- సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్లు మళ్లించి పేదలకు ద్రోహం చేశారు
- ‘నా ఎస్సీ ఎస్టీలంటూ మొసలి కన్నీళ్లు కార్చారు..
- చెప్పేదొకటి చేసేదొకటికి జిరాక్స్ కాదా?
- వర్దెల్లి మురళి అబద్దాల కుతంత్రం -14
2-3-2025న అవినీతి విష పుత్రిక ‘సాక్షి’లో తన యజమాని అవలక్షణాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంటగట్టి వర్దెల్లి మురళి మరో అబద్ధాల వ్యాసం రాశారు. ‘‘మూడు మాయలేళ్లు కలిసి కూటమి కట్టి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నుంచి హామీల అమలు గురించి ఆశించడం అంటే మరీచికల వెంట పరుగులు తీయడమే’’నని కూటమిలోని మూడు పార్టీలను మాయలేళ్లు, మరీచకలంటూ సాక్షి ఎడిటర్ వర్ధెల్లి మురళి చెప్పిన అబద్ధమే వందసార్లు చెబుతున్నారు. ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్ని ఎల్లవేళలా మోసం చేయడం ఎవరి తరం కాదు. జగన్ మాయమాటలు, సాక్షి అబద్ధపు ప్రచారాలకు ఒకసారి మోసపోయిన ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.15,000 ఇస్తామని జగన్ ముఠా ప్రచారం చేసుకుంది. అధికారానికి వచ్చి మాట తప్పి ఒక్కరికే రూ.13,000 మాత్రమే ఇచ్చారు. ఆనాడు రాష్ట్రంలో 85 లక్షల మంది పాఠశాలల్లో పిల్లలుంటే.. అందులో 35 లక్షల మందికి మాత్రమే అమ్మఒడి ఇచ్చి 40 లక్షల మందికి ఎగనామం పెట్టారు. ఇది జగన్ మాయలేడి తత్వం.
కూటమి పాలనలో ‘తల్లికి వందనం’ పథకానికి బడ్జెట్‌లో 9,407 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది 75 లక్షలమంది పిల్లలకు ఒక్కొక్కరికి రూ.15,000 ఇవ్వడానికి సరిపోతుంది. ఢల్లీి పబ్లిక్ స్కూల్‌లాంటి ఖరీదైన విద్యాసంస్థల్లో చదువుకొనే సంపన్నుల బిడ్డల్ని మినహాయిస్తే మిగతా పిల్లలందరికీ ‘తల్లికి వందనం’ ఇవ్వబడుతుంది. 35 లక్షల మంది పిల్లలకి రూ.13,000 ఇచ్చిన జగన్ మోసకారి అవుతారు. 75 లక్షల మంది పిల్లలకు రూ.15,000 ఇస్తున్న చంద్రబాబు పేదల పెన్నిధి అవుతారు. చంద్రబాబు మాటపై నిలబడ్డ విద్యాదాత.
జగన్‌రెడ్డి 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే అమ్మఒడి ఇవ్వలేదు. 2020లో మాత్రమే అమ్మఒడి ప్రారంభించారు. మొదటి ఏడాదిలో పింఛన్లకు పెంచింది రూ.250 మాత్రమే. ఇలా జగన్ మేనిఫెస్టోలోని హామీలు ఐదేళ్లల్లో పూర్తిగా అమలు చేసింది 15శాతం మాత్రమే. 10 లక్షల కోట్లు అప్పు చేసి కూడా హామీల్లో 85శాతం ఎగనామం పెట్టారు. తెచ్చిన అప్పులు అవినీతి స్కీములకు మళ్ళించాడు. సెంటు పట్టాకు సంబంధించిన ఒక్క స్కీమ్‌లోనే రూ.7వేల కోట్లు అవినీతి చేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజా, డ్రగ్స్, ఎర్ర చందనం మాఫియాలుగా మారి లక్షల కోట్లు జగన్ ముఠా దోపిడీ చేసింది. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పింఛన్లు ఒక్కసారిగా రూ.1,000 పెంచి రూ.4,000లు ఇస్తున్నారు. దివ్యాంగులకు పింఛన్లు రూ.3 వేలనుండి రూ.6 వేలకు పెంచారు. కూటమి ప్రభుత్వం ఒక్క పింఛన్లకే ఐదేళ్లల్లో రూ.1.60 లక్షలు ఇస్తోంది.
