ్ వరకు వారికి అప్పగించిన బాధ్యతలను పూర్తిగా నెరవే ర్చాలని అన్నారు. నేతలు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని తన వద్ద ఉన్న డాటా ఆధారంగా విశ్లేషించిన చంద్రబాబు.. ఆయా కార్యక్రమాలు ఎందుకు నిర్వహించలేదని పలువురు నేతలను వివరణ కోరారు. రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ రివ్యూలు కొనసాగుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.