- జే బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారు
- నచ్చిన కంపెనీలకే ఆర్డర్లతో భారీగా వసూళ్లు
- సిట్ ఏర్పాటు రోజే డాక్యుమెంట్ల దహనం
- అక్రమాలు మొత్తం పూర్తిగా బయటపెడతాం
- బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం
- తమ ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం, బ్రాండ్లు
- పారదర్శకంగా దుకాణాల కేటాయింపు
- అసెంబ్లీలో మద్యం విధానంపై కొల్లు రవీంద్ర
అమరావతి(చైతన్యరథం): గత జగన్‌రెడ్డి పాలన 2019-24 మధ్య కాలంలో మ ద్యం ఆర్డర్లన్నీ నచ్చిన వారికే ఇచ్చుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కొత్త గా 7 కంపెనీలను ఏర్పాటు చేసి దాదాపు 63 శాతానికి పైగా ఆర్డర్లు ఆ ఏడు కంపెనీ లకు కట్టబెట్టి ప్రతి కేసుకు సగటున రూ.200 వరకు అనధికారికంగా వసూలు చేసిన ట్లు ఆరోపణలున్నాయని మద్యం విధానంపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మద్యం, బీర్ల ద్వారా రూ.3113 కోట్లు దోచుకున్నారనే ఆధారాలు ఉన్నాయి..గతంలో ఐఎంఎఫ్‌ఎల్ మద్యం అన్ని రాష్ట్రాల్లో కూడా దొరికేవే ఇక్కడా దొరికేవి. కానీ గత ఐదేళ్లు స్థానిక బ్రాండ్లను తీసుకొచ్చి మిగిలిన బ్రాండ్లను తొక్కిపెట్టారు. గతంలో జాతీయ, అంతర్జాతీయ మద్యం కంపెనీలు మద్యం సరఫరా చేస్తే గత ఐదేళ్లు వాటిని బెదిరించి భయపెట్టి కంపెనీలను లాక్కున్నారు. అధికారంలోకి వచ్చి న తర్వాత ఎస్‌ఎన్‌జే, ఆదాన్, లీలా, ఎన్‌వీ, బీ9, సోనా, మునాక్ వంటి కంపెనీలను స్థాపించి ఆయా కంపెనీలకే 60 శాతానికి పైగా ఆర్డర్లు ఇచ్చారు. కమీషన్లు ఇవ్వని కంపె నీలను ఎంత దారుణంగా తొక్కిపెట్టారంటే.. 2018లో ఆఫీసర్స్ ఛాయిస్ 35 లక్షల కేసులు సరఫరా చేస్తే.. గత ప్రభుత్వంలో సరఫరా చేసింది కేవలం 5 లక్షల కేసుల ఆర్డర్లు మాత్రమే. మెక్‌డోవెల్స్ అయితే 22 లక్షల కేసుల నుంచి 5 కేసులకు కుదించారని గుర్తుచేశారు.
నాసిరకం మద్యంతో ప్రాణాలు తీశారు
2018-19లో తెలంగాణతో పోలిస్తే రెవెన్యూ వ్యత్యాసం రూ.4186 కోట్లు మాత్ర మే..కానీ 2023-24 నాటికి ఏకంగా రూ.42,762 కోట్లకు చేరింది. ఇందుకు కారణం నాణ్యమైన బ్రాండ్లను దూరం చేసి కల్తీ, నాసిరకమైన జే బ్రాండ్లను తీసుకురావడమే. కల్తీ మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్దడంతో జంగారెడ్డిగూడెంలో ఏకంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారు. మద్యం నాణ్యతను గాలికి వదిలేయడంతో మద్యం ఆధారిత నేరాలు, ఆత్మహత్యలు, కిడ్నీ, లివర్ సమస్యలు భారీగా పెరిగాయి. గుంటూరు జీజీహెచ్ డీ అడి క్షన్ కేంద్రంలో 2018లో 343 కేసులుంటే.. 2023 నాటికి ఏకంగా 4913 మందికి చేరారని గుర్తుచేశారు.
కూటమి పాలనలో నాణ్యమైన బ్రాండ్లు
కూటమి అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యం అందించడమే లక్ష్యంగా పరీక్ష లకు ప్రాధాన్యత ఇచ్చాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈఎన్‌ఏని 13 రకాలుగా, విస్కీ, బ్రాందీ, జిన్, వోడ్కాను 9 రకాలుగా, రమ్ 9 రకాల పరీక్షలు, బీర్ ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఏ స్థాయిలో కూడా కల్తీ అవ్వడానికి వీలు లేకుం డా ప్రొడక్షన్ నుంచి మద్యం షాపుల వరకు శాంపిల్స్ తెప్పించి పరీక్షిస్తున్నాం. గత ఐదేళ్ల పాటు ఎక్కడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ అండ్ క్యారీతో ప్రజలను దోచుకున్నా రు. కూటమి అధికారంలోకి వచ్చాక 3396 షాపులను అత్యంత పారదర్శకంగా కేటా యించాం. దరఖాస్తుల ఫీజు రూపంలో రూ.1797 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిం ది. తొలిసారిగా ఏపీలో కల్లుగీత కార్మికులకు 350 షాపులు కేటాయించాం. లైసెన్సు ఫీజులో రూ.103 కోట్ల సబ్సిడీ భరిస్తున్నాం. కూటమి అధికారంలోకి వచ్చాక 150కి పైగా బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చి వినియోగదారులు కావాల్సిన బ్రాండ్ తీసుకునే వెసులుబాటు కల్పించాం. అదే సమయంలో రూ.99కే క్వార్టర్ మద్యాన్ని తీసుకొచ్చి పేద లు కల్తీ మద్యం వైపు, నాటు సారా వైపు మళ్లకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల ఆరోగ్య రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సీఐడీ విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలు మొత్తం బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మద్యం అక్రమాల విచారణకు సిట్ ఏర్పాటు చేసిన రోజునే తాడేపల్లి ప్యాలెస్ వద్ద డాక్యుమెంట్లు తగులబెట్టారు. ప్రజల జేబులు కొల్లగొట్టిన వారిపై తప్ప కుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.