అదేవిధంగా సూపర్ సిక్స్‌లో భాగంగా 93 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇవ్వబడిరది. మే, జూన్ నెలల్లో 75 లక్షలమంది పిల్లలకు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ క్రింద రైతులకు రూ.6,300 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుండి ఇవ్వబోతున్నారు. రైతు భరోసాకు రాష్ట్ర నిధుల నుండి ఒక్కొక్క రైతుకు జగన్ ఇచ్చింది రూ.7,500 మాత్రమే. అన్నదాత సుఖీభవకు రాష్ట్ర నిధుల నుండి ఒక్కొక్క రైతుకు చంద్రబాబు ఇస్తున్నది రూ.14,000. జగన్ డీఎస్సీపై మాట తప్పారు. ఒక్క డిఎస్సీ కూడా జరపలేదు. చంద్రబాబు ప్రభుత్వం రేపు పాఠశాలల ప్రారంభ సమయానికి డీఎస్సీ పూర్తిచేసి 16,347 ఉపాధ్యాయ నియామకాలు చేయడానికి విద్యాశాఖమాత్యులు లోకేష్ కృషి చేస్తున్నారు. ఇలా 8 నెలల్లోనే కూటమి ప్రభుత్వం 500కు పైగా మంచి పనులు చేసింది. జగన్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఏడాదికి సుమారు రూ.60 వేల కోట్లు వడ్డీ అసలు వాయిదాలు చెల్లించాలి. దీంతోపాటు ఆయన పెట్టిపోయిన బకాయిలు రూ.1.40 లక్షల కోట్లు చెల్లించాలి. చంద్రబాబు తన అనుభవం, కఠోర శ్రమ, కేంద్రం తోడ్పాటుతో ప్రతి హామీనీ నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం నుండి హామీల అమలు గురించి ఆశించడం అంటే మరీచికల వెంట పరుగులు తీయడమే నన్న వర్ధెల్లి మురళి ఆరోపణ పచ్చి అబద్ధమని రుజువైంది. జగన్ ప్రభుత్వ అవలక్షణాల్ని కూటమి ప్రభుత్వానికి అంటగట్టే కుట్ర చేశారు. జగన్ పాలనలో మద్య నిషేధం హామీపై మడమ తిప్పారు. పైగా విషపూరిత మద్యం పోసి 35 లక్షలమంది పేదలని రోగాలపాలు చేశారు. అందులో 30,000 మంది ప్రాణాలు పోయి వారి భార్యల మాంగల్యాలు తెంచారు. మద్యం ధరలు పెంచి రూ.లక్ష కోట్లు జగన్ ముఠా దోపిడీ చేసింది. ఇసుక మాఫియావల్ల ప్రజా రాజధాని నిర్మాణంతోపాటు రాష్ట్రంలో నిర్మాణాలు నిలిచిపోయాయి. దీనివల్ల నాలుగు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. అన్న క్యాంటీన్లు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, విదేశీ విద్య, పండగ కానుకలులాంటి 120 చంద్రన్న సంక్షేమ పథకాలు రద్దు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు రూ.లక్ష కోట్లు దారి మళ్ళించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి పేదల అసైన్మెంట్ భూములు పది లక్షల ఎకరాలు కబ్జా చేశారు. ఇలా ప్రజల ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు జగన్ పాలనలో రక్షణలేని స్థితిని ప్రజలు అనుభవించారు. ఈ చేదు జ్ఞాపకాలని సాక్షి మీడియా అబద్ధపు ప్రచారాలతో చెరిపేయగలమనుకుంటే ప్రజల వివేకాన్ని తక్కువ అంచనా వేయడమే. కోడి కత్తి, గులకరాయి డ్రామాలు, వివేకానంద రెడ్డి హత్యతో సానుభూతి నాటకాలు ఇక చెల్లవు. పైగా అలాంటివి ఇప్పుడు రిపీట్ చేస్తే తిరిగి అవి వారి మెడకే చుట్టుకుంటాయి. కూటమి పార్టీల మధ్య చిచ్చు కూడా పెట్టలేరు. ప్రాంతీయ కుల చిచ్చు పెట్టాలనుకున్నా ఇప్పుడు ప్రజలు సాగనివ్వరు. మీ చుట్టూ మూగేది ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం మాఫియా గుంపేగాని ప్రజలు కాదు.
అబద్ధాలు, విద్వేషాలు, దౌర్జన్యాలు, కుట్రలతో ఇకపై వైసీపీ మనుగడ సాగించలేదు. మాఫియా మార్గం విడనాడి.. ప్రజాస్వామ్య పంథాకు మారకపోతే వైకాపా తిరిగి కోలుకోదు. 2024 ఎన్నికల్లో కూటమి 57శాతం ఓట్లతో గెలిచింది. ఇప్పడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 60శాతం పైగా ఓట్లతో గెలిచారు. కూటమి ప్రభుత్వం 2029లోనూ తిరిగి అధికారానికి వస్తుంది. స్వర్ణాంధ్ర విజన్ `2047 సాధించి, తెలుగువారిని అగ్రస్థానంలో నిలుపుతుంది.
గురజాల మల్యాద్రి,
చైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్