ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నవారు చంద్రన్న తప్ప మరెవ్వరూ లేరు. ఇన్నేళ్ల ప్రజాదరణ.. పార్టీ ఆమోదం పొందటానికి ఆయనలోవున్న ప్రత్యేకతలు ఏమిటి?
1. తెలుగువారిని ప్రపచంలో ఉన్నత స్థానంలో నిలపాలన్న ఉక్కు సంకల్పంతో కూడిన ఆయన విజన్ మొదటి ప్రత్యేకత.
2. పెద్ద పెద్ద కలలు కనండి.. వాటి సాకారానికి దీక్షతో పనిచేయండన్న అబ్దుల్ కలాం అభిలాషకు నిలువెత్తు రూపం చంద్రన్న. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ ఆశయానికి ఆచరణ రూపం చంద్రన్న. చేపలు పట్టేది నేర్పించాలన్న చైనా సామెతను తెలుగు నేలపై చేసి చూపుతున్న నేత మన చంద్రన్న.
3. పూలే, అంబేద్కర్ సామాజిక న్యాయ ఆకాంక్షకు ప్రతిరూపం మన చంద్రన్న.
4. అభివృద్ధి ప్రదాత, పేదల పెన్నిధి మన చంద్రన్న.
5. సవాళ్లకు తలవంచక ఎదురొడ్డి పోరాడి.. సంక్షోభంలో అవకాశాలను ఒడిసిపట్టిన సృజనశీలి మన చంద్రన్న.
6. స్మార్ట్ అండ్ హార్డ్‌వర్క్ ఆయన మరో ప్రత్యేకత.
7. నిందలకు, ఓటములకు, క్లైమోర్ దాడులకు, అక్రమ జైలు నిర్బంధాలకు కృంగిపోకుండా ఎదురొడ్డి పోరాడే ధీరోదాత్తుడు మన చంద్రన్న.
8. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడు ఆయన.
9. పార్టీలో, ప్రభుత్వంలో ప్రజాస్వామిక వ్యవహార తీరువల్లనే ఇన్నేళ్లూ ప్రజాదరణ, పార్టీ ఆమోదం పొందగలిగారు. ఇన్‌స్పైరింగ్ లీడర్ చంద్రన్న.
10. నిగర్వి, నైతికత, పట్టువిడుపులు ఆయన సొంతం.
11. కార్యకర్తలను కుటుంబంగా చూసే తీరు, ఆపదలోవున్న ప్రజలను క్షేత్రస్థాయిలో నిలబడి ఆదుకునే తీరులో ఆయనకు ఆయనే సాటి.
12. యువతను వెన్నుతట్టి ప్రోత్సహించటం, సుశిక్షితులను చేయడం, క్రమశిక్షణ నేర్పించటంలో మేటి మన చంద్రన్న.
13. కుల, మత, ప్రాంతీయ సంకుచిత ధోరణులకు అతీతం ఆయన. ప్రాపంచిక దృక్పథం, దేశభక్తి, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపైనే శ్వాస, ధ్యాస.
14. ఇన్ని ఉత్తమోత్తమ ఉన్నత ఆశయాలు, లక్షణాలు కలిగి వున్నందునే ఎవరికీ దక్కని ప్రజాదరణ, పార్టీ ఆమోదం ఆయనకు లభించాయి.
15. 2004లో చంద్రన్న తిరిగి సీఎం అయివుంటే.. ఉమ్మడి రాష్ట్రంలోని 294 నియోజకవర్గ కేంద్రాలు 294 మినీ సైబరాబాద్‌లు అయ్యేవి. 2019లో జగన్ ముఠా అబద్ధాలను సకాలంలో తిప్పికొట్టి మన చంద్రన్న చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని క్షేత్రస్థాయిఱలో బ్రాండిరగ్ చేసి ఆయనను తిరిగి సీఎం చేసివుంటే.. పోలవరం, నదుల అనుసంధానం ఈపాటికే పూర్తై.. కరవురహిత ఏపీ ఏర్పడి ఉండేది. ప్రజా రాజధాని అమరావతి మరో సైబరాబాద్‌గా మారి.. 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించి ఉండేది. కోడికత్తి, గులకరాయిలాంటి కుట్రలపట్ల, కుల మత ప్రాంతీయ విద్వేషాల పట్ల ప్రజా చైతన్యం పెంచుదాం. స్వర్ణాంధ్రప్రదేశ్`2047 సాధించాలంటే 2029లో తిరిగి కూటమిని అధికారంలోకి తేవడమే మనం చంద్రన్నకు ఇచ్చే గౌరవం.
గురజాల మాల్యాద్రి,
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్