- అదే ఇంట్లో ఆడబిడ్డకు 20వ ర్యాంక్
కడప (చైతన్యరథం): మెగా డీఎస్సీలో కడప నగరానికి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ర్యాంకులను శుక్రవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. సయ్యద్ సనావుల్లా ఇప్పటికే ఉర్దూ ఎస్‌జీటీ టీచర్‌గా చాపాడు మండలంలో పని చేస్తుండగా, తాజా డీఎస్సీలో ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ ` ఫిజిక్స్ (హై స్కూల్ టీచర్)లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆయన భార్య నజీహా కరిమ్ ఇంట్లో ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూనే డీఎస్సీకి ప్రిపేర్ అయింది. 84.07 మార్కులతో ఎస్‌జీటీ ఉర్దూ విభాగంలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. అలాగే, ఆయన చెల్లి సయ్యద్ రేష్మ కూడా ఉర్దూ ఫస్ట్ ర్యాంక్ ఈడబ్ల్యూఎస్ విభాగంలో జిల్లాలో 20 ర్యాంక్ తెచ్చుకుంది. మొత్తానికి ఒకే ఇంట్లో ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో బంధు మిత్రులు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు. విషయం తెలుసుకున్న చాపాడు ఎంఈఓ రవి తన మండలంలో పని చేస్తున్న సనావుల్లాను శనివారం ప్రత్యేకంగా అభినందించారు.